యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ పీవీ సింధు 18–21, 21–10, 13–21తో 22వ ర్యాంకర్ పాయ్ యుపో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తస్నీమ్, మాళవిక, ఆకర్షి, తాన్యా, అష్మిత కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 22–24, 17–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా 12వ ఓటమి. భారత నంబర్‌వన్ ప్రణయ్ 21–13, 21–17తో జూలియన్ (బెల్జియం)పై, ప్రియాన్షు 21–15, 21–19తో చోయ్ జి హున్ (కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
సిక్కి రెడ్డి జోడీ గెలుపు
మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి–రోహన్ కపూర్ 21–17, 21–17తో అలి్వన్ మోరాదా–అలీసా లియోన్ (ఫిలిప్పీన్స్)లపై గెలి చారు. సుమీత్ రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–23, 21–13, 12–21తో సాంగ్ హున్ చో–లీ జంగ్ హున్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment