
Indian Shuttler Tasnim Mir Achieves Under 19 World No 1 Rank: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో 16 ఏళ్ల గుజరాత్ అమ్మాయి తస్నిమ్ మీర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అండర్ 19 మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
గతేడాది బల్గేరియా, ఫ్రాన్స్, బెల్జియంలలో జరిగిన టోర్నీల్లో సత్తా చాటడం ద్వారా మూడు ర్యాంకులను మెరుగుపర్చుకున్న తస్నిమ్.. అగ్రపీఠాన్ని అధిరోహించింది. ప్రస్తుతం తస్నిమ్ 10,810 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగతుండగా.. మరో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. కాగా, అండర్ 19 విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో స్థానం వరకు మాత్రమే చేరుకోగలిగింది.
చదవండి: నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..!