ఏబీసీలో సైనా నెహ్వాల్‌ జోరు | Saina Nehwal Books Semifinal Spot Of Asia Championship | Sakshi
Sakshi News home page

ఏబీసీలో సైనా నెహ్వాల్‌ జోరు

Published Fri, Apr 27 2018 5:45 PM | Last Updated on Fri, Apr 27 2018 5:45 PM

Saina Nehwal Books Semifinal Spot Of Asia Championship - Sakshi

సైనా నెహ్వాల్‌ (ఫైల్‌ ఫోటో)

వుహాన్‌ (చైనా):  భారత స్టార్‌ షట్లర్‌, కామన్వెల్త్‌ స్వర్ణ పతక విజేత  సైనా నెహ్వాల్‌  ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (ఏబీసీ)లో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సైనా 21-15, 21-13తో లీ జాంగ్‌ మి (కొరియా)పై అలవోకగా గెలిచి సెమీస్‌కు చేరారు. ఫలితంగా కనీసం కాంస్య పతకాన్ని సైనా తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక మరో క్వార్టర్‌ ఫైనల్స్‌లో పీవీ సింధు 19-21, 10-21తో సుంగ్‌ జీ హున్‌ (కొరియా) చేతిలో ఓడిపోవడంతో ఏబీసి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మరొకవైపు పురుషుల బ్యాడ్మింటన్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ కిడాంబి శ్రీకాంత్‌  పోరాటం క్వార్టర్‌ ఫైనల్స్‌లోనే ముగిసింది. పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌లో కిడాంబి 12-21,15-21తో లీ చోంగ్‌ వీ (మలేసియా) చేతిలో ఓటమి చెందారు.

ఇక కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సైనా ఈ టోర్నీలో స్వర్ణం గెలిస్తే ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో  మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ఎవరూ టైటిల్‌ సాధించలేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement