వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ విధ్వంసం సృష్టించింది. పాకిస్తాన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.
పాక్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ ఆక్మల్(40 బంతుల్లో 77), షర్జీల్ ఖాన్(72), మసూద్(51) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో పవన్ నేగి, అనురీత్ సింగ్, ఆర్పీ సింగ్, కులకర్ణి తలా వికెట్ సాధించారు.
రైనా హాఫ్ సెంచరీ వృథా..
అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో సురేష్ రైనా(52) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అంబటి రాయడు(39) పరుగులతో పర్వాలేదన్పించాడు.
మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో షోయబ్ మాలిక్, రియాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్, షోహిల్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment