
ఒలింపిక్స్ 2024 కోసం చేసిన సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. శుక్రవారం రాత్రి సెయిన్ నది నుంచి పారిస్(ఫ్రాన్స్) వేదికగా విశ్వ క్రీడల వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి

ముసుగు ధరించి... ఫ్రాన్స్ చరిత్రను తెరిచి.. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో ముసుగు ధరించిన వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టార్చ్ పట్టుకుని ముందుకు నడుస్తూ ఫ్రెంచ్ చరిత్రను కళ్లకు కట్టాడు

ఒకవైపు సాహసోపేతమైన ఫీట్లు, మరోవైపు శ్రోతలను అలరించే సంగీతం.. పారిస్ నగర నడిబొడ్డను.. చారిత్రక ప్రదేశాలను తాకుతూ వివిధ దేశాల అథ్లెట్ల పడవలు ముందుకుసాగాయి. వీటిని చూసేందుకు క్రీడాభిమానులకు రెండు కళ్లూ సరిపోలేదు














































