Asia Badminton Championship
-
శ్రమించి గెలిచిన సింధు, ప్రణయ్
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ మాత్రమే బరిలో మిగిలారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 64 నిమిషాల్లో 18–21, 21–14, 21–19తో ప్రపంచ 33వ ర్యాంకర్ గో జిన్ వె (మలేసియా)పై... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 90 నిమిషాల్లో 17–21, 23–21, 23–21తో ప్రపంచ 16వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)పై గెలుపొందారు. గతంలో గ్వాంగ్ జుతో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ నాలుగో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రణయ్ రెండో గేమ్‌లో, మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మాళవిక (భారత్) 18–21, 19–21తో సిమ్ యు జిన్ (కొరియా) చేతిలో, ఆకర్షి కశ్యప్ 10–21, 11–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్ 19–21, 15–21తో టాప్ సీడ్ షి యుకీ (చైనా) చేతిలో, కిడాంబి శ్రీకాంత్ 14–21, 13–21తో రెండో సీడ్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో, ప్రియాన్షు 9–21, 13–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 2–21, 12–21తో లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
షా ఆలమ్ (మలేసియా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చైనాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 6–21, 21–18, 21–19తో వెంగ్ హంగ్ యంగ్‌పై గెలిచాడు. రెండో మ్యాచ్‌లో అర్జున్–ధ్రువ్ కపిల జోడీ 15–21, 21–19, 19–21తో చెన్ బొ యంగ్–లియు యి చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–11, 21–16తో లీ లాన్‌పై నెగ్గాడు. నాలుగో మ్యాచ్‌లో సూరజ్–పృథ్వీ జంట 13–21, 9–21తో జియాంగ్ యు–జి హావో ద్వయం చేతిలో ఓడింది. ఐదో మ్యాచ్‌లో చిరాగ్ సేన్ 15–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ 2–3తో పరాజయం చవిచూసింది. మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్‌తో భారత్; పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో జపాన్ తో భారత్ ఆడతాయి. గెలిచిన జట్లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. -
చైనాకు భారత మహిళల షాక్
షా ఆలమ్ (మలేసియా): బ్యాడ్మింటన్‌లో మేటి జట్టయిన చైనాకు భారత్ చేతిలో ఎదురుదెబ్బ తగిలింది.. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో చక్కటి ప్రదర్శనతో భారత మహిళల జట్టు 3–2తో చైనా బృందాన్ని కంగు తినిపించింది. అన్నింటికి మించి భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు చాన్నాళ్ల తర్వాత విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత సీజన్ ఆసాంతం నిరాశపర్చిన ఆమె ఈ ఏడాది గట్టి ప్రత్యర్థిపై ఘనమైన విజయంతో సత్తా చాటుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–17, 21–15తో హన్ యుపై గెలిచి జట్టును 1–0తో ఆధిక్యంలో నిలిపింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన సింధు కేవలం 40 నిమిషాల్లోనే తనకన్నా మెరుగైన ర్యాంకర్ ఆట కట్టించింది. రెండో గేమ్‌లో సింధు ఒక దశలో 10–13తో వెనుకబడినా...తర్వాతి 13 పాయింట్లలో 11 గెలుచుకొని విజేతగా నిలవడం విశేషం. అనంతరం జరిగిన డబుల్స్ పోటీల్లో అశ్విని పొన్నప్ప–తనీషా కాస్ట్రో జోడీ 19–21, 16–21తో లియు షెంగ్ షు–తన్ నింగ్ జంట చేతిలో ఓడటంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ వెంటనే జరిగిన రెండో సింగిల్స్‌లో అషి్మత చాలిహ 13–21, 15–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో ఓడిపోవడంతో భారత్ 1–2తో వెనుకబడింది. ఈ దశలో మరో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి... ట్రెసా జాలీతో కలిసి డబుల్స్ బరిలో దిగి మ్యాచ్ గెలుపొందడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. గాయత్రి–ట్రెసా ద్వయం 10–21, 21–18, 21–17తో లి యి జింగ్–లు జు మిన్ జంటపై నెగ్గడంతో భారత్ 2–2తో చైనాను నిలువరించింది. దీంతో అందరి దృష్టి నిర్ణాయక పోరుపైనే పడింది. ఇందులో అంతగా అనుభవం లేని 472 ర్యాంకర్ అన్మోల్ ఖర్బ్ 22–20, 14–21, 21–18తో ప్రపంచ 149వ ర్యాంకర్ వు లు యుపై అసాధారణ విజయం సాధించి భారత్‌ను గెలిపించింది. తొలి సారి ఈ టోర్నీలో బరిలోకి జాతీయ చాంపియన్ అన్మోల్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రణయ్ ఓడినా... పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ 4–1తో హాంకాంగ్‌పై జయభేరి మోగించింది. తొలి సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 14–21తో ఎన్గ్ క లాంగ్ అంగుస్ చేతిలో ఓడినా... తుది విజయం మనదే అయింది. ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–16, 21–11తో లుయి చున్ వాయ్–యింగ్ సింగ్ చొయ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. రెండో డబుల్స్‌లో ఎమ్.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–12, 21–7తో చొ హిన్ లాంగ్–హంగ్ కుయె చున్ జోడీపై నెగ్గింది. 3–1తో విజయం ఖాయమవగా... ఆఖరి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–14, 21–18తో జాసన్ గునవాన్‌పై గెలుపొందడంతో ఆధిక్యం 4–1కు పెరిగింది. మహిళల గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండే జట్లు ఉండటంతో భారత్, చైనా ఈ మ్యాచ్‌కు ముందే నాకౌట్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో మాత్రం గురువారం జరిగే పోరులో చైనాతో భారత్ తలపడుతుంది -
గర్వంగా ఉంది: సాత్విక్- చిరాగ్‌లకు సీఎం జగన్ అభినందనలు
Satwiksairaj- Chirag Shetty: బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2023లో పసిడి పతకం గెలిచిన సాత్విక్- చిరాగ్‌లను ఆయన అభినందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ విజయాల పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సోమవారం ట్వీట్ చేశారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఎట్టకేలకు రెండో స్వర్ణం లభించిన విషయం తెలిసిందే. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్ ఖన్నా చాంపియన్‌గా నిలవగా.. 58 ఏళ్ల తర్వాత పురుషుల డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ తమ అద్భుత ఆటతీరుతో భారత్‌కు పసిడి పతకం అందించారు. ఈ భారత జోడీ పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జంటను ఓడించి విజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా సరికొత్త చరిత్ర సృష్టించారు సాత్విక్- చిరాగ్. సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు కాగా.. చిరాగ్ శెట్టి స్వరాష్ట్రం మహారాష్ట్ర. చదవండి: IPL 2023: మిస్టర్ కూల్‌కు ఆగ్రహం! వైరల్ వీడియో చూశారా? -
చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్.. తొలి భారత జోడీగా రికార్డు
దుబాయ్: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ఫైనల్లోకి ప్రవేశించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో ఆరో సిడ్ సాత్విక్–చిరాగ్...చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్ – వాంగ్ చిన్ లిన్‌పై విజయం సాధించారు. తొలి గేమ్‌ను 21–18తో గెలుచుకున్న భారత జంట రెండో గేమ్‌లో 13–14తో వెనుకబడి ఉన్న దశలో వాంగ్ చిన్ లిన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో ‘వాకోవర్’తో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. 41 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీ (మలేసియా)తో భారత జోడి తలపడుతుంది. -
చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ జోడీ.. 52 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక పతకం ఖాయమైంది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–11, 21–12తో అహసాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీని ఓడించింది. HISTORY SCRIPTED 🥳🥳🥳 ➡️ Sat-Chi assured medal for India after 52 years in MD category ➡️ Medal from Indian doubles department after 9 years Well done boys, proud of you! 🥹🫶@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BAC2023#IndiaontheRise#Badminton pic.twitter.com/dz5dG4n7Xe — BAI Media (@BAI_Media) April 28, 2023 ఈ గెలుపుతో సాత్విక్–చిరాగ్ జోడీ 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో పతకాన్ని ఖరారు చేసుకున్న భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు 21–18, 5–21, 9–21తో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. కాంటా సునెయామ (జపాన్)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి, రెండో గేమ్‌లో 9–13తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 18–21, 21–19, 15–21తో దెజాన్–గ్లోరియా విద్జాజా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
ప్రీ క్వార్టర్స్‌కు సింధు.. లక్ష్య సేన్‌కు చుక్కెదురు
