
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు పురోగతి సాధించి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో ర్యాంక్‌లో ఉంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్‌కు చేరుకోగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఐదు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment