Satwiksairaj- Chirag Shetty: బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2023లో పసిడి పతకం గెలిచిన సాత్విక్- చిరాగ్‌లను ఆయన అభినందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ విజయాల పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సోమవారం ట్వీట్ చేశారు.
కాగా సుదీర్ఘ విరామం తర్వాత.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఎట్టకేలకు రెండో స్వర్ణం లభించిన విషయం తెలిసిందే. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్ ఖన్నా చాంపియన్‌గా నిలవగా.. 58 ఏళ్ల తర్వాత పురుషుల డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ తమ అద్భుత ఆటతీరుతో భారత్‌కు పసిడి పతకం అందించారు.
ఈ భారత జోడీ పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జంటను ఓడించి విజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా సరికొత్త చరిత్ర సృష్టించారు సాత్విక్- చిరాగ్. సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు కాగా.. చిరాగ్ శెట్టి స్వరాష్ట్రం మహారాష్ట్ర.
చదవండి: IPL 2023: మిస్టర్ కూల్‌కు ఆగ్రహం! వైరల్ వీడియో చూశారా?
Comments
Please login to add a commentAdd a comment