దుబాయ్: స్వర్ణ పతకమే లక్ష్యంగా ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–15, 22–20తో ప్రపంచ 17వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు 11–14తో వెనుకబడింది. ఈ దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి 20–14తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయిన సింధు వెంటనే మరో పాయింట్ నెగ్గి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్ హోరాహోరీగా సాగినా కీలకదశలో సింధు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ హాన్ యువె (చైనా)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–13, 21–8తో అద్నాన్ ఇబ్రహీం (బహ్రెయిన్)పై, ప్రణయ్ 21–14, 21–9తో ఫోన్ ప్యాయె నైంగ్ (మయన్మార్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. లక్ష్య సేన్ 7–21, 21–23తో లో కీన్ యెవ్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశాడు. సిక్కి–రోహన్ జోడీ విజయం మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–12, 21–16తో చాన్ పెంగ్ సూన్–చె యి సీ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 17–21, 21–17, 21–18తో లానీ ట్రియ మాయసరి–రిబ్కా సుగియార్తో (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 21–17తో టాన్ కియాన్ మెంగ్–టాన్ వీ కియాంగ్ (మలేసియా) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
Badminton Asia Championships 2023: అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత షట్లర్లు
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. దుబాయ్‌లో నేడు మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 61 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్ మూడు కాంస్య పతకాలు (2010, 2016, 2018), పీవీ సింధు (2014, 2022) రెండు కాంస్య పతకాలు సాధించారు. అయితే ఈ ఏడాది సైనా నెహ్వాల్ బరిలోకి దిగడంలేదు. -
Asian Mixed Team Championships: భారత్‌కు కాంస్యం
దుబాయ్: ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత స్టార్స్ ప్రణయ్, పీవీ సింధు తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్ల చేతిలో ఓడిపోవడం భారత్‌ను దెబ్బ తీసింది. తొలి మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ ప్రణయ్ 13–21, 15–21తో 121వ ర్యాంకర్ లె లాన్ జీ (చైనా) చేతిలో... రెండో మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ పీవీ సింధు 9–21, 21–16, 18–21తో 101వ ర్యాంకర్ గావో ఫాంగ్ జీ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత్ 0–2తో వెనుబడింది. అయితే మూడో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 21–19తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ ద్వయంపై... నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–18, 13–21, 21–19తో లియు షెంగ్ షు–తాన్ నింగ్ ద్వయంపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఇషాన్–తనీషా ద్వయం 17–21, 13–21తో జియాన్ జాంగ్ బాంగ్–వె యా జిన్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత్ కాంస్యంతో సంతృప్తి పడింది. -
'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. గంటా 6 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో పీవీ సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ లో పీవీ సింధు అలవోకగా విజయం సాధించింది. ఇక రెండో గేమ్ లో యామగుచి పుంజుకోవడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మ్యాచ్ రిఫరీలు సింధు విషయంలో ప్రవర్తించిన తీరు ఇక్కడ వివాదాస్పదంగా మారింది. రెండో గేమ్ లో స్కోర్లు 14-12తో సింధు లీడ్ లో ఉన్న సమయంలో అంపైర్లు సింధు కు ఒక పాయింట్ ను పెనాల్టీగా విధించారు. సింధు సర్వీస్ చేసే సమయంలో ఎక్కువగా టైమ్ తీసుకుంటుందనే కారణంతో అంపైర్లు సింధుకు ఒక పాయింట్ ను పెనాల్టీగా ప్రకటించారు. దీనిపై సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాసేపు అంపైర్లతో వాగ్వివాదానికి కూడా దిగింది. అనంతరం సింధు ఆట గాడి తప్పగా.. అద్బుతంగా ఆడిన యామగుచి ఆ గేమ్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. Nice umpiring! #BAC2022 pic.twitter.com/3EgLS4kW7n — Sammy (@Sammy58328) April 30, 2022 -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
Asia Badminton Championship - మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–9తో అపీలుక్ గతెరాహోంగ్–నచానన్ తులమోక్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 10–21, 21–19, 16–21తో కాంగ్ మిన్‌హుక్–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంట చేతిలో... అర్జున్ –ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 16–21, 22–24తో ఫజార్ –అర్దియాంతో (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జంట 21–15, 21–17తో లా చెక్ హిమ్–యెంగ్ టింగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గగా... వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (భారత్) ద్వయం 9–21, 13–21తో ప్రవీన్ జోర్డాన్–మెలాతి ఒక్తావియాంతి (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. చదవండి: Trolls On Virat Kohli: ఓపెనర్‌గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Asia Badminton Championship: ఓటమితో మొదలు
షా ఆలమ్ (మలేసియా): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు తొలి మ్యాచ్‌లో భారీ ఓటమి ఎదురైంది. దక్షిణ కొరియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 0–5తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 11–21, 19–21తో ప్రపంచ 2094వ ర్యాంకర్ జియోన్ హైక్ జిన్ చేతిలో ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత రవికృష్ణ–శంకర్ ప్రసాద్ 8–21, 10–21తో వి తె కిమ్–కిమ్ జెవాన్ చేతిలో... కిరణ్ జార్జ్ 18–21, 14–21తో జూ వాన్ కిమ్ చేతిలో... మంజిత్ సింగ్–డింకూ సింగ్ 7–21, 15–21తో యోంగ్ జిన్–నా సుంగ్ సెయుంగ్ చేతిలో... మిథున్ మంజునాథ్ 16–21, 27–25, 14–21తో మిన్ సన్ జియోంగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల విభాగంలో నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య మలేసియా జట్టుతో భారత్ ఆడనుంది. -
ఆటకు నేను సిద్ధం: సింధు
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ కోర్టులో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ప్రస్తుతం లండన్‌లోని గ్యాటోరెడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (జీఎస్‌ఎస్‌ఐ)తో కలిసి పనిచేస్తోన్న సింధు ప్రస్తుతం ఆటతోపాటు ఆరోగ్యపరంగా పూర్తి ఫిట్‌గా ఉన్నానని చెప్పింది. జనవరిలో ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలతో కోర్టులో అడుగుపెడతానంది. ఈ మేరకు సన్నద్ధమవుతున్నానని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో 2021లోనే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని ముందే ఊహించానని... అందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని పేర్కొంది. అందరూ ఊహించుకుంటున్నట్లుగా చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. ఆయనకు సమాచారమిచ్చాకే జీఎస్‌ఎస్‌ఐతో కలిసి పనిచేస్తున్నానని చెప్పింది. న్యూట్రిషియన్, ఫిట్నెస్తో పాటు పలు అంశాలపై గత నాలుగేళ్లుగా జీఎస్‌ఎస్‌ఐ అనుబంధాన్ని కొనసాగిస్తున్నానని తెలిపింది. ప్రపంచ మాజీ చాంపియన్స్ నొజోమి ఒకుహారా (జపాన్), కరోలినా మారిన్ (స్పెయిన్)లతో జరిగే మ్యాచ్‌ల్లో తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తానని వెల్లడించింది. -
మళ్లీ కాంస్యంతో సరి
మనీలా (ఫిలిప్పీన్స్): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే అవకాశాన్ని భారత్ రెండోసారి చేజార్చుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియాతో శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 2016లోనూ భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఇండోనేసియా చేతిలో ఓటమిపాలై కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆంథోని జిన్‌టింగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ సాయిప్రణీత్ తొలి గేమ్‌ను 6–21తో చేజార్చుకున్నాక గాయం కారణంగా వైదొలిగాడు. అనంతరం రెండో సింగిల్స్‌లో లక్ష్య సేన్ అద్భుతంగా ఆడి 21–18, 22–20తో ఆసియా క్రీడల చాంపియన్, ప్రపంచ ఏడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌లో అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) ద్వయం 21–10, 14–21, 23–21 అర్జున్–ధ్రువ్ కపిల జంటను ఓడించింది. నాలుగో మ్యాచ్‌లో శుభాంకర్ డే 21–17, 21–15తో రుస్తావిటోను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జంట గిడియోన్–సుకముల్జో 21–6, 21–13తో లక్ష్య సేన్–చిరాగ్ శెట్టి జోడీని ఓడించి ఇండోనేసియాకు 3–2తో విజయాన్ని అందించింది. -
మలేసియా చేతిలో...
మనీలా: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. గ్రూప్ ‘బి’లో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 1–4తో మలేసియా చేతిలో పరాజయం చవిచూసింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఒక్కడే ఈ పోరులో గెలిచాడు. రెండు డబుల్స్ జోడీలు, ఇతర రెండు సింగిల్స్‌లోనూ భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. ఈ పరాజయంతో భారత్ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. కజకిస్తాన్‌తో గెలుపొందడంతో క్వార్టర్స్ చేరిన భారత్... శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌తో తలపడుతుంది. తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రపంచ 11వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్ 18–21, 15–21తో లీ జి జియా చేతిలో కంగుతిన్నాడు. మొదటి డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–చిరాగ్ షెట్టి ద్వయం 18–21, 15–21తో అరొన్ చియా–సో వుయి ఇక్ జంట చేతిలో ఓడింది. దీంతో భారత్ 0–2తో ఓటమికి దగ్గరవగా... రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్ 14–21, 21–16, 21–19తో చిమ్ జున్ వీపై నెగ్గడంతో జట్టు ఆశలు నిలిచాయి. కానీ రెండో డబుల్స్‌లో ధ్రువ్ కపిల–లక్ష్యసేన్ జోడీ 14–21, 14–21తో ఒంగ్ యివ్ సిన్– తే ఈ యి జంట చేతిలో, ఆఖరి సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 10–21, 15–21తో లియాంగ్ జున్ హవ్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
భారత్ శుభారంభం
మనీలా: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. మంగళవారం గ్రూప్ ‘బి’లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో ఘనవిజయం సాధించింది. ముందుగా జరిగిన మూడు సింగిల్స్ పోటీల్లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, శుభాంకర్ డే విజయం సాధించారు. తొలి డబుల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్–చిరాగ్ శెట్టి జోడీ కంగుతినగా, రెండో డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల ద్వయం గెలుపొందింది. ఈ విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్ బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ కేవలం 23 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించాడు. శ్రీకాంత్ 21–10, 21–7తో డిమిత్రి పనరిన్‌పై అలవోక విజయం సాధించాడు. లక్ష్యసేన్ కూడా 21 నిమిషాల్లో ఆట ముగించాడు. అతను 21–13, 21–8తో అర్తుర నియజోవ్‌పై నెగ్గగా... శుభాంకర్ డే 21–11, 21–5తో కైత్‌మురత్ కుల్మతోవ్‌పై గెలిచేందుకు 26 నిమిషాలే పట్టింది. డబుల్స్‌లో ప్రణయ్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 16–21, 19–21తో నియజోవ్–పనరిన్ జంట చేతిలో ఓడింది. మరో డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల ద్వయం 21–14, 21–8తో నికిట బ్రగిన్–కైత్‌మురత్ జోడీపై వరుస గేముల్లో గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ మంగళవారం బరిలోకి దిగలేదు. గురువారం జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు క్వార్టర్స్ చేరతాయి. -
కజకిస్తాన్‌తో భారత్ తొలి పోరు
మనీలా (ఫిలిప్పీన్స్): కరోనా వైరస్ భయాందోళనల్ని పక్కనబెట్టి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు భారత పురుషుల జట్టు సిద్ధమైంది. ఈ ఈవెంట్లో భారత్ పూర్తిస్థాయి జట్టుతో తలపడనుంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య విజేత భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్.ఎస్.ప్రణయ్, శుభాంకర్ డే, లక్ష్యసేన్‌లు ఒలింపిక్ ఏడాది సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నాలుగేళ్ల క్రితం 2016లో భారత పురుషుల జట్టు కాంస్యం నెగ్గింది. ఇప్పుడు ఈ పతకం వన్నె మార్చాలనే లక్ష్యంతో ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ముందుగా భారత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. రెండు సార్లు చాంపియన్ అయిన ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లతో కలిసి గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ కరోనా పుణ్యమాని ఇప్పుడు మలేసియా, కజకిస్తాన్‌లతో గ్రూప్ ‘బి’కి మారింది. వైరస్ ప్రభావమున్న చైనా, హాంకాంగ్‌లను ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నిషేధించడంతో ‘డ్రా’ షెడ్యూలును మార్చారు. బ్యాడ్మింటన్‌లో కజకిస్తాన్ కష్టమైన ప్రత్యర్థి కాదు. దీంతో ఈ జట్టుతో మంగళవారం జరిగే పోరులో భారత్ గెలుపు ఖాయమవుతుంది. అయితే గురువారం మలేసియాతోనే భారత్‌కు కష్టాలు తప్పవు. ఆ జట్టులో ప్రపంచ 14వ ర్యాంకర్ లీ జి జియా, 2014 యూత్ ఒలింపిక్స్ చాంపియన్ చీమ్ జున్ వీ, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు రన్నరప్ అయిన హవ్ లియాంగ్ జున్‌లు ఉండటంతో భారత్ చెమటోడ్చాల్సిన అవసరముంది. కాగా... ప్రాణాంతక వైరస్ భయంతో భారత మహిళల జట్టు ఈ టోర్నీకి దూరమైంది. ఇకపై ఆకర్షణీయంగా ‘బాయ్’ టోర్నీలు న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీలను మరింత రసవత్తరంగా, ఆకర్షణీయంగా నిర్వహించేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిద్ధమవుతోంది. మ్యాచ్‌ల్లో పోటీ పెంచేందుకు కేటగిరీల వారీగా నిర్వహిస్తుంది. అలాగే ప్రైజ్‌మనీని కూడా భారీగా పెంచింది. మొత్తం రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీతో ఏడాది పొడవునా మూడు దశల్లో బాయ్ ఈవెంట్లు జరుగనున్నాయి. లెవెల్ 1, 2, 3 టోర్నీలు నిర్వహించాలని బాయ్ ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటీవ్ కమిటీలో నిర్ణయించింది. సీనియర్ కేటగిరీలో ‘బాయ్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీ’ని లెవెల్ 1 స్థాయిలో నిర్వహిస్తారు. లెవెల్ 2లో నాలుగు ‘బాయ్ సూపర్ సిరీస్ టోర్నీలు’ జరుగుతాయి. ఇక లెవెల్ 3లో ఆరు ‘బాయ్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ’లను నిర్వహిస్తారు. మేటి ర్యాంకింగ్‌ల ఆధారంగా ఆయా టోర్నీల్లో నేరుగా మెయిన్ డ్రా ఆడే అవకాశం కల్పిస్తారు. అగ్రశ్రేణి క్రీడాకారులు జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొనేందుకు ముందుగా రావాలనేది కూడా కొత్త ప్రణాళికలో భాగం. -
భారత బ్యాడ్మింటన్ సీనియర్ జట్టులో గాయత్రి
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఈనెల 11 నుంచి 16 వరకు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ టోర్నీ జరుగుతుంది. భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. పురుషుల విభాగంలో మాత్రం భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ పాల్గొంటున్నారు. కొంతకాలంగా జూనియర్‌స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి మహిళల సీనియర్ జట్టులో చోటు దక్కించుకుంది. మరో తెలుగమ్మాయి, డబుల్స్ స్పెషలిస్ట్ కె.మనీషా కూడా భారత జట్టులోకి ఎంపికైంది. పురుషుల జట్టు: సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, శుభాంకర్ డే, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎం.ఆర్.అర్జున్. మహిళల జట్టు: అష్మిత చాలిహ, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, అశ్విని భట్, శిఖా గౌతమ్, రుతుపర్ణ పాండా, కె.మనీషా. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార లక్ష్య సేన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. 53 ఏళ్ల విరామం తర్వాత పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచిన షట్లర్‌గా గుర్తింపు పొందాడు. జకార్తాలో ఆదివారం జరిగిన అండర్–19 పురుషుల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్ వరుస గేముల్లో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. జకార్తా (ఇండోనేసియా): ఆద్యంతం తన సంచలన ప్రదర్శన కొనసాగించిన భారత బ్యాడ్మింటన్ యువస్టార్ లక్ష్య సేన్ ఆసియా జూనియర్ చాంపియన్ షిప్లో విజేతగా అవతరించాడు. ఆదివారం అండర్–19 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ లక్ష్య సేన్ 21–19, 21–18తో టాప్ సీడ్, ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. టైటిల్ గెలిచే క్రమంలో లక్ష్య సేన్ నలుగురు సీడెడ్ క్రీడాకారులపై నెగ్గడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ సరన్ జామ్శ్రీ (థాయ్‌లాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ లీ షిఫెంగ్ (చైనా)పై, సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఇక్షన్ రుమ్బే (ఇండోనేసియా)పై, ఫైనల్లో టాప్ సీడ్ కున్లావుత్‌పై లక్ష్య సేన్ గెలుపొందాడు. వరుసగా మూడో ప్రయత్నంలో లక్ష్య సేన్ ఖాతాలో ఆసియా స్వర్ణ పతకం చేరడం విశేషం. 2016లో కాంస్యం నెగ్గిన అతను గతేడాది ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఈసారి మాత్రం ఏకంగా టైటిల్ కొల్లగొట్టాడు. నిలకడగా ఆడుతూ... ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన 16 ఏళ్ల లక్ష్య సేన్ కుటుంబానికి బ్యాడ్మింటన్ నేపథ్యం ఉంది. లక్ష్య సేన్ సోదరుడు చిరాగ్ సేన్ అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా... తండ్రి డీకే సేన్ బ్యాడ్మింటన్ కోచ్‌గా ఉన్నారు. తాత చంద్రలాల్ సేన్ ప్రోత్సాహంతో తొమ్మిదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. 2014లో స్విస్ ఓపెన్ జూనియర్ చాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచ్చిన లక్ష్య సేన్ అదే ఏడాది డెన్మార్క్‌లో జరిగిన టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన అతను గతేడాది జూనియర్ ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. అంతేకాకుండా జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ‘బాయ్’ నజరానా రూ. 10 లక్షలు... ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచిన లక్ష్య సేన్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. ‘ఆసియా టైటిల్ గెలిచి లక్ష్య సేన్ దేశం మొత్తం గర్వపడేలా చేశాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారు కూడా మంచి ఫలితాలు సాధిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. భారత్ తరఫున 1965లో గౌతమ్ ఠక్కర్ (మహారాష్ట్ర) పురుషుల సింగిల్స్‌లో తొలిసారి ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచాడు. అనంతరం సమీర్ వర్మ 2011లో రజతం, 2012లో కాంస్యం... 2016లో లక్ష్య సేన్ కాంస్యం గెలిచారు. 2009లో ప్రణవ్ చోప్రా–ప్రజక్తా సావంత్ ద్వయం మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం గెలిచింది. 2011లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో కాంస్యం, 2012లో స్వర్ణ పతకం సాధించింది. ఆసియా టోర్నీలో టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎనిమిది రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో తొలుత టీమ్ ఈవెంట్లో, ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పోటీపడ్డాను. క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్‌ను ఓడించాక టైటిల్ సాధిస్తాననే నమ్మకం పెరిగింది. టోర్నీ సందర్భంగా కాలి కండరాల గాయమైంది. నొప్పి నివారణ మాత్రలు తీసుకుంటూ మ్యాచ్‌లు కొనసాగించాను. –లక్ష్య సేన్ -
మోమోటా మెరిసె...
వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా కెంటా మోమోటా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మోమోటా 21–17, 21–13తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించాడు. జపాన్‌లో జూదం ఆడటంపై నిషేధం ఉంది. 2016లో మోమోటా జూదం ఆడుతూ దొరికిపోవడంతో అతన్ని జపాన్ బ్యాడ్మింటన్ సంఘం ఏడాదిపాటు సస్పెండ్ చేయడంతోపాటు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టు నుంచి తొలగించింది. గతేడాది మేలో నిషేధం గడువు పూర్తయ్యాక పునరాగమనం చేసిన అతను చిన్న స్థాయి టోర్నీలు ఆడుతూ ర్యాంక్ మెరుగుపర్చుకున్నాడు. 23 ఏళ్ల మోమోటా ఆసియా చాంపియన్‌షిప్‌లో పూర్వ వైభవాన్ని సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) నిలబెట్టుకుంది. టాప్ సీడ్ తై జు యింగ్ 21–19, 22–20తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. -
కాంస్యంతోనే సరి..
వుహాన్(చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్‌లు కాంస్య పతకంతోనే సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో వీరిద్దరూ పరాజయం చెందడంతో కాంస్యంతోనే వెనుదిరిగాల్సి వచ్చింది. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్ సెమీస్‌లో సైనా 25-27, 19-21 తేడాతో టాప్‌సీడ్ తైజు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో సైనా కడవరకూ పోరాడినా సెమీ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఇక పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రణయ్ 16-21, 18-21తేడాతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా) చేతిలో పరాజయం చెందాడు. 52నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చెన్ లాంగ్ పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. -
ఏబీసీలో సైనా నెహ్వాల్ జోరు
వుహాన్ (చైనా): భారత స్టార్ షట్లర్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సైనా 21-15, 21-13తో లీ జాంగ్ మి (కొరియా)పై అలవోకగా గెలిచి సెమీస్‌కు చేరారు. ఫలితంగా కనీసం కాంస్య పతకాన్ని సైనా తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మరో క్వార్టర్ ఫైనల్స్‌లో పీవీ సింధు 19-21, 10-21తో సుంగ్ జీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోవడంతో ఏబీసి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మరొకవైపు పురుషుల బ్యాడ్మింటన్ ప్రపంచ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్ ఫైనల్స్‌లోనే ముగిసింది. పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌లో కిడాంబి 12-21,15-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో ఓటమి చెందారు. ఇక కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సైనా ఈ టోర్నీలో స్వర్ణం గెలిస్తే ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎవరూ టైటిల్ సాధించలేదు. -
సైనా, సింధు సాధించేనా?
వుహాన్ (చైనా): ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో ఇప్పటివరకు మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎవరూ టైటిల్ సాధించలేదు. పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం 1965లో దినేశ్ ఖన్నా ఏకైకసారి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఈ విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం రాలేదు. కొంతకాలంగా భారత క్రీడాకారులు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో ఈసారి ఈ మెగా ఈవెంట్లో వారు ఎలాంటి ప్రదర్శన చేస్తారో ఆసక్తికరంగా మారింది. 2010, 2016లలో సెమీఫైనల్లో ఓడిపోయిన సైనా... 2014లో పీవీ సింధు కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో వీరిద్దరికిదే అత్యుత్తమ ప్రదర్శన. ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన సైనా... రన్నరప్‌గా నిలిచిన సింధు తమ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తేనే ఆసియా పోటీల్లో వారి నుంచి మళ్లీ పతకాలు ఆశించవచ్చు. టోర్నీ తొలి రోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో సైనా... పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో పీవీ సింధు తలపడతారు. తొలి రౌండ్‌ను దాటితే రెండో రౌండ్లో ప్రపంచ చాంపియన్ ఒకుహారా (జపాన్)తో సైనా... చైనా ప్లేయర్ చెన్ జియోజిన్‌తో సింధు ఆడే అవకాశముంది. క్వాలిఫయింగ్‌లో మరో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ బరిలో ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో విశేషంగా రాణించిన డబుల్స్ క్రీడాకారులు అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ టాప్ సీడ్ హోదాలో పోటీపడుతున్నాడు. తొలి రౌండ్లో నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్ ఆడతాడు. సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రణయ్ కూడా ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సమీర్ వర్మ; అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్; క్వాలిఫయర్‌తో ప్రణయ్ తలపడతారు. ఈ మెగా ఈవెంట్లో 2000లో పుల్లెల గోపీచంద్, 2007లో అనూప్ శ్రీధర్ కాంస్య పతకాలు గెలిచిన తర్వాత మరో భారత్ ప్లేయర్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకోలేదు. -
మరో క్లీన్‌స్వీప్‌తో క్వార్టర్స్‌లోకి
అలోర్ సెటార్ (మలేసియా): బ్యాడ్మింటన్‌లో పసికూన జట్టు మాల్దీవులుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా రెండో విజయంతో గ్రూప్ ‘డి’ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇదే గ్రూప్ నుంచి ఇండోనేసియా కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం భారత్, ఇండోనేసియా జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘టాపర్’గా నిలుస్తుంది. ఫిలిప్పీన్స్‌పై కూడా 5–0తో నెగ్గిన భారత్ అదే జోరును మాల్దీవులుపై కనబరిచింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ‘బర్త్‌డే బాయ్’ కిడాంబి శ్రీకాంత్ 21–5, 21–6తో జయన్ హుస్సేన్‌పై; సాయిప్రణీత్ 21–10, 21–4తో అహ్మద్ నిబాల్పై; సమీర్ వర్మ 21–5, 21–1తో అర్సలాన్ అలీపై గెలిచారు. డబుల్స్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–8, 21–8తో జయన్ హుస్సేన్–షహీమ్ జోడీపై... అర్జున్–శ్లోక్ రామచంద్రన్ ద్వయం 21–2, 21–5తో అర్సలాన్ అలీ–అహ్మద్ నిబాల్ జోడీపై గెలిచాయి. -
ఫైనల్లో సామియా
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మయన్మార్‌లోని యాంగూన్‌లో శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సామియా 21–9, 21–18తో భారత్‌కే చెందిన ఆషి రావత్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో విద్జాజా స్టెఫానీ (ఇండోనేసియా)తో సామియా తలపడుతుంది. ఇదే టోర్నీ అండర్–17 బాలికల డబుల్స్ సెమీఫైనల్లో మోపాటి కెయూర–సెల్వం కవిప్రియ (భారత్) జంట 13–21, 19–21తో కెల్లీ లారిసా–షెలాండ్రీ వియోలా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. అండర్–15 బాలుర డబుల్స్ సెమీఫైనల్లో ఆయూష్ రాజ్ గుప్తా–శుభమ్ పటేల్ (భారత్) జంట 19–21, 17–21తో రజీఫ్–జెన్ యి ఓంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఓటమితో ఆషి రావత్, కెయూర–కవిప్రియ, ఆయూష్–శుభమ్ కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు.