కృష్ణాతీరంలో ఫార్ములా వన్   | Powerboat World Championship in andhra pradesh | Sakshi
Sakshi News home page

కృష్ణాతీరంలో ఫార్ములా వన్  

Published Wed, Sep 27 2017 5:22 PM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM

 Powerboat World Championship in andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఏపీ రాజధాని అమరావతిలో వరల్డ్ పవర్ బోట్‌ రేసింగ్ ఛాంపియన్‌షిప్ జరుగనుంది. విజయవాడ కృష్ణాతీరంలో ఫార్ములా ఒన్ తరహాలో ఈ పోటీలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా కృష్ణా నదిలో పది రోజుల పాటు జరిగే పీ-వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారుల వస్తారని భావిస్తున్నారు.

ఈ భారీ ఈవెంట్‌పై నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని నిర్వాహకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జరిగిన సమావేశంలో సూచించారు. నదీ తీరం నుంచి వీక్షకులు ఈ పోటీలను 30 మీటర్ల రేంజ్‌లో చాలా స్పష్టంగా చూసేందుకు అవకాశం ఉండాలన్నారు. ఈ పోటీలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement