నేలపైనా.. నీటిపైనా.. ఎక్కడైనా..
నేల మీద కారులా.. నీటిపై పవర్ బోట్‌లా మారిపోయే ఉభయచర వాహనాలు పలు దేశాల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఇది సరికొత్తది. పేరు ‘క్వాడ్‌స్కీ ఎక్స్‌ఎల్’. ఈ యాంఫీబియస్ ఫోర్ వీలర్‌ను అమెరికాకు చెందిన గిబ్స్ కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. క్వాడ్‌స్కీ తొలి వెర్షన్‌ను ఇంతకుముందే రూపొందించినా దానికి ఒక సీటు మాత్రమే ఉండేది.
దీనిపై జంటగా ప్రయాణిస్తేనే మరింత మజా ఉంటుందని భావించిన ఆ కంపెనీ తాజా వెర్షన్‌లో మరో సీటునూ జతచే సింది. జస్ట్ ఒక బటన్‌ను నొక్కితే చాలు.. ఐదు సెకన్లలోనే ఇది ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్‌లోకి మారిపోతుంది. రోడ్డుపై, నీటిపై గంటకు 72 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. దీని బరువు 47 కిలోలు మాత్రమే. ధర సుమారు రూ.24 లక్షల వరకూ ఉండవచ్చని చెబుతున్నారు.