World Championship
-
WCL 2024: రైనా హాఫ్ సెంచరీ వృథా.. పాకిస్తాన్‌పై భారత్ ఓటమి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ విధ్వంసం సృష్టించింది. పాకిస్తాన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ ఆక్మల్(40 బంతుల్లో 77), షర్జీల్ ఖాన్(72), మసూద్(51) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో పవన్ నేగి, అనురీత్ సింగ్, ఆర్పీ సింగ్, కులకర్ణి తలా వికెట్ సాధించారు.రైనా హాఫ్ సెంచరీ వృథా..అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో సురేష్ రైనా(52) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అంబటి రాయడు(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో షోయబ్ మాలిక్, రియాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్, షోహిల్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
కృష్ణాతీరంలో ఫార్ములా వన్
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఏపీ రాజధాని అమరావతిలో వరల్డ్ పవర్ బోట్ రేసింగ్ ఛాంపియన్షిప్ జరుగనుంది. విజయవాడ కృష్ణాతీరంలో ఫార్ములా ఒన్ తరహాలో ఈ పోటీలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా కృష్ణా నదిలో పది రోజుల పాటు జరిగే పీ-వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారుల వస్తారని భావిస్తున్నారు. ఈ భారీ ఈవెంట్‌పై నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని నిర్వాహకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జరిగిన సమావేశంలో సూచించారు. నదీ తీరం నుంచి వీక్షకులు ఈ పోటీలను 30 మీటర్ల రేంజ్లో చాలా స్పష్టంగా చూసేందుకు అవకాశం ఉండాలన్నారు. ఈ పోటీలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. -
సింధు ముందంజ.. జ్వాలా జోడీ అవుట్
కాపెన్‌హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పీవీ సింధు ముందంజ వేయగా, జ్వాల జోడీకి నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో రైజింగ్ స్టార్ సింధు మూడో రౌండ్లో ప్రవేశించింది. రెండో రౌండ్లో సింధు 21-12, 21-17తో ఓల్గా గొలొవనోవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో భారత్ జోడీ సుమీత్ రెడ్డి, మను అట్రి జంట మూడో రౌండ్లో ప్రవేశించింది. కాగా మహిళల డబుల్స్ రెండో రౌండ్లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప జోడీ ఓటమి చవిచూసింది.