మరి నీ సంగతి ఏమిటి మారిన్ ?: సైనా | Saina Nehwal smashes Carolina Marin on “world No. 1’ comment | Sakshi
Sakshi News home page

మరి నీ సంగతి ఏమిటి మారిన్ ?: సైనా

Published Thu, Mar 30 2017 1:59 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

మరి నీ సంగతి ఏమిటి మారిన్ ?: సైనా

మరి నీ సంగతి ఏమిటి మారిన్ ?: సైనా

న్యూఢిల్లీ: తనను తిరిగి నంబర్ వన్ కానివ్వనంటూ స్పెయిన్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేసిన వ్యాఖ్యలపై భారత షట్లర్ సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించింది. తన సంగతి పక్కన పెడితే.. మరి నువ్వు నంబర్ అవుతావా అంటూ సైనా చురకలంటించింది. ఇందుకు ఇండియన్ ఓపెన్ సిరీస్ టోర్నీ వేదికైంది.

'నంబర్ వన్ ర్యాంకుపై దృష్టి పెట్టడం నా పని కాదు. వరుసగా టోర్నమెంట్లు గెలుస్తూ ముందుకు సాగడమే నాకు తెలిసిన విద్య. నేను ఎప్పుడూ నంబర్ వన్ ర్యాంకు కోసం ఆలోచించలేదు.. ఆలోచించను కూడా. నేను 30వ ర్యాంకులు ఉన్నప్పట్నుంచి టోర్నమెంట్లు గెలవడంపై  దృష్టి సారించా. అవే నాకు అత్యంత తృప్తినిస్తాయి. ఒకవేళ నన్ను నంబర్ వన్ కానివ్వకుండా నువ్వు అడ్డుకుంటే ఓకే. మరి మారిన్ నంబర్ వన్ అవుతుందేమో చూద్దాం' అని సైనా వ్యంగ్యంగా తిప్పికొట్టింది. ప్రస్తుతం మారిన్ ప్రపంచ నాల్గో ర్యాంకులో ఉంటే, సైనా నెహ్వాల్ ఎనిమిదో ర్యాంకులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement