world No. 1
-
Ashleigh Barty: శిఖరం నుంచే సాగిపోనీ...
సాక్షి క్రీడా విభాగం: ‘ప్రొఫెషనల్ క్రీడల్లో అనుకున్న లక్ష్యాలు చేరుకోకుండానే ఆట నుంచి తప్పుకునే వారు 99 శాతం మంది ఉంటారు. కానీ యాష్లే బార్టీ మిగిలిన ఆ 1 శాతం మందిలో ఉంటుంది’ 25 ఏళ్ల వయసుకే బార్టీ సాధించిన ఘనతలు చూస్తే ఈ వ్యాఖ్య ఆమెకు సరిగ్గా సరిపోతుంది. మూడు వేర్వేరు సర్ఫేస్‌లలో (హార్డ్, క్లే, గ్రాస్‌కోర్టు) మూడు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్ పతకం, ఓవరాల్‌గా 121 వారాలు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్, సంపాదనలో మేటి... ఇంకా సాధించడానికి ఏముంది! బార్టీ కూడా ఇలాగే ఆలోచించి ఉంటుంది. శిఖరాన చేరుకున్న తర్వాత ఇక ఎక్కడానికి ఎత్తులు లేవు అనిపించినప్పుడు ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఎలా మొదలు పెట్టామనే దానికంటే ఎలా ముగించామన్నదే ముఖ్యం అని భావిస్తే బార్టీ తన ఘనమైన కెరీర్‌కు అద్భుత రీతిలో గుడ్‌బై పలికింది. సొంతగడ్డపై భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన బార్టీ దానినే చివరి ఘట్టంగా మార్చుకుంది. నిజానికి కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు దానికి ముగింపు పలకడం అంత సులువు కాదు. దానికి ఎంతో సాహసం, మానసిక దృఢత్వం కావాలి. బార్టీ తాజా ఫామ్, వయసును బట్టి చూస్తే రాబోయే కొన్నేళ్లు ఆమె మహిళల టెన్నిస్‌ను శాసించే స్థితిలో ఉంది. ఆర్జనపరంగా చూస్తే మహిళల వరల్డ్ నంబర్‌వన్‌తో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద బ్రాండింగ్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆమె ప్రచార కార్యక్రమాల ద్వారానే లెక్కలేనంత సంపదనను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటివి ఊరిస్తున్నా, వెనక్కి లాగే అవకాశం ఉన్నా బార్టీ ‘ఇట్స్ జస్ట్ మై వే’ అంటూ తనదైన దారిని ఎం చుకుంది. తన ప్రస్తుత స్థాయి ఏమిటో ఆమె పట్టించుకోలేదు. టెన్నిస్ మాత్రమే తనకు ప్రపం చం కాదని, కొత్త కలలను సాకారం చేసుకోవా ల్సి ఉందంటూ ముందుకు వెళ్లేందుకు నిశ్చ యించుకుంది. తానేంటో, తనకు కావాల్సింది ఏమిటో, తాను ఎలా సంతోషంగా ఉండగలనో గుర్తించి దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంది. బార్టీ కెరీర్ ఆసాంతం ఆసక్తికరం. నాలుగేళ్ల వయసులో రాకెట్ పట్టిన ఈ బ్రిస్బేన్ అమ్మాయి 14 ఏళ్ల వయసులో ఐటీఎఫ్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత సంవత్సరమే వింబుల్డన్ జూనియర్ టైటిల్ గెలవడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. కేసీ డెలాక్వా తోడుగా మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఫైనల్ చేరగా, సింగిల్స్‌లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. అయితే 2014లో అనూహ్యంగా ఆటకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘చిన్నప్పటి నుంచే ఆడుతున్న నేను ఇంత ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఒక సాధారణ టీనేజర్‌గా నా జీవితం గడపాలని ఉంది’ అంటూ దాదాపు 18 నెలలు టెన్నిస్ నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో క్రికెట్‌పై దృష్టి పెట్టింది. ప్రాథమిక స్థాయిలో ఎలాంటి శిక్షణ లేకపోయినా కొద్ది రోజుల్లోనే ఆటపై పట్టు సాధించి ఏకంగా ‘మహిళల బిగ్‌బాష్ లీగ్’లో బ్రిస్బేన్ హీట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత 2016 ఫిబ్రవరిలో మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చిన యాష్లే బార్టీకి వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. -
చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. సింధు, సైనాలకు సాధ్యం కాని ఘనత సొంతం
Indian Shuttler Tasnim Mir Achieves Under 19 World No 1 Rank: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో 16 ఏళ్ల గుజరాత్ అమ్మాయి తస్నిమ్ మీర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అండర్ 19 మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గతేడాది బల్గేరియా, ఫ్రాన్స్, బెల్జియంలలో జరిగిన టోర్నీల్లో సత్తా చాటడం ద్వారా మూడు ర్యాంకులను మెరుగుపర్చుకున్న తస్నిమ్.. అగ్రపీఠాన్ని అధిరోహించింది. ప్రస్తుతం తస్నిమ్ 10,810 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగతుండగా.. మరో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. కాగా, అండర్ 19 విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో స్థానం వరకు మాత్రమే చేరుకోగలిగింది. చదవండి: నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..! -
మరి నీ సంగతి ఏమిటి మారిన్ ?: సైనా
న్యూఢిల్లీ: తనను తిరిగి నంబర్ వన్ కానివ్వనంటూ స్పెయిన్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేసిన వ్యాఖ్యలపై భారత షట్లర్ సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించింది. తన సంగతి పక్కన పెడితే.. మరి నువ్వు నంబర్ అవుతావా అంటూ సైనా చురకలంటించింది. ఇందుకు ఇండియన్ ఓపెన్ సిరీస్ టోర్నీ వేదికైంది. 'నంబర్ వన్ ర్యాంకుపై దృష్టి పెట్టడం నా పని కాదు. వరుసగా టోర్నమెంట్లు గెలుస్తూ ముందుకు సాగడమే నాకు తెలిసిన విద్య. నేను ఎప్పుడూ నంబర్ వన్ ర్యాంకు కోసం ఆలోచించలేదు.. ఆలోచించను కూడా. నేను 30వ ర్యాంకులు ఉన్నప్పట్నుంచి టోర్నమెంట్లు గెలవడంపై దృష్టి సారించా. అవే నాకు అత్యంత తృప్తినిస్తాయి. ఒకవేళ నన్ను నంబర్ వన్ కానివ్వకుండా నువ్వు అడ్డుకుంటే ఓకే. మరి మారిన్ నంబర్ వన్ అవుతుందేమో చూద్దాం' అని సైనా వ్యంగ్యంగా తిప్పికొట్టింది. ప్రస్తుతం మారిన్ ప్రపంచ నాల్గో ర్యాంకులో ఉంటే, సైనా నెహ్వాల్ ఎనిమిదో ర్యాంకులో ఉంది. -
‘వన్’డర్ సానియా...
-
‘వన్’డర్ సానియా...
డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా భారత స్టార్ హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం ఈ సీజన్లో వరుసగా మూడో టైటిల్ రూ. 24 లక్షల 28 వేల ప్రైజ్‌మనీ సొంతం చార్ల్స్టన్ (అమెరికా): కల నిజమైంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద్భుతం చేసింది. ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఆదివారం ముగిసిన ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. 58 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-0, 6-4తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-దరిజా జురాక్ (క్రొయషియా) జంటపై గెలిచింది. సానియా జంటకు 39 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 24 లక్షల 28 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకుంటుంది. హింగిస్‌తో కలిసి సానియాకిది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్లలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత భారత్ తరఫున డబుల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన భారత ప్లేయర్‌గా సానియా నిలిచింది. అంతేకాకుండా అయ్ సుగియామ (జపాన్), షుయె పెంగ్ (చైనా), సెయి సు వీ (చైనీస్ తైపీ) తర్వాత మహిళల డబుల్స్‌లో ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా సానియా గుర్తింపు పొందింది. ‘‘ఏదో ఒక రోజున ప్రపంచ నంబర్‌వన్‌గా నిలవాలని ప్రతీ క్రీడాకారుడు కలలు కంటాడు. హింగిస్లాంటి క్రీడాకారిణితో కలిసి ఈ ఘనత సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో ఆడేందుకు వచ్చిన సమయంలో మా మదిలో ఒకటే లక్ష్యం ఉంది. అదే నంబర్‌వన్ కావడం. ఈ ఏడాది మరిన్ని టోర్నీల్లో గెలుస్తామని భావిస్తున్నాను.’’ -సానియా