Power Boat
-
పవర్‌బోట్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్
-
పవర్‌బోట్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్ : మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పట్టణంలోని మినీట్యాంక్ ను సందర్శించిన ఆయన.. మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి పవర్ బోట్లో ప్రయాణించారు. అంతకుముందు ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటి పరిధిలో రూ. 60 కోట్లుతో చేపట్టిన అబివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు. రూ. 30 కోట్లతో పట్టణంలోని 41 వార్డుల్లో చేపట్టనున్న 215 పనులకు కూడా కేటీఆర్ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. పట్టణంలోని దివిటిపల్లి వద్ద చేపట్టనున్న ఐటీ పార్క్ పైలాన్ ఆయన ఆవిష్కరించారు. -
కృష్ణాతీరంలో ఫార్ములా వన్
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఏపీ రాజధాని అమరావతిలో వరల్డ్ పవర్ బోట్ రేసింగ్ ఛాంపియన్షిప్ జరుగనుంది. విజయవాడ కృష్ణాతీరంలో ఫార్ములా ఒన్ తరహాలో ఈ పోటీలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా కృష్ణా నదిలో పది రోజుల పాటు జరిగే పీ-వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారుల వస్తారని భావిస్తున్నారు. ఈ భారీ ఈవెంట్‌పై నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని నిర్వాహకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జరిగిన సమావేశంలో సూచించారు. నదీ తీరం నుంచి వీక్షకులు ఈ పోటీలను 30 మీటర్ల రేంజ్లో చాలా స్పష్టంగా చూసేందుకు అవకాశం ఉండాలన్నారు. ఈ పోటీలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. -
నేలపైనా.. నీటిపైనా.. ఎక్కడైనా..
నేల మీద కారులా.. నీటిపై పవర్ బోట్లా మారిపోయే ఉభయచర వాహనాలు పలు దేశాల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఇది సరికొత్తది. పేరు ‘క్వాడ్స్కీ ఎక్స్ఎల్’. ఈ యాంఫీబియస్ ఫోర్ వీలర్‌ను అమెరికాకు చెందిన గిబ్స్ కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. క్వాడ్స్కీ తొలి వెర్షన్‌ను ఇంతకుముందే రూపొందించినా దానికి ఒక సీటు మాత్రమే ఉండేది. దీనిపై జంటగా ప్రయాణిస్తేనే మరింత మజా ఉంటుందని భావించిన ఆ కంపెనీ తాజా వెర్షన్లో మరో సీటునూ జతచే సింది. జస్ట్ ఒక బటన్‌ను నొక్కితే చాలు.. ఐదు సెకన్లలోనే ఇది ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్‌లోకి మారిపోతుంది. రోడ్డుపై, నీటిపై గంటకు 72 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. దీని బరువు 47 కిలోలు మాత్రమే. ధర సుమారు రూ.24 లక్షల వరకూ ఉండవచ్చని చెబుతున్నారు.