
సాక్షి, తాడేపల్లి: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లోనూ వీరిద్దరి విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఇవాళ జరిగిన కొరియా ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అల్‌పయాన్–ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో గెలుపొందారు.
తొలి గేమ్‌ను 17-21తో ఓడిపోయినప్పటికి రెండో గేమ్‌లో పుంజుకున్న భారత ద్వయం.. ప్రత్యర్థి సర్వీస్‌ను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లింది. 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. కీలకమైన మూడో గేమ్‌లోనూ బలమైన స్మాష్ సర్వీస్‌లతో విరుచుకుపడిన సాత్విక్-చిరాగ్ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్‌ను ముగించి చాంపియన్స్‌గా అవతరించింది.
ఓవరాల్‌గా సాత్విక్-చిరాగ్ జోడికి ఇది మూడో BWF వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్. సాత్విక్-చిరాగ్ జోడి గత నెలలో ఇండోనేషియా ఓపెన్ టైటిల్ కూడా గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment