ఫొటోలో ఉన్నది కొత్త మోడల్ వ్యాన్‌లా కనిపిస్తోంది కదూ! ఇది కొత్త మోడల్ వ్యాన్ మాత్రమే కాదు, దాదాపు ఉభయచర వాహనం. దాదాపు ఉభయచర వాహనమేంటి అనుకుంటున్నారా? ఔను! ఇది పూర్తి ఉభయచర వాహనం కాదు గాని, ఆపద్ధర్మానికి ఉభయచర వాహనంగానే పనికొస్తుంది. ఇది ఎలాంటి రోడ్ల మీదనైనా సునాయాసంగా ప్రయాణిస్తుంది.
అంతేకాదు, వరదనీరు ఉధృతంగా రోడ్లను ముంచెత్తినప్పుడు కూడా ఇది సునాయాసంగా ప్రయాణించగలదు. ‘ఎస్ట్యువరీ హోపర్’ పేరిట బ్రిటిష్ ఆటోమొబైల్ డిజైనర్ జోర్డాన్ బేమ్స్ ఈ విచిత్ర వాహనానికి రూపకల్పన చేశాడు. ఇది ‘సెమీ యాంఫీబియస్ వెహికల్’ అని చెబుతున్నారు. అంటే దాదాపు ఉభయచర వాహనమన్న మాట! వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు తరచుగా వరదల బారినపడే మన రోడ్ల మీదకు వస్తే బాగుంటుంది కదూ!
చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం!
Comments
Please login to add a commentAdd a comment