చరిత్ర సృష్టించిన సాత్విక్‌–చిరాగ్‌.. తొలి భారత జోడీగా రికార్డు  | Asia Badminton Championship: Satwik, Chirag Pair Enters Final | Sakshi
Sakshi News home page

Asia Badminton Championship: చరిత్ర సృష్టించిన సాత్విక్‌–చిరాగ్‌.. తొలి భారత జోడీగా రికార్డు 

Apr 30 2023 9:34 AM | Updated on May 1 2023 7:26 AM

Asia Badminton Championship: Satwik, Chirag Pair Enters Final - Sakshi

దుబాయ్‌: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్‌ జోడి సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ఫైనల్లోకి ప్రవేశించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో ఆరో సిడ్‌ సాత్విక్‌–చిరాగ్‌...చైనీస్‌ తైపీకి చెందిన లీ యాంగ్‌ – వాంగ్‌ చిన్‌ లిన్‌పై విజయం సాధించారు. తొలి గేమ్‌ను 21–18తో గెలుచుకున్న భారత జంట రెండో గేమ్‌లో 13–14తో వెనుకబడి ఉన్న దశలో వాంగ్‌ చిన్‌ లిన్‌ గాయం కారణంగా తప్పుకున్నాడు.

దాంతో ‘వాకోవర్‌’తో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. 41 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ ముగిసింది.  నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ ఆంగ్‌ యూ సిన్‌ – టియో ఈ యీ (మలేసియా)తో భారత జోడి తలపడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement