సాక్షి,అమరావతి: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సింగిల్స్ ఫైనల్లో సిల్వర్ మెడల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడిగా కిడాంబి శ్రీకాంత్ సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశం గర్విస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఉజ్వలమైన కెరీర్‌తో పాటు మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.
Many congratulations to our Telugu shutler @srikidambi on winning historic silver after a hard-fought final in BWF World Championship 2021. Wishing him all the best for a bright career and many more laurels in the future.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 19, 2021
గవర్నర్ అభినందనలు
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్ ఫైనల్లో సిల్వర్ మెడల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కిడాంబి శ్రీకాంత్ భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
చదవండి : శభాష్ శ్రీకాంత్...
Comments
Please login to add a commentAdd a comment