Korea Open Badminton
-
సాత్విక్-చిరాగ్ జోడిని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లోనూ వీరిద్దరి విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇవాళ జరిగిన కొరియా ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అల్‌పయాన్–ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో గెలుపొందారు. తొలి గేమ్‌ను 17-21తో ఓడిపోయినప్పటికి రెండో గేమ్‌లో పుంజుకున్న భారత ద్వయం.. ప్రత్యర్థి సర్వీస్‌ను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లింది. 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. కీలకమైన మూడో గేమ్‌లోనూ బలమైన స్మాష్ సర్వీస్‌లతో విరుచుకుపడిన సాత్విక్-చిరాగ్ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్‌ను ముగించి చాంపియన్స్‌గా అవతరించింది. ఓవరాల్‌గా సాత్విక్-చిరాగ్ జోడికి ఇది మూడో BWF వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్. సాత్విక్-చిరాగ్ జోడి గత నెలలో ఇండోనేషియా ఓపెన్ టైటిల్ కూడా గెలుచుకుంది. -
సాత్విక్-చిరాగ్ జోడీదే కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్
-
సాత్విక్-చిరాగ్ జోడి సంచలనం.. కొరియా ఓపెన్ కైవసం
భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన పరుషుల డబుల్స్ ఫైనల్లో ఈ ద్వయం.. ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అల్‌పయాన్–ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయాన్ని సాధించారు. కాగా గత నెల ఈ జోడి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 17-21తో ఓడిపోయినప్పటికి రెండో గేమ్‌లో ఫుంజుకున్న సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి ప్రత్యర్థి జంట సర్వీస్‌ను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లారు. 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక కీలకమైన మూడో గేమ్‌లోనూ బలమైన స్మాష్ సర్వీస్‌లతో విరుచుకుపడిన సాత్విక్-చిరాగ్ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్‌ను ముగించి చాంపియన్స్‌గా అవతరించారు. ఓవరాల్‌గా ఈ జంటకు ఇది మూడో BWF వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ కావడం విశేషం. 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🤩 Satwik-Chirag win their 3️⃣rd #BWFWorldTour Super 500 title 🥳 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/t0osXuHCFS — BAI Media (@BAI_Media) July 23, 2023 Korea Open: SatChi defeated Alfian/Ardianto in a 3 setter battle to win the title, 3rd title of the year.. What a great pair they have become, df. WN2 pair in SF and WN1 pair in Final.. #Badminton #KoreaOpen pic.twitter.com/JQt8p3BegQ — Aditya Narayan Singh (@AdityaNSingh87) July 23, 2023 చదవండి: #Gianluigi Donnarumma: దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్, అతని భార్యను బంధించి -
తొలి రౌండ్లోనే ఓడిన సింధు, కిడాంబి శ్రీకాంత్
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ పీవీ సింధు 18–21, 21–10, 13–21తో 22వ ర్యాంకర్ పాయ్ యుపో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తస్నీమ్, మాళవిక, ఆకర్షి, తాన్యా, అష్మిత కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 22–24, 17–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా 12వ ఓటమి. భారత నంబర్‌వన్ ప్రణయ్ 21–13, 21–17తో జూలియన్ (బెల్జియం)పై, ప్రియాన్షు 21–15, 21–19తో చోయ్ జి హున్ (కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సిక్కి రెడ్డి జోడీ గెలుపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి–రోహన్ కపూర్ 21–17, 21–17తో అలి్వన్ మోరాదా–అలీసా లియోన్ (ఫిలిప్పీన్స్)లపై గెలి చారు. సుమీత్ రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–23, 21–13, 12–21తో సాంగ్ హున్ చో–లీ జంగ్ హున్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సింధు, శ్రీకాంత్ సులువుగా...
సన్‌చెయోన్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 40 నిమిషాల్లో 21–15, 21–14తో లౌరెన్ లామ్ (అమెరికా)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 40 నిమిషాల్లో 22–20, 21–11తో డారెన్ లూ (మలేసియా)ను ఓడించాడు. గతంలో డారెన్‌తో ఆడిన మూడుసార్లూ ఓడిన శ్రీకాంత్ నాలుగో ప్రయత్నంలో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. మహిళల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ 5–21, 13–21తో రెండో సీడ్ ఆన్ సెయంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–16, 21–15తో తె యాంగ్ షిన్–వాంగ్ చాన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21–19, 21–18తో జున్ లియాంగ్ ఆండీ క్వెక్–యుజియా జిన్ (సింగపూర్) జంటపై నెగ్గింది. -
క్వార్టర్స్‌లో కశ్యప్
ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం 56 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్ 21–17, 11–21, 21–12తో డారెన్ ల్యూ (మలేసియా)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో కశ్యప్ 15–10తో ఆధిక్యంలో నిలిచినా డారెన్ పోరాడటంతో స్కోరు 18–17కు చేరింది. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించి కశ్యప్ గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో ఒక దశలో డారెన్ వరుసగా 12 పాయిం ట్లు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ మళ్లీ పుంజుకున్నాడు. 12–2తో ఆధిక్యంలో నిలిచిన హైదరాబాదీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. -
విజయం అంచుల నుంచి...
సియోల్: ఒక్క పాయింట్ సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖాయమయ్యే పరిస్థితిని చేజేతులా వదులుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొరియా ఓపెన్ నుంచి భారంగా నిష్క్రమించింది. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా అనూహ్యంగా ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా 21–15, 15–21, 20–22తో ఒకుహారా చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్ నుంచి హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో ఇద్దరు చెరో గేమ్ గెలిచి సమఉజ్జీగా నిలిచారు. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో కాస్త దూకుడు పెంచిన సైనా 4–1తో అధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న ప్రత్యర్థి వరుస పాయింట్లు సాధించడంతో సైనా ఆధిక్యం 11–10కు తగ్గింది. ఆ తర్వాత భారత షట్లర్ కూడా వరుసగా 5 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత సైనా మరింత జోరు పెంచి నాలుగు పాయింట్లు నెగ్గింది. 20–16తో విజయం అంచుల్లో నిలిచింది. ఒక్క పాయింట్ సాధించి విజయం ఖాయం చేసుకోవాల్సిన స్థితిలో సైనా తడబడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వరుసగా ఆరు పాయింట్లు ఒకుహారాకు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో టైటిల్ గెలిచిన సైనా... ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సహచర క్రీడాకారిణి సింధును ఓడించి స్వర్ణం గెలిచింది. ఇటీవల ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. -
సెమీస్‌లో జయరామ్
నిరాశపర్చిన సింధు కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సియోల్ : ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్... కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ జయరామ్ 21-19, 16-21, 21-16తో ప్రపంచ 26వ ర్యాంకర్ షో ససాకి (జపాన్)పై అద్భుత విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్ కీలక సమయంలో స్ఫూర్తిదాయక పోరాటాన్ని చూపెట్టాడు. తొలి గేమ్‌లో 3-11తో వెనుకబడ్డా.. వరుసగా 8 పాయింట్లు నెగ్గి 11-11తో స్కోరు సమం చేశాడు. తర్వాత ససాకి మరోసారి ఆధిపత్యం చెలాయిస్తూ 19-17 ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జయరామ్ నాలుగు వరుస పాయింట్లతో గేమ్‌ను ముగించాడు. రెండో గేమ్ ఆరంభంలో జయరామ్ 6-1 ఆధిక్యంలోకి వెళ్లినా.. ససాకి నేర్పుగా అడ్డుకట్ట వేశాడు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గడంతో పాటు ఓ దశలో 10-10తో స్కోరును సమం చేశాడు. తర్వాత వరుసగా నాలుగు, ఐదు పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పాయింట్ల కోసం ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో జపాన్ ప్లేయర్ 9-6 ఆధిక్యంలోకి వెళ్లినా.. జయరామ్ నిలకడగా ఆడుతూ 12-12తో సమం చేశాడు. తర్వాత రెండు, మూడు పాయింట్ల ఆధిక్యంతో గేమ్‌తో పాటు చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఇటీవల డచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన జయరామ్... ఈ సీజన్లో మలేసియా, స్విస్, రష్యా ఓపెన్ టోర్నీల్లో సెమీస్‌కు చేరాడు. మరోవైపు మహిళల ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు 16-21, 13-21తో సయకా తకహషి (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.