మనం చిన్న సమస్యకే విలవిలలాడిపోతాం. కాస్త బాగోకపోతేనే చేస్తున్న పనిని వదిలేస్తాం. కానీ ఈ అమ్మాయి పుట్టుకతో వచ్చే లోపంతో పోరాడింది. అది ప్రాణాంతకంగా మారి పరిస్థితిని దారుణంగా దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకుని బయటపడిందనుకున్నా..దివ్యాంగురాలిగా చేసి బాధపెట్టింది. అయితేనేం తగ్గేదే లే..! అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించడమేగాక పారాలింపిక్స్‌లో సత్తా చాటింది. రజత పతకంతో యావత్ దేశం గర్వపడేలా చేసింది. ఇంతకీ ఎవరీమె? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..
భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ సెప్టెంబర్ 2న జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె SU5 ఫైనల్‌లో మహిళల సింగిల్స్‌కు చేరుకుంది. అయితే చైనాకు చెందిన యాంగ్ క్విక్సియా చేతిలో ఓడిపోయింది. కేవలం 30 నిమిషాల్లో 21-17, 21-10తో యాంగ్ క్విక్సియా మ్యాచ్‌ను గెలుచుకుంది. చివర వరకు ఉత్కంఠను రేపేలా ఆడి రజత పతకంతో భారతదేశం గర్వించేలా చేసింది. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా మురుగేషన్ చరిత్ర సృష్టించారు.
ఎవరంటే ఆమె..?
తులసిమతి మురుగేశన్ తమిళనాడులోని కాంచీపురానికి చెందింది. ఆమె పుట్టుకతో వచ్చే వైకల్యం తులసిమతి జీవితాన్ని అగాధంలోకి నెట్టిసింది. ఆ వైకల్యం కారణంగా బోటన వేలును కోల్సోవమే గాక ప్రాణాంతకమై ఆమె పరిస్థితిని దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకున్నా.. ఎడమ చేయి చలనం కోల్పోయి దివ్యాంగురాలిగా చేసింది. అయితాన లెక్క చేయక క్రీడలపై దృష్టిసారించి. కక్రీడల పట్ల అమిత ఆసక్తిగల తండ్రి సాయంతో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. సమర్థులైన క్రీడాకారులతో ఆడేలా నైపుణ్యం సంపాదించుకుంది.
అంతేగాదు ఆమె వెటర్నరీ సైన్సు విద్యార్థి కూడా. ఆమె సోదరి కిరుత్తిమా కూడా బ్యాడ్బింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక జిల్లా స్థాయి ఆటలను గెలుచుకుంది. అంతేగాదు తులసీమత్ ఐదవ ఫజ్జా దుబాయ్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2023లో మహిళల డబుల్స్ ిభాగంలో మానసి జోషితో కలిసి బంగారు పతకాన్ని సాధించింది. ఆమె అదే ఈవెంట్‌లో నితేష్ కుమార్‌తో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ఆమె అకుంఠితమైన పట్టుదల, శ్రమ ఎన్నో అవార్డులను, గౌరవ సత్కారాలను తెచ్చిపెట్టాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలిచింది. జీవితం ఇచ్చే పెట్టే పరీక్షకు తలొగ్గక నచ్చినట్లుగా నీ తలరాతను రాసుకునేలా దూసుకుపోవడం అంటే ఏంటో చేసి చూపింది.
A moment of immense pride as Thulasimathi wins a Silver Medal in the Women's Badminton SU5 event at the #Paralympics2024! Her success will motivate many youngsters. Her dedication to sports is commendable. Congratulations to her. @Thulasimathi11 #Cheer4Bharat pic.twitter.com/Lx2EFuHpRg
— Narendra Modi (@narendramodi) September 2, 2024
(చదవండి: కిమ్ కర్దాషియాన్‌లా కనిపించాలని ఏకంగా రూ. 8 కోట్లు..పాపం ఆమె..!)
Comments
Please login to add a commentAdd a comment