సెమీస్‌లో జయరామ్ | Jayaram in the mix | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో జయరామ్

Published Sat, Sep 19 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

సెమీస్‌లో జయరామ్

సెమీస్‌లో జయరామ్

నిరాశపర్చిన సింధు  
కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్

 
 సియోల్ : ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్... కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ జయరామ్ 21-19, 16-21, 21-16తో ప్రపంచ 26వ ర్యాంకర్ షో ససాకి (జపాన్)పై అద్భుత విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. గంటా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్ కీలక సమయంలో స్ఫూర్తిదాయక పోరాటాన్ని చూపెట్టాడు.

తొలి గేమ్‌లో 3-11తో వెనుకబడ్డా.. వరుసగా 8 పాయింట్లు నెగ్గి 11-11తో స్కోరు సమం చేశాడు. తర్వాత ససాకి మరోసారి ఆధిపత్యం చెలాయిస్తూ 19-17 ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జయరామ్ నాలుగు వరుస పాయింట్లతో గేమ్‌ను ముగించాడు. రెండో గేమ్ ఆరంభంలో జయరామ్ 6-1 ఆధిక్యంలోకి వెళ్లినా.. ససాకి నేర్పుగా అడ్డుకట్ట వేశాడు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గడంతో పాటు ఓ దశలో 10-10తో స్కోరును సమం చేశాడు. తర్వాత వరుసగా నాలుగు, ఐదు పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పాయింట్ల కోసం ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు.

 ఓ దశలో జపాన్ ప్లేయర్ 9-6 ఆధిక్యంలోకి వెళ్లినా.. జయరామ్ నిలకడగా ఆడుతూ 12-12తో సమం చేశాడు. తర్వాత రెండు, మూడు పాయింట్ల ఆధిక్యంతో గేమ్‌తో పాటు చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఇటీవల డచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన జయరామ్... ఈ సీజన్‌లో మలేసియా, స్విస్, రష్యా ఓపెన్ టోర్నీల్లో సెమీస్‌కు చేరాడు. మరోవైపు మహిళల ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు 16-21, 13-21తో సయకా తకహషి (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement