
వెహికల్ అంటే రోడ్డుపై నడుస్తుంది.. లేదా నీటిపై నడుస్తుంది. రోడ్డుపైన, నీటిపైన నడిచే వాహనాలు చాలా అరుదు. అలాంటి కోవకు చెందిన వాహనమే 'క్రాసర్' (CROSSER). ఇది చూడటానికి ఒక బాక్స్ మాదిరిగా ఉన్న.. అటానమస్ వెహికల్. ఇందులో నలుగురు వ్యక్తులు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో నీటిలో కూడా ముందుకు సాగేలా.. డిజైనర్ బెర్నార్డో పెరీరా దీనిని డిజైన్ చేశారు. ఇది 2024 ఫిబ్రవరిలో మొదటిసారి కాన్సెప్ట్ రూపంలో కనిపించింది. ఇప్పుడు ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

క్రాసర్ ఆటోమాటిక్ ఎలక్ట్రిక్ వెహికల్.. లోపలి భాగం కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇరువైపులా రెండు సీట్లు, మధ్యలో తగినంత లెగ్‌రూమ్.. స్పీకర్లు వంటివన్నీ ఇందులో ఉన్నాయి. డోర్స్ కూడా ఆటోమాటిక్. అంటే ఈ కారును బుక్ చేసుకున్న వ్యక్తులకు మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది. బుక్ చేసుకున్న వారు కాకుండా.. ఇతరులు ఈ కారులోకి ప్రవేశించలేరు.
వెహికల్ బుక్ చేసుకున్నవారు.. స్మార్ట్‌ఫోన్‌ను డోర్ మీద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్ దగ్గర ఉంచినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ వాహనాన్ని డ్రైవ్ చేయడానికి డ్రైవర్ కూడా అవసరం లేదు. కాబట్టి రోడ్డుమీద ప్రయాణించడానికి అవసరమైన కెమెరాలు, సెన్సార్‌లను ఇందులో ఉన్నాయి.

రోడ్డుపై నుంచి నీటిలోకి వెళ్ళేటప్పుడు.. క్రాసర్ నెమ్మదిగా నీటిలోకి దిగుతుంది. ఆ తరువాత నీటిలో ప్రయాణించడానికి అనుకూలంగా చక్రాలు 30 డిగ్రీలు తిరుగుతాయి. మళ్ళీ రోడ్డుపైకి వెళ్లాలంటే.. సస్పెన్షన్ రహదారి పరిస్థితికి అనుగుణంగా మారిపోతుంది. మొత్తం మీద దీనిని రోడ్డుపైన, నీటిపైన వెళ్ళడానికి సరిపోయే విధంగా రూపొందించారు.
Source: designboom
Comments
Please login to add a commentAdd a comment