వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా కెంటా మోమోటా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మోమోటా 21–17, 21–13తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించాడు. జపాన్‌లో జూదం ఆడటంపై నిషేధం ఉంది. 2016లో మోమోటా జూదం ఆడుతూ దొరికిపోవడంతో అతన్ని జపాన్ బ్యాడ్మింటన్ సంఘం ఏడాదిపాటు సస్పెండ్ చేయడంతోపాటు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టు నుంచి తొలగించింది.
గతేడాది మేలో నిషేధం గడువు పూర్తయ్యాక పునరాగమనం చేసిన అతను చిన్న స్థాయి టోర్నీలు ఆడుతూ ర్యాంక్ మెరుగుపర్చుకున్నాడు. 23 ఏళ్ల మోమోటా ఆసియా చాంపియన్‌షిప్‌లో పూర్వ వైభవాన్ని సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) నిలబెట్టుకుంది. టాప్ సీడ్ తై జు యింగ్ 21–19, 22–20తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment