Kidambi Srikanth Returns To Top 10 World Rankings: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం, మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. రెండేళ్ల తర్వాత తిరిగి టాప్-10లోకి అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని పదో ర్యాంక్‌లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మరో భారత షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంక్(17)ను అందుకోగా, హెచ్‌ఎస్ ప్రణయ్ 6 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
𝗥𝗔𝗡𝗞𝗜𝗡𝗚 𝗨𝗣𝗗𝗔𝗧𝗘𝗦 😍🔥@srikidambi entered 🔝 10 after 2 years@lakshya_sen achieved career high ranking@P9Ashwini & @sikkireddy entered top 20@PRANNOYHSPRI moved 6 ranks 🆙
— BAI Media (@BAI_Media) December 21, 2021
Keep up the good work guys! 👊#IndiaontheRise#Badminton
📸 Badminton Photo pic.twitter.com/UOHHIRi96W
మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని, సిక్కి జోడీ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 20వ స్థానంలో నిలిచింది. కాగా, తాజాగా జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు చేరుకొని రజత పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు మరో భారత షట్లర్ లక్ష్యసేన్ సైతం సెమీస్‌కు చేరుకుని కాంస్య పతకం గెలిచాడు.
చదవండి: హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు కాంస్యం
Comments
Please login to add a commentAdd a comment