'ఆ సినిమాలో నేనే నటిస్తా' | I would love to act in a biopic on my life: PV Sindhu | Sakshi
Sakshi News home page

'ఆ సినిమాలో నేనే నటిస్తా'

Published Thu, Jan 28 2016 2:52 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

'ఆ సినిమాలో నేనే నటిస్తా'

'ఆ సినిమాలో నేనే నటిస్తా'

హైదరాబాద్: తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తే నటించేందుకు సిద్ధమని స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. అయితే ఈ సినిమా ఎవరు తీస్తారు, ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారనే దానిపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని అంది. అన్ని కుదిరితే నటించడానికి తనకేమీ అభ్యంతరం ఉండబోదని వెల్లడించింది.

మ్యూజిక్ అంటే తనకెంతో ఇష్టమని 20 ఏళ్ల సింధు తెలిపింది. సినిమాలు ఎక్కువగానే చూస్తుంటానని చెప్పింది. సానియా మీర్జా, సైనా నెహ్వాల్  పద్మభూషణ్ పురస్కారాలు రావడంతో 'ఎస్' అక్షరం తమకు అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. సింధు గతేడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.

బ్యాడ్మింటన్ లో మరింతగా రాణిస్తానన్న నమ్మకాన్ని సింధు వ్యక్తం చేసింది. అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తానని సింధు తెలిపింది. తాజాగా రెండోసారి మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్న ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement