వుహన్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు ఓటమి చవిచూశారు.
వరల్డ్ నెంబర్ వన్ సైనా 21-16 13-21 18-21 స్కోరుతో ఐదో సీడ్ జు యింగ్ తాయ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. 55 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సైనా మూడు గేమ్ల్లో మ్యాచ్ను కోల్పోయింది. మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్ సింధు 21-11 19-21 8-21తో టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. 52 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది.
క్వార్టర్స్లో సైనా, సింధు ఓటమి
Published Fri, Apr 24 2015 5:44 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement
Advertisement