
షా ఆలమ్ (మలేసియా): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు తొలి మ్యాచ్‌లో భారీ ఓటమి ఎదురైంది. దక్షిణ కొరియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 0–5తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 11–21, 19–21తో ప్రపంచ 2094వ ర్యాంకర్ జియోన్ హైక్ జిన్ చేతిలో ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత రవికృష్ణ–శంకర్ ప్రసాద్ 8–21, 10–21తో వి తె కిమ్–కిమ్ జెవాన్ చేతిలో... కిరణ్ జార్జ్ 18–21, 14–21తో జూ వాన్ కిమ్ చేతిలో... మంజిత్ సింగ్–డింకూ సింగ్ 7–21, 15–21తో యోంగ్ జిన్–నా సుంగ్ సెయుంగ్ చేతిలో... మిథున్ మంజునాథ్ 16–21, 27–25, 14–21తో మిన్ సన్ జియోంగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల విభాగంలో నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య మలేసియా జట్టుతో భారత్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment