Amphibious vehicles
-
ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.50 మీటర్ల మోడల్‌లోను దొరుకుతుంది. ‘సీల్‌వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్‌లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్‌ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. -
సూపర్ వ్యాన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఫొటోలో ఉన్నది కొత్త మోడల్ వ్యాన్లా కనిపిస్తోంది కదూ! ఇది కొత్త మోడల్ వ్యాన్ మాత్రమే కాదు, దాదాపు ఉభయచర వాహనం. దాదాపు ఉభయచర వాహనమేంటి అనుకుంటున్నారా? ఔను! ఇది పూర్తి ఉభయచర వాహనం కాదు గాని, ఆపద్ధర్మానికి ఉభయచర వాహనంగానే పనికొస్తుంది. ఇది ఎలాంటి రోడ్ల మీదనైనా సునాయాసంగా ప్రయాణిస్తుంది. అంతేకాదు, వరదనీరు ఉధృతంగా రోడ్లను ముంచెత్తినప్పుడు కూడా ఇది సునాయాసంగా ప్రయాణించగలదు. ‘ఎస్ట్యువరీ హోపర్’ పేరిట బ్రిటిష్ ఆటోమొబైల్ డిజైనర్ జోర్డాన్ బేమ్స్ ఈ విచిత్ర వాహనానికి రూపకల్పన చేశాడు. ఇది ‘సెమీ యాంఫీబియస్ వెహికల్’ అని చెబుతున్నారు. అంటే దాదాపు ఉభయచర వాహనమన్న మాట! వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు తరచుగా వరదల బారినపడే మన రోడ్ల మీదకు వస్తే బాగుంటుంది కదూ! చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం! -
నేలపైనా.. నీటిపైనా.. ఎక్కడైనా..
నేల మీద కారులా.. నీటిపై పవర్ బోట్లా మారిపోయే ఉభయచర వాహనాలు పలు దేశాల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఇది సరికొత్తది. పేరు ‘క్వాడ్స్కీ ఎక్స్ఎల్’. ఈ యాంఫీబియస్ ఫోర్ వీలర్‌ను అమెరికాకు చెందిన గిబ్స్ కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. క్వాడ్స్కీ తొలి వెర్షన్‌ను ఇంతకుముందే రూపొందించినా దానికి ఒక సీటు మాత్రమే ఉండేది. దీనిపై జంటగా ప్రయాణిస్తేనే మరింత మజా ఉంటుందని భావించిన ఆ కంపెనీ తాజా వెర్షన్లో మరో సీటునూ జతచే సింది. జస్ట్ ఒక బటన్‌ను నొక్కితే చాలు.. ఐదు సెకన్లలోనే ఇది ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్‌లోకి మారిపోతుంది. రోడ్డుపై, నీటిపై గంటకు 72 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. దీని బరువు 47 కిలోలు మాత్రమే. ధర సుమారు రూ.24 లక్షల వరకూ ఉండవచ్చని చెబుతున్నారు.