
PV Sindhu- Saina Nehwal: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఆమె నిలకడగా ఏడో ర్యాంకులోనే కొనసాగుతోంది. గాయాలతో సుదీర్ఘ కాలంగా సతమతమవుతున్న సైనా ఇటీవల బరిలోకి దిగుతోంది.
ఈ సీనియర్ షట్లర్ 28వ ర్యాంకులో కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరాడు. అందువల్లే ర్యాంకు మెరుగువుతోంది. కాగా... కిడాంబి శ్రీకాంత్ ఒక ర్యాంకు కోల్పోయి 12వ స్థానానికి పడిపోయాడు.
సాయిప్రణీత్ 19వ ర్యాంకుకు దిగజారాడు. హెచ్.ఎస్. ప్రణయ్, సమీర్ వర్మలు వరుసగా 24, 26వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19వ ర్యాంకులో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాయి.
చదవండి: Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు