BWF rankings
-
ఏడో ర్యాంక్‌కు ఎగబాకిన ప్రణయ్.. టాప్-100లో భారత్ నుంచి ఏకంగా..!
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో భారత్ నుంచి ఏకంగా 12 మంది చోటు సంపాదించారు. తాజా ర్యాంకింగ్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌కు చేరుకొని భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లక్ష్య సేన్ (20), శ్రీకాంత్ (24), ప్రియాన్షు (28), కిరణ్ జార్జి (36), సతీశ్ కుమార్ (49), మిథున్ మంజునాథ్ (63), శంకర్ ముత్తుస్వామి (70), సమీర్ వర్మ (77), సాయిప్రణీత్ (91), మెరాబా లువాంగ్ మైస్నమ్ (93), చిరాగ్ సేన్ (99) ఉన్నారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన హెచ్ఎస్ ప్రణయ్
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న అతను కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తాజాగా (ఆగస్ట్ 29) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. 72437 పాయింట్లు సాధించిన అతను.. మూడు స్థానాలు ఎగబాకి, ఆరో ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రణయ్ గతేడాది డిసెంబర్ నుంచి టాప్-10లో కొనసాగుతున్న ఏకైక భారత షట్లర్‌గా ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ తర్వాత లక్ష్యసేన్ (12) భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్ దక్కించుకున్నాడు. ఇతని తర్వాత కిదాంబి శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కాగా, ప్రణయ్ ఇటీవల ముగిసిన వరల్డ్ బ్యాడింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని, సూపర్-500 మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. సింధుకు 14వ ర్యాంక్.. మహిళల విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజా ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ – త్రిసా జాలీ జంట రెండు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరింది. -
వరుస విజయాలు.. కెరీర్ బెస్ట్ అందుకున్న సాత్విక్-చిరాగ్ జోడి
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం ఆదివారం కొరియా ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నాలుగో సూపర్ బ్యాడ్మింటన్ టైటిల్ దక్కించుకున్న ఈ జోడి ప్రస్తుతం సూపర్ ఫామ్ కనబరుస్తోంది. తాజాగా మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. సాత్విక్-చిరాగ్ జోడి డబుల్స్ విభాగంలో తమ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ అందుకోవడం విశేషం. ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన వరల్డ్ డబుల్స్ నెంబర్‌వన్ జోడి ఫజర్ అల్‌పయాన్- ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. కొరియా ఓపెన్ కంటే ముందు ఇదే సీజన్లో స్విజ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, ఆసియన్ చాంపియన్స్ గెలిచిన ఈ జోడి ఖాతాలో 87,211 ర్యాంకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో భాగంగా వీరిద్దరూ ఈ సీజన్లో ఆడిన 10 ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో కూడా ఓటమిపాలవ్వలేదు. కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సాత్విక్-చిరాగ్ జోడి జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీపై కన్నేసింది. మంగళవారం నుంచి ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక తెలుగుతేజం పీవీ సింధు వరుస పరాజయాలతో ర్యాంకింగ్స్‌లో మరింత దిగజారుతూ వస్తోంది. కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సింధు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 17వ స్థానంలో ఉంది. గాయంతో దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ 37వ స్థానంలో ఉండగా.. పరుషుల సింగిల్స్ విభాగంలో భారత టాప్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ 10వ స్థానాన్ని నిలుపుకోగా.. కొరియా ఓపెన్‌కు దూరంగా ఉన్న లక్ష్యసేన్ ఒక స్థానం కోల్పోయి 13వ స్థానంలో ఉన్నాడు. ఇక కిడాంబి శ్రీకాంత్ 20వ స్థానంలో నిలిచాడు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ దూరం ఎంబాపెకు బంపరాఫర్.. ఏకంగా రూ. 2,716 కోట్లు! -
BWF Rankings: ఎనిమిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం
World Badminton Rankings 2022: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కొంత కాలంగా చక్కటి ఫామ్‌లో ఉన్న ప్రణయ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడటంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఇతర భారత షట్లర్లలో లక్ష్యసేన్ తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా, కిడాంబి శ్రీకాంత్ 12వ స్థానానికి దిగజారాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరమైన పీవీ సింధు కూడా ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయింది. ఇది కూడా చదవండి: అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఇరిగేశి అర్జున్ మంగళవారం జరిగిన నాలుగు రౌండ్లలో రెండు గేముల్లో గెలిచి, మరో రెండు గేముల్లో ఓటమి పాలయ్యాడు. 9 రౌండ్లు ముగిసిన అనంతరం అర్జున్ 6.5 పాయింట్లతో మరో ఆరుగురి తో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల ర్యాపిడ్ చెస్‌లో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి భారత క్రీడాకారిణి సవితశ్రీ (6.5) మరో ఇద్దరితో కలిసి ఆధిక్యంలో ఉంది. -
తొలిసారి టాప్–20లోకి పుల్లెల గాయత్రి జోడీ
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి తన భాగస్వామి ట్రెసా జాలీ (కేరళ)తో కలిసి కెరీర్ బెస్ట్ 19వ ర్యాంక్‌కు చేరుకుంది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం రెండు స్థానాలు పురోగతి సాధించి భారత నంబర్‌వన్ జోడీగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి మరోసారి కెరీర్ బెస్ట్ ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో లక్ష్య సేన్
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు పురోగతి సాధించి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో ర్యాంక్‌లో ఉంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్‌కు చేరుకోగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఐదు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌లో నిలిచింది. -
ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా భారత అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అండర్–19 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కొత్త నంబర్‌వన్‌గా భారత్‌కు చెందిన అనుపమ ఉపాధ్యాయ అవతరించింది. హరియాణాలోని పంచ్‌కులాకు చెందిన 17 ఏళ్ల అనుపమ ఈ ఏడాది ఉగాండా, పోలాండ్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజేతగా నిలిచింది. టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత్‌కే చెందిన తస్నిమ్ మీర్‌ను రెండో స్థానానికి నెట్టి అనుపమ అగ్రస్థానానికి చేరింది. భారత్‌కే చెందిన అన్వేష గౌడ ఆరో ర్యాంక్‌లో, ఉన్నతి హుడా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బెంగళూరులోని ప్రకాశ్ పడుకోన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అనుపమ జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. గతంలో ఆదిత్య జోషి (2014), సిరిల్ వర్మ (2016), లక్ష్య సేన్ (2017), తస్నిమ్ (2022), శంకర్ సుబ్రమణియన్ (2022) ఈ ఘనత సాధించారు. -
BWF Rankings: కెరీర్ బెస్ట్.. తొలిసారి టాప్–10లోకి లక్ష్య సేన్
BWF Rankings: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రన్నరప్‌తో టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 20 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక మహిళల డబుల్స్‌లో నిలకడగా రాణిస్తోన్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 12 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 34వ ర్యాంక్‌ను అందుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
PV Sindhu: ఏడో ర్యాంకులోనే సింధు.. ఇక సైనా మాత్రం
PV Sindhu- Saina Nehwal: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఆమె నిలకడగా ఏడో ర్యాంకులోనే కొనసాగుతోంది. గాయాలతో సుదీర్ఘ కాలంగా సతమతమవుతున్న సైనా ఇటీవల బరిలోకి దిగుతోంది. ఈ సీనియర్ షట్లర్ 28వ ర్యాంకులో కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరాడు. అందువల్లే ర్యాంకు మెరుగువుతోంది. కాగా... కిడాంబి శ్రీకాంత్ ఒక ర్యాంకు కోల్పోయి 12వ స్థానానికి పడిపోయాడు. సాయిప్రణీత్ 19వ ర్యాంకుకు దిగజారాడు. హెచ్.ఎస్. ప్రణయ్, సమీర్ వర్మలు వరుసగా 24, 26వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19వ ర్యాంకులో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాయి. చదవండి: Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు -
చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. సింధు, సైనాలకు సాధ్యం కాని ఘనత సొంతం
Indian Shuttler Tasnim Mir Achieves Under 19 World No 1 Rank: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో 16 ఏళ్ల గుజరాత్ అమ్మాయి తస్నిమ్ మీర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అండర్ 19 మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గతేడాది బల్గేరియా, ఫ్రాన్స్, బెల్జియంలలో జరిగిన టోర్నీల్లో సత్తా చాటడం ద్వారా మూడు ర్యాంకులను మెరుగుపర్చుకున్న తస్నిమ్.. అగ్రపీఠాన్ని అధిరోహించింది. ప్రస్తుతం తస్నిమ్ 10,810 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగతుండగా.. మరో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. కాగా, అండర్ 19 విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో స్థానం వరకు మాత్రమే చేరుకోగలిగింది. చదవండి: నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..! -
అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..!
Kidambi Srikanth Returns To Top 10 World Rankings: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం, మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. రెండేళ్ల తర్వాత తిరిగి టాప్-10లోకి అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని పదో ర్యాంక్‌లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మరో భారత షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంక్(17)ను అందుకోగా, హెచ్ఎస్ ప్రణయ్ 6 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 𝗥𝗔𝗡𝗞𝗜𝗡𝗚 𝗨𝗣𝗗𝗔𝗧𝗘𝗦 😍🔥@srikidambi entered 🔝 10 after 2 years@lakshya_sen achieved career high ranking@P9Ashwini & @sikkireddy entered top 20@PRANNOYHSPRI moved 6 ranks 🆙 Keep up the good work guys! 👊#IndiaontheRise#Badminton 📸 Badminton Photo pic.twitter.com/UOHHIRi96W — BAI Media (@BAI_Media) December 21, 2021 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని, సిక్కి జోడీ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 20వ స్థానంలో నిలిచింది. కాగా, తాజాగా జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు చేరుకొని రజత పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు మరో భారత షట్లర్ లక్ష్యసేన్ సైతం సెమీస్‌కు చేరుకుని కాంస్య పతకం గెలిచాడు. చదవండి: హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు కాంస్యం -
సాహో సింధు!
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ఘనత సాధించింది. తన కెరీర్ లో బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకుంది. ప్రపంచ బ్మాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) తాజాగా ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి ఎగసింది. స్వదేశంలో ఇటీవల జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సింధు విజేతగా నిలిచింది. ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ ను వరుస సెట్లలో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో సింధుకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 79 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సిరీస్ కు ముందు ఐదో ర్యాంకులో ఉన్న సింధు తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో రెండో స్థానానికి ఎగబాకింది. మారిన్ మూడో ర్యాంకులో కొనసాగుతోంది. చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జుయింగ్ టాప్ ర్యాంకులో ఉంది. మరో భారత స్టార్ సైనా నెహ్వాల్ 9వ ర్యాంకు దక్కించుకుంది.