
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. దుబాయ్‌లో నేడు మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 61 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్ మూడు కాంస్య పతకాలు (2010, 2016, 2018), పీవీ సింధు (2014, 2022) రెండు కాంస్య పతకాలు సాధించారు. అయితే ఈ ఏడాది సైనా నెహ్వాల్ బరిలోకి దిగడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment