ముంబై: దేశీయ మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ జర్మన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ సేవల సంస్థ ఎసాప్ గ్రూప్‌లో 100 శాతం ఈక్విటీ వాటాను (279.72 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. హెచ్‌సిఎల్‌టెక్ యూకే అనుబంధ సంస్థ ద్వారా జరిగే ఈ ఒప్పందం సెప్టెంబర్ 2023 నాటికి ముగియనుంది. ఇది ఇప్పుడు రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఉంటుందని సంస్థ గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
అటానమస్ డ్రైవింగ్, ఇ-మొబిలిటీ, కనెక్టివిటీ రంగాలలో భవిష్యత్తు-ఆధారిత ఆటోమోటివ్ టెక్నాలజీలో తమ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంలో ఈ డీల్ తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. అలాగేఐరోపా, అమెరికా, జపాన్‌లోని కీలకమైన ఆటోమోటివ్ మార్కెట్స్‌లో విస్తరణకు ఈ కొనుగోలు సాయ పడుతుందని పేర్కొంది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్:లైసెన్స్ ఉండాల్సిందే!)
హెచ్‌సీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికానికి(క్యూ1) ఆసక్తికర ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం వార్షికంగా 7 శాతం బలపడి రూ. 3,534 కోట్లను తాకింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 3,324 కోట్లు ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన రూ. 3,983 కోట్లతో పోలిస్తే లాభాలు 11 శాతం క్షీణించాయి.
ఇక మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 26,296 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 23,464 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండు చెల్లింపునకు ఈ నెల 20 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది.
ఇతర విశేషాలు
కొత్తగా 1,597 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి
క్యూ1లో నికరంగా 2,506 మంది ఉద్యోగులు తగ్గారు.
జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,438కు చేరింది.
ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 16.3 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment