autonomous
-
అనుమతిచ్చే ముందు అడగండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్, డీమ్డ్ హోదా ఇచ్చేప్పుడు తమను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను కోరింది. ఇష్టానుసారం అనుమతులిస్తే స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కాలేజీలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా, ఇతరత్రా సమస్యలు వచ్చినా పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా అనుమతులు పొందుతుంటే, రాష్ట్రంలోని ఇతర కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైందని పేర్కొంది. మల్లారెడ్డి సంస్థలకు ఇటీవల కేంద్రం డీమ్డ్ హోదా ఇచ్చింది. మహేంద్ర యూనివర్సిటీకి కూడా ఇచ్చే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో యూజీసీతో పాటు ఏఐసీటీఈకి రాష్ట్ర విద్యాశాఖ లేఖ రాసింది. చిన్న కాలేజీలు విలవిల డీమ్డ్, అటానమ్ కాలేజీలు పెద్దఎత్తున ప్రచారం చే సుకుంటున్న నేపథ్యంలో చిన్న ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా తయారైందని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. 2016 నాటికి రాష్ట్రంలో 248 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నా యి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11 ఉంటే, ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కని్పస్తోంది. చివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటానమస్, డీమ్డ్ వర్సిటీలు వస్తే మరికొన్ని కాలేజీలు మూతపడే అవకాశం ఉందని, దీనివల్ల పేద వర్గాలకు ఇంజనీరింగ్ విద్య మరింత ఖరీదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి కోర్సుల వైపే విద్యార్థులు వెళ్తున్నారు. కొత్తగా వచ్చే కాలేజీలు ఈ కోర్సులనే ఆఫర్ చేయడం, భారీగా సీట్లు అమ్ముకునేందుకు డీమ్డ్ హోదా తెచ్చుకోవడం సరైన విధానం కాదని మండలి పేర్కొంటోంది. విదేశీ వర్సిటీలొస్తే మరింత ముప్పు! దేశంలో యూనివర్సిటీల ఏర్పాటుకు అమెరికా, ఆ్రస్టేలియా, ఇటలీలోని వర్సిటీలు ముందుకొస్తున్నాయి. వాటి బ్రాంచీలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతున్నాయి. విదేశాల్లో విద్యపై ఆసక్తి చూపించే విద్యార్థులను ఇవి ఆకట్టుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువని, కొన్ని కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం ఇంజనీరింగ్ కాలేజీల నాణ్యత పెంచాలని ఏఐసీటీఈ.. రాష్ట్రానికి సూచించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యలో మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు. ముందే తెలియజేస్తే బాగుంటుంది డీమ్డ్, అటానమస్ హోదా ఇచ్చేప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ముందే తెలియజేయాలని కోరుతూ యూజీసీకి లేఖ రాశాం. మా విజ్ఞప్తిని యూజీసీ పరిగణనలోనికి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రమేయం లేకుండా అనుమతి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. –ప్రొఫెసర్ వి.బాలకిష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
స్టీరింగ్ పట్టిన యంత్రుడు!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో అద్భుతాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎద్దుల బండితో మొదలైన మనిషి ప్రయాణం.. నేడు విమానంలో ప్రయాణించే స్థాయికి చేరింది. ఇది సరే అనుకునే లోపల.. అసలు మనిషే అవసరం లేకుండా కారు డ్రైవ్ చేస్తున్న సంఘటనలు నేడు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో భాగంగానే జపాన్ పరిశోధకులు ముసాషి అనే హ్యూమనాయిడ్ రోబోట్ సృష్టించారు.ముసాషి రోబోట్ ఎలక్ట్రిక్ మైక్రో-కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఒక వీడియో కూడా జేఎస్కే టెండన్ గ్రూప్ తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. వీడియోలో గమనించినట్లయితే.. రోబోట్ రోడ్డుపై పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేయడం చూడవచ్చు.రోబోట్ డ్రైవింగ్ చేసే మైక్రో కారులో కూడా విజన్ కెమెరాలు, జీపీఎస్, కాంప్లెక్స్ అల్గారిథమ్‌లు అండ్ కంట్రోల్ సిస్టం అనే టెక్నాలజీలు ఇన్స్టాల్ చేశారు. ఇవన్నీ రోడ్డు మీద సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ఉపయోగపడతాయి. డ్రైవర్‌గా మనిషి అవసరం లేకుండా కారును డ్రైవ్ చేసే టెక్నాలజీని కనిపెట్టడంలో భాగంగానే ముసాషిని రూపొందించారు.ముసాషి అనేది "మస్క్యులోస్కెలెటల్ హ్యూమనాయిడ్". దీనిని 2019లో పరిశోధనా బృందం తయారు చేసింది. ఇది మనిషిలాంటి ప్రతి రూపం పొందటమే కాకుండా.. ఇది మానవ శరీరం మాదిరిగా ఉండే కండర నిర్మాణాన్ని కలిగి ఉంది. దీనిని పరిశోధకులు ఇప్పటికే పలు విధాలుగా టెస్ట్ చేశారు.ముసాషి కన్ను హై రిజల్యూషన్ కెమరా మాదిరిగా పనిచేస్తుంది. కాబట్టి దూరంగా ఉన్న వస్తువులను, మనుషులను ఇది సులభంగా గుర్తిస్తుంది. నేరుగా ఉన్న వాటిని మాత్రమే కాకుండా సైడ్ మిర్రర్ ద్వారా వెనుక వున్నవారిని కూడా చూడగలదు. ఇది హ్యాండ్ బ్రేక్ లాగడం, స్టీరింగ్ తిప్పడం, బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ వంటి వాటిని ఆఫర్స్ చేయడం కూడా చేస్తుంది. ఇవన్నీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి.ఇక్కడ కనిపించే కారును టయోటా కంపెనీ 2012లో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు పేరు 'ఛోట్టో ఒడెకేకే మచిమేడ్ సూయిసుయ్' (COMS). ఇది సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారును రోబోట్ డ్రైవ్ చేయడానికి అనుకూలంగా రూపొందించారు. టెస్ట్ డ్రైవ్ మాత్రం టోక్యో యూనివర్సిటీలోని కాశివా క్యాంపస్‌లో నిర్వహించినట్లు తెలుస్తోంది.టెస్టింగ్ సమయంలో ముసాషి మనిషిని గుర్తించడం, కారు రావడాన్ని గమనించడం, ట్రాఫిక్ లైట్లకు రెస్పాండ్ అవ్వడం వంటివి చూడవచ్చు. అన్ని టెస్టులలోనూ రోబోట్ ఉత్తమ పెర్ఫామెన్స్ చూపించినప్పటికీ.. హ్యుమానాయిడ్ ఆటోమాటిక్ డ్రైవింగ్ అనేది ప్రారంభ దశలోనే ఉంది. కాబట్టి ముసాషిను మరింత వేగంగా ఉండేలా రూపొందించాల్సిన చేయాల్సిన అవసరం ఉంది.హ్యూమనాయిడ్ రోబోట్స్ డ్రైవింగ్ వల్ల ఉపయోగాలురోడ్డు ప్రమాదాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదానికి కారణాలు మితిమీరిన వేగం కావొచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కావొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కావొచ్చు. అయితే ఒక రోబోట్ డ్రైవర్ అవ్వడం వల్ల అది తప్పకుండా రూల్స్ ఫాలో అవుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ కూడా. ఇలాంటి రోబోలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
భారత్‌లో డ్రైవర్‌లెస్ కారు.. రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు
భోపాల్ : కృత్రిమమేధతో నడిచే.. డ్రైవర్ లేని స్వయంగా నడిచే వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది సులువేమీ కాదని ఏఐ నిపుణులు అంటుంటే.. భారత్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆటోమొబైల్ రంగంలో ఏఐ టెక్నాలజీని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. డ్రైవర్‌లెస్ కారును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ డ్రైవర్ లెస్ కారు భారత్ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొడుతుండడం విశేషం. సంజీవ్ శర్మ స్వయాత్ రోబోట్ ఫౌండర్, సీఈఓ తాజాగా ఆ సంస్థ గత కొన్నేళ్లుగా ఓ ప్రముఖ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ డీజిల్ కారుపై అనేక పరిశోధనలు చేస్తూ వచ్చింది.ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని జోడించి డీజిల్ వేరియంట్ కారును అటానమస్ డ్రైవర్ లెస్ కారుగా మార్చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌లోని కంకాళి కాళీ మాత దేవాలయం నుంచి ఇరుకు సందుల్లో, రోడ్లమీద ట్రాఫిక్‌ను క్లియర్ చేసుకుంటూ డ్రైవర్ లెస్ కారు ప్రయాణాన్ని జీపీఎస్‌తో నావిగేట్ చేస్తున్న వీడియోని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొట్టకుండా పక్కకి వెళ్లడం, జనావాసాల్లో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ముందుకు కారు ప్రయాణించడం మనం గమనించవచ్చు. Autonomous driving through tight, dynamic, stochastic, and adversarial traffic-dynamics on sub-urban roads in India, as well as through partially unstructured environments. This demos showcases the robustness of our motion planning and decision making algorithmic frameworks in… pic.twitter.com/UcY07arxSK — Sanjeev Sharma (@sanjeevs_iitr) February 29, 2024 అయితే దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లాతో పాటు ఇతర కంపెనీలు డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటే స్వయాత్ రోబోట్ డీజిల్ కారును డ్రైవర్‌లెస్ కారు మార్చడమే కాకుండా విజయవంతంగా డ్రైవ్ చేయించడంపై ఆటోమొబైల్ కంపెనీలు అధినేతలు, టెక్నాలజీ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
Nuclear test: డ్రాగన్‌పై అణుమానాలు!
డ్రాగన్ దేశం మళ్లీ అణు పరీక్షలకు సిద్ధపడుతోందా? అందుకోసం చాపకింద నీరులా కొన్నేళ్లుగా క్రమంగా పక్కాగా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వస్తోందా? ఏ క్షణంలోనైనా భారీ స్థాయిలో అణు పరీక్షలు చేపట్టనుందా? అంటే అవుననే అంటోంది తాజా పరిశోధన ఒకటి. అణు నిరాయు«దీకరణ చర్యలను వేగవంతం చేసేందుకు అమెరికా ప్రయతి్నస్తున్న ఈ తరుణంలో చైనా తాజా చర్యలు కలకలం రేపుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ ఆయుధ పోటీ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి... అది వాయవ్య చైనాలోని మారుమూల జిన్జియాన్ అటానమస్ ఏరియా. అక్కడి ఓ ప్రాంతంలో కొన్నేళ్లుగా పలురకాలుగా హడావుడి పెరుగుతూ వస్తోంది. రకరకాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. కొండల్ని తొలిచి సొరంగాల్లాంటివి వేసే పనులూ సాగుతున్నాయి. ఇంకోవైపు కొత్త వైమానిక స్థావరం నిర్మాణంలో ఉంది. దానికి కొద్ది దూరంలోనే ఓ చిన్నపాటి శాటిలైట్ టౌన్ పుట్టుకొస్తోంది. బయటి ప్రపంచం దృష్టిలో పడకుండా అత్యంత పకడ్బందీగా జరుగుతున్న ఈ కార్యకలాపాలన్నీ ప్రముఖ అంతర్జాతీయ నిఘా నిపుణుడు డాక్టర్ రెనీ బాబియార్జ్ బయట పెట్టిన ఉపగ్రహ చిత్రాలతో తాజాగా వెలుగులోకి వచ్చాయి. దాంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇవన్నీ జరుగుతున్నది 1964లో చైనా తొలిసారి అణు పరీక్షలు జరిపిన లోప్‌నూర్ ప్రాంతంలో కావడమే అందుకు కారణం! త్వరలో భారీ ఎత్తున అణు పరీక్షలకు చైనా సిద్ధమవుతోందనేందుకు ఇవన్నీ తిరుగులేని ఆధారాలని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ మాజీ విశ్లేషకుడు కూడా అయిన రెనీ లోప్‌నూర్‌లో కార్యకలాపాలకు సంబంధించి కొన్నేళ్లుగా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను లోతుగా పరిశీలించారు. ఆ మీదట ఆయన అందజేసిన సాక్ష్యాల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. పక్కాగా ఏర్పాట్లు...!: న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని అభూత కల్పనగా చైనా కొట్టిపారేసింది. ఏదేదో ఊహించుకుని రాసిన నిరాధార కథనంగా దాన్ని అభివరి్ణంచింది. కానీ ఉపగ్రహ చిత్రాల్లో వెలుగు చూసిన విషయాలు మాత్రం చైనా కచి్చతంగా ఏదో దాస్తోందనేందుకు ఊతమిస్తున్నాయి. ఎందుకంటే ఒకట్రెండు శిథిల భవనాలు తప్ప 2017 దాకా నిద్రాణావస్థలోనే ఉన్న లోప్‌నూర్ ప్రాంతంలో గత కొన్నేళ్లలో అత్యాధునిక భవనాల భవన సముదాయాలు పుట్టుకొచి్చన వైనం ఆ చిత్రాల్లో స్పష్టంగా కని్పస్తోంది. అంతేగాక నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిన ఓ పటిష్టమైన బంకర్ కూడా ఉందక్కడ. దాని చుట్టూ ఎత్తైన రక్షణ గోడలు, పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థలు తదితరాలు కూడా కొట్టొచ్చినట్టు కని్పస్తున్నాయి. వీటితో పాటు ఏకంగా 90 అడుగుల ఎత్తైన డ్రిల్లింగ్ యంత్రం, ఆ పక్కనే డ్రిల్లింగ్ పైపులు కూడా ఉన్నాయి. దాని సాయంతో బహుశా నేలలోకి నిలువుగా కనీసం పావు మైలు లోతైన రంధ్రం చేసి అందులో అణ్వాయుధంతో కూడిన పేలుడు పదార్థాన్ని పేల్చి పరీక్షిస్తారన్నది బాబియార్జ్ అంచనా. లోప్నూర్కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మలాన్ ప్రాంతంలో కూడా ఓ అత్యాధునిక శాటిలైట్ సిటీ నిర్మాణంలో ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. అక్కడ కూడా రిగ్గింగ్ యంత్రాలు తదితర సెటప్ కనబడుతోంది. ఇదంతా బహుశా లోప్‌నూర్ అణు పరీక్ష పనుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తిస్థాయిలో ముందస్తు శిక్షణ కోసమని భావిస్తున్నారు. ప్రాంతీయ భద్రతకు ముప్పే చైనా అణు దూకుడు ఆసియాలో ప్రాంతీయ భద్రతను కూడా ప్రమాదంలో పడేసే పరిణామమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనాతో సాయుధ ఘర్షణలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇది మరీ ఇబ్బందికర పరిణామమే కానుంది. 1998 ఫోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం వాటిపై భారత్ స్వీయ నిషేధం విధించుకోవడం తెలిసిందే. అణు పరీక్షలు ఎందుకంటే... చైనా అణు పరీక్షలకు దిగనుండటమే నిజమైతే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అందుకు రక్షణ నిపుణులు పలు కారణాలను చూపుతున్నారు.... ► అణు కార్యకలాపాల విషయంలో కొద్దికాలంగా చైనా దూకుడు పెంచింది. ► దశాబ్దం క్రితం దాకా దానివద్ద కేవలం 50 ఖండాంతర క్షిపణులు మాత్రమే ఉండేవి. ► వాటిని 2028 కల్లా ఏకంగా 1,000కి పెంచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇటీవలే పెంటగాన్ వార్షిక నివేదిక వెల్లడించింది. ► వీటిలో 507 క్షిపణులను అణు సామర్థ్యంతో కూడినవిగా చైనా తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. ► ఈ దిశగా కొంతకాలంగా పలు అత్యాధునిక అణు వార్హెడ్లను చైనా తయారు చేస్తోంది. ► వాటిని అధునాతన ఖండాంతర, క్రూయిజ్ మిసైళ్లకు అనుసంధానిస్తూ వస్తోంది. ► ఆ వార్హెడ్లను పూర్తిస్థాయిలో పరీక్షించి సరిచూసుకునే ఉద్దేశంతో డ్రాగన్ దేశం ఇలా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అనుమానిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2023లో ఏఐ హవా.. టెక్నాలజీలో పెను సంచనలం..
Artificial Intelligence: 2023లో సంచనలం సృష్టించిన టెక్నాలజీ ఏదైనా ఉందంటే.. అది తప్పకుండా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) అనే చెప్పాలి. స్మార్ట్ఫోన్లే కుండా ఈ రోజుల్లో మనిషి ఎలా అయితే ఉండలేక పోతున్నాడో.. నేడు AI సహాయం లేకుండా కూడా ఉండలేడేమో అన్నట్టుగా అయిపోతోంది. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తూ వినియోగదారులను తెగ ఆకర్శించిన ఈ టెక్నాలజీ ప్రభావం ఎంతగా ఉందనే విషయాన్ని ఈ కథనంలో పరిశీలిద్దాం.. ఆరోగ్య సంరక్షణలో ఏఐ హస్తం ఓ వైపు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మనిషి ఆయుఃప్రమాణం తగ్గుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. దీని కోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. వర్కౌట్ ప్లాన్స్, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్లాన్స్, మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్, మెడికల్ సింప్టమ్ చెకర్, మెంటల్ హెల్త్ సపోర్ట్ వంటి విషయంలో ఎక్కువ మంది టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. అటానమస్ సిస్టం (స్వయం ప్రతిపత్తి) టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో చాలామంది ఆటోమాటిక్ విధానానికి అలవాటు పడుతున్నారు. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు నుంచి మానవరహిత వైమానిక వాహనాల వరకు టెక్నాలజీ వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ.. వినియోగించడానికి కొంత భయపడుతున్నట్లు సమాచారం. అటానమస్ సిస్టం మీద నమ్మకం పెంచడానికి, సమర్థవంతమైన రవాణాకు హామీ ఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆటోమోటివ్ పరిశ్రమే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో అటానమస్ సిస్టం రాజ్యమేలే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 15 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కంప్యూటర్ లాంగ్వేజ్ మాదిరిగా ఏఐ కోసం ప్రత్యేకమైన లాంగ్వేజ్ అంటూ ఏది లేదు. ప్రారంభంలో కేవలం ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అనేక భాషల్లో అందుబాటులోకి వస్తోంది. వివిధ భాషలను ఏఐ అర్థం చేసుకోవడం వల్ల వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ.. రోజు రోజుకి తనవైపు ఎంతోమంది ప్రజలను ఆకర్షిస్తోంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న సరికొత్త హెలికాఫ్టర్ - ఇది చాలా స్పెషల్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG కార్లతో పరుగులు పెడుతున్న ఆటోమొబైల్ మార్కెట్లో మరో అడుగు ముందుకు వేసి మానవరహిత హెలికాప్టర్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోటర్ టెక్నాలజీస్ ఇప్పుడు ఓ మానవ రహిత హెలికాప్టర్ తయారు చేయడంలో నిమగ్నమైంది. రాబిన్సన్ ఆర్44 రావెన్ II ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆర్550ఎక్స్ హెలికాఫ్టర్ మూడు గంటల కంటే ఎక్కువ సమయం, గంటకు 241 కిమీ/గం వేగంతో ప్రయాణించనుంది. ఇది సుమారు 550 కేజీల బరువును తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆర్550ఎక్స్ హెలికాఫ్టర్ టెస్టింగ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చాలా సింపుల్‌గా కనిపించే ఈ హెలికాప్టర్‌ను రిమోట్స్ వంటి పరికరాల ద్వారా ఆపరేట్ చేయడం చూడవచ్చు. ఇది చూడటానికి ఓ డ్రోన్ తరహాలో ఉంది. ఇందులో సెన్సార్లు, ఇతర ఆధునిక పరికరాలు ఉండటం వల్ల రాత్రి పూట కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. ఇది సాధారణ నాలుగు సీట్లు కలిగిన హెలికాఫ్టర్ మాదిరిగానే కనిపించినప్పటికీ.. ఇందులో పెద్ద కార్గో బే తప్ప సీట్లు లేదు. ఇందులో ఏదైనా లోడ్ (సరుకులు) వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రౌండ్ బేస్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్ రిలే నుంచి 16 కిమీ లేదా ఎయిర్‌బోర్న్ రిలే 16000 కిమీ వరకు కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉందనున్నట్లు సమాచారం. కమ్యూనికేషన్లు పోయినట్లయితే.. ఏక కాలంలో ఆరు వేర్వేరు డేటా లింక్‌లను రన్ చేయగలదు, తద్వారా మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు, తద్వారా తిరిగి దాని బేస్‌లోకి తీసుకురావచ్చు. ఇలాంటి హెలికాఫ్టర్లు కార్గో డెలివరీలు, అగ్నిప్రమాదం సమయంలో అగ్నిమాపక మిషన్లుగా కూడా పనిచేస్తాయి. ఇదీ చదవండి: దిగ్గజ వ్యాపారవేత్తల రైట్ హ్యాండ్స్.. వీళ్లు ఎంత చెప్తే అంతే! ఈ లేటెస్ట్ హెలికాఫ్టర్ల కోసం కంపెనీ స్పెషల్ ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇవి ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి, త్వరలోనే అవసరమైన సర్టిఫికెట్స్ కూడా పొందనున్నట్లు తెలుస్తుంది. సంస్థ ఈ రోటర్ ధరను అధికారికంగా వెల్లడించలేదు, అయితే వీటి డెలివరీలు 2024లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Images Source: Rotor Technologies -
హెచ్‌సీఎల్ చేతికి జర్మన్ కంపెనీ: 279 మిలియన్ డాలర్ల డీల్
ముంబై: దేశీయ మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ జర్మన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ సేవల సంస్థ ఎసాప్ గ్రూప్‌లో 100 శాతం ఈక్విటీ వాటాను (279.72 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. హెచ్‌సిఎల్‌టెక్ యూకే అనుబంధ సంస్థ ద్వారా జరిగే ఈ ఒప్పందం సెప్టెంబర్ 2023 నాటికి ముగియనుంది. ఇది ఇప్పుడు రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఉంటుందని సంస్థ గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అటానమస్ డ్రైవింగ్, ఇ-మొబిలిటీ, కనెక్టివిటీ రంగాలలో భవిష్యత్తు-ఆధారిత ఆటోమోటివ్ టెక్నాలజీలో తమ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంలో ఈ డీల్ తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. అలాగేఐరోపా, అమెరికా, జపాన్‌లోని కీలకమైన ఆటోమోటివ్ మార్కెట్స్‌లో విస్తరణకు ఈ కొనుగోలు సాయ పడుతుందని పేర్కొంది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్:లైసెన్స్ ఉండాల్సిందే!) హెచ్‌సీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికానికి(క్యూ1) ఆసక్తికర ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం వార్షికంగా 7 శాతం బలపడి రూ. 3,534 కోట్లను తాకింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 3,324 కోట్లు ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన రూ. 3,983 కోట్లతో పోలిస్తే లాభాలు 11 శాతం క్షీణించాయి. ఇక మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 26,296 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 23,464 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండు చెల్లింపునకు ఈ నెల 20 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఇతర విశేషాలు కొత్తగా 1,597 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి క్యూ1లో నికరంగా 2,506 మంది ఉద్యోగులు తగ్గారు. జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,438కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 16.3 శాతంగా నమోదైంది. -
రాత్రివేళలో రచ్చ..ఐఏఎస్,ఐపీఎస్ సస్పెండ్
రాజస్థాన్:రాజస్థాన్‌లో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన ఘర్షణల్లో ఓ ఐఏఎస్,ఐపీఎస్ అధికారితో సహా ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్ అధికారి, అజ్మీర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయినట్లు సమాచారం. స్థానిక వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికారి కొత్త ప్రాంతానికి బదిలీ అయినందున ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వెళ్లే క్రమంలో రెస్టారెంట్లో వాష్‌రూమ్ వాడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. అనంతరం ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఐపీఎస్ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రెస్టారెంట్ సిబ్బంది కూడా అధికారిపై తిరగబడిన తర్వాత ఘర్షణ మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసులు తమ సిబ్బందిపై ఘర్షణకు దిగారని రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ రిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీసు చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణనలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు. अजमेर में IAS और IPS अफसरों ने की होटल स्टाफ के साथ मा#रपीट! | Si News@BJP4India @Myogioffice @Narendramodi#Ajmer #HotelMakranaRaj #IAS #IPS #IPSSushilBishnoi #IASGiridhar #Suspended #SiNews pic.twitter.com/TKyqvRWeAJ — Since Independence (@Sinceindmedia) June 14, 2023 ఇదీ చదవండి:మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. 9మంది మృతి.. -
వ్యవసాయ రంగంలో టెక్నాలజీ హవా.. డ్రైవర్ లేని రోబో ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్!
అమెరికన్ ట్రాక్టర్ల తయారీ సంస్థ ‘జాన్ డీరె’ ఇటీవల ఎరువులు చల్లే రోబో ట్రాక్టర్‌ను రూపొందించింది. ‘ఎగ్జాక్ట్ షాట్’ పేరుతో రూపొందించిన ఎలక్ట్రిక్ రోబో ట్రాక్టర్, నేలను బట్టి ఎక్కడ ఎంత ఎరువు అవసరమో, కచ్చితంగా అంత ఎరువు మాత్రమే చల్లుతుంది. ఇందులోని అధునాతనమైన సెన్సర్లు భూసారాన్ని గుర్తించి, నేలలోని లోపాలను బట్టి ఎక్కడ ఎంత మోతాదులో ఏ ఎరువు అవసరమో అంత మేరకు మాత్రమే ఎరువును చల్లుతాయి. దీనివల్ల భూసారంలోని సమతుల్యతకు అవరోధాలు ఏర్పడకుండా ఉంటాయి. ఎరువుల అధిక మోతాదు కారణంగా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. ఇది ఎరువుల వృథాను గణనీయంగా అరికట్టగలదని నిపుణులు చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం దీనివల్ల అమెరికాలో ఏటా వేసే మొక్కజొన్న పంట సాగులోనే ఎరువుల్లో 9.3 కోట్ల గ్యాలన్ల పరిమాణంలోని ఎరువులు ఆదా కాగలవని, మిగిలిన పంటలను కలుపుకొంటే ఎరువుల వ్యయం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఇది వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించగలదని అంటున్నారు. -
మరో దిగ్గజ కంపెనీలో 30% ఉద్యోగులపై వేటు... కారణాలు తెలిస్తే షాక్ అవుతారు
-
ఆగని ఉద్యోగాల కోత! ఆ సంస్థ నుంచి మళ్ళీ 340 మంది..
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉద్యోగులపైన అలాగే ఉందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మరో కంపెనీ తాజాగా సుమారు 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. అమెరికాకు చెందిన అటానమస్ డెలివరీ రోబోట్ స్టార్టప్ న్యూరో తన క్యాపిటల్ రన్‌వేను మరింత విస్తరించడానికి 30 శాతం మంది లేదా 340 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. గత వారంలో న్యూరో కో-ఫౌండర్స్ 'డేవ్ ఫెర్గూసన్ అండ్ జియాజున్ ఝూ' మాట్లాడుతూ.. కంపెనీ సిబ్బందిని తగ్గించి వనరులను వాణిజ్య కార్యకలాపాల నుంచి రీసర్చ్ & డెవెలప్మెంట్ వైపు మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది కంపెనీ తమ మూడవ జనరేషన్ డెలివరీ రోబోట్స్ వాణిజ్య కార్యకలాపాలను పెంచడంతో పాటు వాల్యూమ్ ఉత్పత్తిని ఆలస్యం చేయడానికి తమ ప్రణాళికలను ఫాజ్ చేస్తుంది. ఈ మార్పుల వల్ల కంపెనీ మునుపటికంటే రెండు రెట్లు ఎక్కువ పని చేసే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: Apna Founder Success Story: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) గతంలో కూడా కంపెనీ అటానమస్ సిస్టం అభివృద్ధి చేసింది. దీని కోసం కస్టమ్ వెహికల్స్ కూడా రూపొందించింది. అయితే ఈ కొత్త విధానం న్యూరో ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసే అవకాశం ఉందని బలంగా భావిస్తున్నారు. వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు క్యాపిటల్ రన్‌వేను విస్తరించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడం ఇది రెండవ సారి. కంపెనీ గత ఏడాది నవంబర్ నెలలో కూడా సుమారు 20 శాతం లేదా 300 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఇప్పుడు మరో సారి ఉద్యోగాల కోతలు సుమారు 340 మంది ఉద్యోగులపైన ప్రభావం చూపుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
మామూలు రోబో కాదు.. పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది
చిటారు కొమ్మన ఉన్న పండును కోసుకు రావాలంటే, ఇకపై చెట్టెక్కాల్సిన పనిలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం దగ్గర ఉంటే, ఎంత ఎత్తయిన చెట్టు నుంచైనా ఇట్టే పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది. పెద్ద పెద్ద తోటల్లో వినియోగించుకోవడానికి అనువుగా రూపొందించిన ఈ పరికరం పేరు ‘టెవెల్ ఎఫ్ఏఆర్ ద్రోన్’. ఇది ద్రోన్ మాత్రమే కాదు, రోబో కూడా. ఫ్లయింగ్ ఆటానమస్ రోబో (ఎఫ్ఏఆర్). అమెరికాకు చెందిన ‘టెవెల్ టెక్’ స్టార్టప్ కంపెనీకి చెందిన డిజైనర్లు దీనికి రూపకల్పన చేశారు. త్వరలోనే దీని పనితీరును అమెరికా, స్పెయిన్ దేశాల్లో ఎంపిక చేసుకున్న కొన్ని తోటల్లో పరిశీలించనున్నారు. పండ్లు కోసే ఈ రోబో ద్రోన్లను పెద్దసంఖ్యలో తయారు చేసేందుకు ‘టెవెల్ టెక్’ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోంది. -
కృత్రిమ మేధలో ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏమిటి?
తెల్లనివన్నీ పాలూ కాదు... నల్లనివన్నీ నీళ్లూ కాదు! అలాగే.. స్మార్ట్ఫోన్లు మొదలుకొని ఈ కామర్స్ గోదాముల వరకూ.. అన్నిచోట్ల ఉండేది ఒకే రకమైన కృత్రిమ మేధ కూడా కాదు! ఒక్కో చోట.. ఒక్కో టెక్నాలజీ! అన్నింటిలోనూ కామన్... ఈ శతాబ్దపు టెక్నాలజీగా పేరు సంపాదించుకున్న ఈ కృత్రిమ మేధ! ఏమిటిది? ఎన్ని రకాలు? తేడాలేమిటి? కృత్రిమ మేధ అంటే..? పేరులో ఉన్నట్లే కృత్రిమమైన మేధ. అంటే.. జంతువులు, మనుషుల్లోని సహజమైన మేధ కాకుండా.. ఇదే రకమైన బుద్ధిని యంత్రాలూ ప్రదర్శించడం. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే.. మనుషుల్లా ఆలోచించడమే కాకుండా తదనుగుణంగా స్పందించే సాంకేతిక పరిజ్ఞానం అనవచ్చు. స్థూలంగా ఈ కృత్రిమ మేధలో మూడు అంశాలు ఉంటాయి. మొదటిది నేర్చుకోవడం... పసిపిల్లలు తమ పరిసరాలను పరిశీలిస్తూ ఎలాగైతే విషయాలను అర్థం చేసుకుంటారో.. కృత్రిమ మేధను అభివృద్ధి చేసే సమయంలోనూ కొన్ని ప్రాథమిక అంశాలను అందించి వాటిద్వారా కొత్త విషయాలను నేర్చుకునేలా చేస్తారు. రెండోది రీజనింగ్! తెల్లగా ఉందన్న వెంటనే అవి పాలు అని అర్థం చేసుకోకుండా.. తర్కాన్ని జోడించి విషయాలను తెలుసుకోవడం అన్నమాట. ముచ్చటగా మూడోది.. తప్పులు దిద్దుకోవడం.. నడక నేర్చుకునే క్రమంలో పిల్లలు కొన్నిసార్లు కిందపడ్డా.. బ్యాలెన్స్‌ను కాపాడుకోవడంలో చేసిన తప్పులను దిద్దుకున్నట్లే కృత్రిమ మేధ తాలూకూ సాఫ్ట్వేర్ నేర్చుకున్న అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకుంటుందన్నమాట. ట్యూరింగ్ టెస్ట్! కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో పనిచేస్తోందా? లేదా? తెలుసుకునేందుకు బ్రిటిష్ శాస్త్రవేత్త అలన్ ట్యూరింగ్ 1943లోనే ఓ పరీక్షను ప్రతిపాదించాడు. ట్యూరింగ్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. కంప్యూటర్, మనిషి సంభాషించుకుంటూండగా... న్యాయనిర్ణేత వారికి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. వాటి ద్వారా ఎవరు మనిషి ఎవరు కాదు? అన్నది తేల్చలేకపోతే... కంప్యూటర్ ట్యూరింగ్ టెస్ట్ పాసైనట్లు లెక్క. 2014లో పదమూడేళ్ల ఉక్రెయిన్ బాలుడి మాదిరిగా ఓ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ట్యూరింగ్ టెస్ట్‌లో పాల్గొంది. న్యాయనిర్ణేతలతో సంభాషణలు జరిపినప్పుడు కనీసం 33 శాతం మంది అవతలివైపు ఉన్నది మనిషేనని గట్టిగా భావించారు. ఎన్ని రకాల టెక్నాలజీలు.. రోబోటిక్స్: కృత్రిమ మేధతో పనిచేసే రోబోల డిజైనింగ్, తయారీ, అభివృద్ధి అన్నీ ఇందులో భాగం. అవసరాన్ని బట్టి వేర్వేరు పనులు చేయగల రోబోలను తయారు చేస్తారన్నమాట. ఉదాహరణకు కార్ల ఫ్యాక్టరీలో రోబోటిక్ హ్యాండ్ వంటివి అవసరమైతే.. శస్త్రచికిత్సలు చేసేందుకు సునిశితమైన కదలికలు కలిగిన రోబోలు అవసరమవుతాయి. హోటల్లో వెయిటర్‌గా, సూపర్మార్కెట్లో క్యాషియర్‌గా వ్యవహరించే రోబోలకు ఆయా పనులకు తగ్గ డిజైనింగ్, సామర్థ్యాలు అవసరమవుతాయని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. మెషీన్ లెర్నింగ్: అంకెలు, అల్గారిథమ్‌ల సాయంతో యంత్రాలు/కంప్యూటర్లు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని మెషీన్ లెర్నింగ్ అంటారు. మొదట్లో కొన్ని తప్పులు జరిగినప్పటికీ మనిషి మాదిరిగానే అనుభవంతో కచ్చితత్వం అలవడుతుంది మెషీన్ లెర్నింగ్‌లో. యంత్రం/కంప్యూటర్ నేర్చుకుంటున్న క్రమంలో మనిషి పాత్ర ఉంటే దాన్ని సూపర్వైజ్డ్ మెషీన్ లెర్నింగ్ అని, లేకపోతే అన్సూపర్వైజ్డ్ అని పిలుస్తారు. కస్టమర్ సర్వీస్ మొదలుకొని మెడికల్ డయాగ్నసిస్ వరకూ మెషీన్ లెర్నింగ్‌కు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్: మనిషి మాట్లాడే భాషను అర్థం చేసుకుని తదనుగుణంగా స్పందించేందుకు ఉద్దేశించిన కృత్రిమ మేధ విభాగం ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) టెక్నాలజీ. మీరెప్పుడైనా గ్రామర్లీని ఉపయోగించారా? ఇంగ్లిషు భాషలో మనం రాసే వాక్యాల వ్యాకరణాన్ని సరిదిద్దేందుకు పనికొస్తుందిది. ఎన్ఎల్పీ ద్వారా పనిచేస్తుంది. ఈ మెయిళ్లలో స్పామ్‌ను గుర్తించేదీ, సోషల్‌మీడియాపై పెట్టే నిఘా, కొన్ని వెబ్సైట్లలో మనతో మాట్లాడే చాట్బోట్లూ ఈ ఎన్ఎల్పీ ఆధారంగా తయారైనవే. అటానమస్ వెహికిల్స్: డ్రైవర్లు అవసరం లేని కార్ల గురించి మనం తరచూ వింటూ ఉంటాం. వాహనంలో ఏర్పాటు చేసిన పలు రకాల సెన్సర్లు, కెమెరాల ద్వారా అందే సమాచారం మొత్తాన్ని ఏ క్షణానికి ఆ క్షణం విశ్లేషించుకుంటూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఆ అటానమస్ వెహికల్స్ టెక్నాలజీలో జరిగే ప్రక్రియ. టెస్లా కొన్నేళ్ల క్రితం ఈ డ్రైవర్ల అవసరం లేని వాహనాలను అందుబాటులోకి తేగా... చట్టపరమైన సమస్యల కారణంగా వాటి వినియోగం పూర్తిస్థాయిలో జరగడం లేదు. భారత్‌లో ఇటీవల కొన్ని మోడళ్ల కార్లలో పరిమిత స్థాయిలో ఈ అటానమస్ వెహికిల్ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టారు. రొబోటిక్ ప్రాసెస్ ఆటొమేషన్: కృత్రిమ మేధ విషయంలో అతితక్కువ విలువ ఉన్న టెక్నాలజీ ఇదే కావచ్చు. పదేపదే చేయాల్సిన పనిని యంత్రాలకు లేదా సాఫ్ట్‌వేర్‌కు అప్పగించడం ఈ రొబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. లెక్కలేయడం, రికార్డుల నిర్వహణ వంటివి దీనికి ఉదాహరణలు. న్యూరల్ నెట్వర్క్: శరీరంలోని నాడులు, నాడీవ్యవస్థ మెదడు పనితీరుల ఆధారంగా యంత్రాలకు నిర్దిష్టమైన పనులు నేర్పడం, చేసేలా చేయడం కోసం ఈ న్యూరల్ నెట్‌వర్క్‌లను వాడతారు. మెదడులోని న్యూరాన్ల మధ్య సంబంధాలు ఉన్నట్లే.. కృత్రిమ మేధకు చెందిన న్యూరల్ నెట్‌వర్క్‌లో కొన్ని అల్గారిథమ్‌లను ఉపయోగిస్తారు. ఆన్లైన్ మోసాలను గుర్తించేందుకు ఎక్కువగా వాడుతూంటారు దీన్ని. స్టాక్‌మార్కెట్ తీరుతెన్నుల అంచనాకు, రిస్క్ అనాలసిస్ వంటి వాటికీ ఈ కృత్రిమ మేధ బాగా ఉపయోగపడుతుంది. మెషీన్ విజన్.. యంత్రాలకు కళ్లు తీసుకొస్తే అది మెషీన్ విజన్. రంగు చూసి పండా? కాయా? అన్నది తెలుసుకున్నట్లే యంత్రం కూడా తన దృష్టితో కొన్ని విషయాలను అర్థం చేసుకునేలా చేస్తారు దీంట్లో. బిస్కెట్ల ఫ్యాక్టరీలో దీన్ని వాడారనుకోండి.. విరిగిపోయిన వాటిని ఎక్కడికక్కడ గుర్తించి అవి ప్యాక్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే పండ్లు, కాయగూరల్లో పనికిరాని వాటిని వేరు చేసేందుకూ మెషీన్ విజన్ ఉపయోగపడుతుంది. బార్కోడ్ల సమాచారాన్ని గుర్తించేందుకూ ఇదే టెక్నాలజీని వాడతారు. – సాక్షి, హైదరాబాద్ -
మరో ప్రయోగానికి ఇంటర్నెట్ దిగ్గజం శ్రీకారం
బీజింగ్ : చైనా ఇంటర్నెట్ దిగ్గజం ‘బైదు’ మరో నూతన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. డ్రైవర్ రహిత, ఎలక్ట్రిక్ బస్సులను రూపొందించేందుకు చైనాలో బస్సుల తయారీకి పేరు గాంచిన ‘కింగ్‌లాంగ్’ కంపెనీతో జట్టు కట్టింది. ‘అపోలాంగ్’ పేరుతో కింగ్‌లాంగ్ తయారు చేయనున్న ఈ డ్రైవర్ రహిత ఎలాక్ట్రానిక్ బస్సుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు బైదు తెలిపింది. మనం నిత్యం చూసే సాధారణ బస్సులకు భిన్నంగా ఈ డ్రైవర్ రహిత బస్సులు ఉండనున్నట్లు సమాచారం. ఈ డ్రైవర్ రహిత బస్సుల్లో స్టీరింగ్ వీల్, పెడల్స్, డ్రైవర్ ఉండరు. ఇవేవి లేకుండా కేవలం అపోలో 3.0 అటానమస్ డ్రైవింగ్ ఒపెన్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ సాయంతో ఈ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి. తొలుత ఈ బస్సులు విమానాశ్రాయాలు, సందర్శనీయ ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వాణిజ్యపరంగా పూర్తి తొలి అటానమస్ / డ్రైవర్ రహిత బస్సులుగా అపోలాంగ్ బస్సులు గుర్తింపు పొందనున్నాయి. తొలుత వీటిని బీజింగ్, షెన్జెన్, జియోగన్, వూహన్, పింగనస్ నగర రవాణా సంస్థల్లో వినియోగించనున్నట్లు సమాచారం. ఈ బస్సుల గురించి బైదు చైర్మన్, సీఈవో రాబిన్ లి బైదు బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ‘క్రియేట్ 2018’ కన్సల్టింగ్ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాబిన్ లి బైదు మాట్లాడుతూ.. ‘డ్రైవర్ రహిత ప్రయాణ వ్యాపారీకరణకు తొలి అడుగు 2018లోనే పడింది. పెద్ద మొత్తంలో తయారయ్యే అపోలాంగ్ బస్సుల వల్ల చైనా గొప్ప ప్రగతి సాధిస్తుంద’ని తెలిపారు. అంతేకాక తాము అందించే సాంకేతిక పరిజ్ఞానం కేవలం బస్సులకే పరిమితం కాదని తెలిపారు. ప్రస్తుతం బైదు అందించే ఒపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ కోసం ఇప్పటికే దాదాపు 116 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో ‘జాగ్వర్ లాండ్ రోవర్’, ‘బీవైడీ’ ప్రధానమైనవి. ‘బీవైడీ’ చైనాలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ. త్వరలోనే బీవైడీ ‘ఎల్ 3’ అటానమస్ వాహనాల తయారీని ప్రారంభించనుంది. ప్రస్తుతం బైదు తయారీ చేయనున్న అటానమస్ బస్సులు కేవలం చైనా రోడ్లకు మాత్రమే కాక వేరే దేశాలకు కూడా విస్తరింపజేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో బైదు దృష్టి సారిస్తున్న మొట్టమొదటి దేశం జపాన్. ఇప్పటికే జపాన్‌లో అటానమస్ వాహనాల తయారు చేస్తున్న, జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ అనుబంధ సంస్థ ‘ఎస్బీ డ్రైవ్’తో బైదు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో 2019 నాటికి అపోలాంగ్ అటానమస్ మిని బస్పులను జపాన్ రోడ్ల మీదకు తీసుకు వచ్చేందుకు కింగ్‌లాంగ్, బైదు కంపెనీలు కృషి చేస్తున్నాయి. నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్లు రోడ్ల మీదకు రానున్నట్టు ఇటీవల ఓ సర్వే తెలిపింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో చైనా ముందు స్థానంలో ఉంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాల్లో సగం చైనాలోనే అమ్ముడయ్యాయి. తరువాత స్థానంలో అమెరికా ఉంది. అతి త్వరలోనే ఎలక్ట్రిక్, అటానమస్ వాహనాలు వల్ల ప్రపంచ నగరాల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నట్లు సమాచారం. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్, బోస్టన్ కన్పులేటింగ్ నిర్వహించిన సర్వే ప్రకారం 60 శాతం ప్రజలు అటానమస్ వాహనాల వినియోగం పట్ల సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాక రైడ్ షేరింగ్ సర్వీస్ కూడా చాలా వేగంగా పెరగనున్నట్లు ఈ సర్వే తెలిపింది. -
అమెరికా వర్సిటీ పోటీలో కౌశిక్ వర్మ ఫస్టు
మామిడికుదురు (పి.గన్నవరం): అమెరికాలోని ఏఆర్ఎం యూనివర్సిటీ, టీవీఎస్ కంపెనీ ఇటీవల సంయుక్తంగా నిర్వహించిన ఏఆర్ఎం డిజైన్ ఛాలెంజ్ పోటీలో పాశర్లపూడికి చెందిన రుద్రరాజు కౌశిక్ వర్మ తయారు చేసిన అటానమస్ వాహనానికి మొదటి బహుమతి లభించింది. ఇతడి తండ్రి, టీవీ నటుడు రుద్రరాజు ప్రసాదరాజు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. చెన్నై శకుంతల అమ్మాళ్ (ఎస్ఏ) ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న కౌషిక్ వర్మ సొంత అలోచనతో అటానమస్ వాహనం రూపొందించాడని చెప్పారు. డ్రైవర్ లేకుండా నిర్దే శించిన ప్రాంతానికి చేరుకోవడం ఈ వాహనం ప్రత్యేకత. మూడు స్టేజిల్లో సెన్సార్స్ సహాయంతో ఈ వాహనం నడుస్తుందన్నారు. సోలార్ ఎనర్జీతో కూడా పని చేయడం దీనిలో ఉన్న మరో ప్రత్యేకత అన్నారు. ఈ ప్రయోగం అనుకున్న విధంగా పనిచేసి నిర్వాహకుల ప్రశంసలు అందుకుందని చెప్పారు. దీంతో అతడికి అవుట్ స్టాండింగ్ వ్యక్తిగత ప్రతిభ అవార్డు రూపేణా రూ.25 వేల ప్రోత్సాహకం, షీల్డు అందజేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 200 టీములు ఈ పోటీల్లో తలపడగా తుది పోరులో 17 టీములు నిలిచాయన్నారు. వీటిలో కౌశిక్ వర్మ వాహనం విజేతగా నిలిచిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన అతడిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కౌశిక్ సొంత ఊరు అల్లవరం మండలం గోడిపాలెం కాగా పాశర్లపూడిలోని తాతయ్య ఇంట్లో ఉంటాడు. -
మెడికల్ కాలేజీలకు అటానమస్: లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్: రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. వీటితోపాటు అధునాతన పరికరాలు సిటీ స్కానింగ్, డయాలసిస్ సెంటర్, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈ హెల్త్‌సెంటర్, పేయింగ్ రూమ్స్, పీడియాట్రిక్ ఐసీయూ, టెలీమెడిసిన్ సెంటర్లను మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో సింగిల్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో 10 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు అటానమస్
ఉత్తర్వులు జారీ చేసిన కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ అమలుకు త్వరలోనే 20 కమిటీల ఏర్పాటు కేయూ క్యాంపస్ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి ఆరేళ్ల పాటు స్వయం ప్రతిపత్తి(అటానమస్ స్టేటస్) హోదా కల్పిస్తూ కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితమే ఆర్ట్స్ కళాశాలకు యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి లభించగా కేయూ స్టాండింగ్ కమిటీ, సెనేట్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఈ విద్యాసంవత్సరం(2016) నుంచి 2022వ సంవత్సరం వరకు అటానమస్ కాలేజీ కొనసాగేలా కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ ఎప్పుడో పూర్తికావాల్సి ఉన్నా కొంత ఆలస్యమైంది. కాగా, అటానమస్ అమలు కోసం కళాశాలకు గవర్నింగ్ బాడీ, అకడమిక్ కమిటీ, బోర్డు ఆఫ్ స్టడీస్ కమిటీ, ఫైనాన్సియల్ కమిటీలు నియమించాల్సి ఉంటుంది. అలాగే, ప్రతీ విభాగానికి విభాగాధిపతులు, బోర్డు స్టడీస్ చైర్మన్లనే కాకుండా స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీలు తదితర ఇరవై కమిటీలను ఏర్పాటుచేయాలి. ఈ ప్రక్రియను 16వ తేదీ నుంచి చేపట్టనున్నారు. 89 వసంతాలు పూర్తి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హన్మకొండ సుబేదారిలో 1927 జూన్‌లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ కళాశాల ఏర్పడి 89 వసంతాలు పూర్తికాగా, వచ్చే ఏడాది జూన్‌తో 90వ సంవత్సరంలోకి అడుగిడనుంది. ఇప్పటికే న్యాక్ Sఏ గ్రేడ్ కలిగి ఉన్న ఈ కళాశాలలో బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీతో పాటు వివిధ పీజీ కోర్సులు కలిపి 24 కోర్సులు కొనసాగుతున్నాయి. అన్ని కోర్సుల్లోనూ అడ్మిషన్లు మెరుగుగానే ఉండగా 4,600 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. 23 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 52మంది కాంట్రాక్చువల్ లెక్చరర్లు, 65మంది పార్ట్‌టైం అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తుండగా 40మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. అయితే, సరిపడా రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో సమస్యగా మారింది. అయితే, కాంట్రాక్చువల్, పార్ట్‌టైం అధ్యాపకుల్లో ఎంఫిల్, పీహెచ్డీ కలిగిన వారు ఉండడంతో అందరూ చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే ఆర్ట్స్ కలాశాలకు అటానమస్ హోదా దక్కినందుకు ఫలితం ఉంటుంది. స్వయం ప్రతిపత్తితో ప్రయోజనాలివీ.. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి స్వయం ప్రతిపత్తి దక్కిన నేపథ్యంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రస్తుతం ఉన్న కోర్సులతో పాటు ఇంకా పలు ఉపాధి, తదితర కోర్సులు ఏర్పాటుచేసుకోవడమే కాకుండా సిలబస్ రూపొందించుకోవచ్చు. ఏటా యూజీసీ నుంచి రూ.22లక్షల నిధులతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలకు ప్రత్యేక నిధులు రానున్నాయి. ప్రతీ విభాగంలోని అధ్యాపకులకు రీసెర్చ్ ప్రాజెక్టుల కింద నిధులు రానున్నాయి. ప్రశ్నాపత్రాల రూపకల్పన, మూల్యాంకనం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలి. అయితే, మార్కుల మెమోలు కేయూ నుంచి జారీ చేయనుండగా వాటిపై కేయూతో పాటు అటానమస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అని ముద్రిస్తారు. అటానమస్ హోదా దక్కడం వల్ల అకడమిక్ పరంగా పూర్తిస్వేచ్ఛ ఉన్నప్పటికీ టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు యూనివర్సిటీ నుంచే ఇస్తారు. ఆరేళ్ల గడువు పూర్తయ్యాక మళ్లీ రీ అటానమస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అమలుకు చర్యలు రామానుజరావు, ప్రిన్సిపాల్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి యూనివర్సిటీ నుంచి అటానమస్ హోదాకు అనుమతి లభించింది. ఈ మేరకు అమలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నాం. త్వరలోనే అధ్యాపకులు, నాన్ టీచింగ్ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటుచేయడంతో పాటు అవసరమైన 20 కమిటీలను నియమించనున్నాం. యూజీసీ, రూసా నుంచి నిధులు రానుండడంతో కళాశాల అభివృద్ధి చెందే అవకాశముంది. -
ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి
వేంపల్లె: వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ, కృష్ణా జిల్లాలోని నూజివీడు, అదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసరలో ఉన్న మూడు ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి(అటానమీ) కల్పించారు. ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రిపుల్ ఐటీలో పనిచేసే సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు, పరిపాలన వారే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. పర్యవేక్షణ మాత్రం వర్సిటీ పరిధిలో ఉంటుంది. విద్యార్థుల పరీక్ష విధానానికి వస్తే... ఆన్లైన్లో మూడు ట్రిపుల్ ఐటీల విద్యార్థులకు ఒకేసారి జరిగి ఫలితాలూ అలాగే విడుదలయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఆ ట్రిపుల్ఐటీ పరిధిలో పరీక్ష విధానం, ఫలితాల విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి.