పీవీ సింధుకు ప్రశంసల వెల్లువ | PV sindhu defeats carolina Marin, Congratulations several CMs | Sakshi
Sakshi News home page

పీవీ సింధుకు ప్రశంసల వెల్లువ

Published Mon, Apr 3 2017 2:09 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

పీవీ సింధుకు ప్రశంసల వెల్లువ

పీవీ సింధుకు ప్రశంసల వెల్లువ

హైదరాబాద్‌ : ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న భారత నంబర్‌వన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశంలో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన ఆమెను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు అభినందిస్తున్నారు. సింధును అభినందిస్తూ... భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ట్విట్టర్‌ ద్వారా ఆకాంక్షలు తెలిపారు.

సింధును అభినందించినవారిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, హర్యానా మనోహర్‌ లాల్‌ ఖట్టర్, ఒడిశా ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్‌ తదితరులు ఉన్నారు. అలాగే క్రికెటర్స్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, శరద్‌ పవార్‌, రాజ్యసభ ఎంపీ విజయ్‌ గోయిల్‌,హీరోయిన్లు అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సెంథిల్‌ కుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ సింధూకు శుభాకాంక్షలుత తెలిపారు. కాగా మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు 21–19, 21–16తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)పై గెలిచిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement