driving system
-
హెచ్‌సీఎల్ చేతికి జర్మన్ కంపెనీ: 279 మిలియన్ డాలర్ల డీల్
ముంబై: దేశీయ మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ జర్మన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ సేవల సంస్థ ఎసాప్ గ్రూప్‌లో 100 శాతం ఈక్విటీ వాటాను (279.72 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. హెచ్‌సిఎల్‌టెక్ యూకే అనుబంధ సంస్థ ద్వారా జరిగే ఈ ఒప్పందం సెప్టెంబర్ 2023 నాటికి ముగియనుంది. ఇది ఇప్పుడు రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఉంటుందని సంస్థ గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అటానమస్ డ్రైవింగ్, ఇ-మొబిలిటీ, కనెక్టివిటీ రంగాలలో భవిష్యత్తు-ఆధారిత ఆటోమోటివ్ టెక్నాలజీలో తమ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంలో ఈ డీల్ తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. అలాగేఐరోపా, అమెరికా, జపాన్‌లోని కీలకమైన ఆటోమోటివ్ మార్కెట్స్‌లో విస్తరణకు ఈ కొనుగోలు సాయ పడుతుందని పేర్కొంది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్:లైసెన్స్ ఉండాల్సిందే!) హెచ్‌సీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికానికి(క్యూ1) ఆసక్తికర ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం వార్షికంగా 7 శాతం బలపడి రూ. 3,534 కోట్లను తాకింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 3,324 కోట్లు ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన రూ. 3,983 కోట్లతో పోలిస్తే లాభాలు 11 శాతం క్షీణించాయి. ఇక మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 26,296 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 23,464 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండు చెల్లింపునకు ఈ నెల 20 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఇతర విశేషాలు కొత్తగా 1,597 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి క్యూ1లో నికరంగా 2,506 మంది ఉద్యోగులు తగ్గారు. జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,438కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 16.3 శాతంగా నమోదైంది. -
బతుకు బండి: బామ్మ స్టీరింగ్... బంగారు డ్రైవింగ్
భర్త చనిపోయిన దుఃఖం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న రాధామణి, బతుకు మార్గంపై దృష్టి పెట్టింది. వ్యాపారం చేసిన అనుభవం లేదు. ఆర్థిక స్థోమత అంతకంటే లేదు. తనకు తెలిసిన ఏకైక విద్య డ్రైవింగ్. ముప్పై సంవత్సరాల వయసులో భర్త లలాన్ దగ్గర స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంది రాధామణి. మొదట్లో ఎంత భయమేసిందో! అయితే ఆ భయం కొన్ని రోజులే. ఆ తరువాత భయం స్థానంలో ఇష్టం ఏర్పడింది. స్కూటర్ డ్రైవింగ్‌ను పర్ఫెక్ట్గా నేర్చుకుంది. కేరళలోని తొప్పుంపేడి పట్టణానికి చెందిన రాధ స్కూటర్ డ్రైవింగ్ దగ్గర మాత్రమే ఆగిపోలేదు. కారు, బస్, లారీ, ట్రాక్టర్, ఆటో–రిక్షా, క్రెన్, రోడ్ రోలర్ అండ్ జేసిబి, కంటేనర్ ట్రక్...ఇలా 11 వాహనాలను నడపడంలో లైసెన్స్ తీసుకుంది. కేరళలో హెవీ వెహికిల్ లైసెన్స్ తీసుకున్న తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది రాధామణి. కొన్ని సంవత్సరాల క్రితం... తొప్పుంపేడి నుంచి చెర్తాలం వరకు రాధామణి బస్సు నడిపినప్పుడు, ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చి చూశారు. ‘నా దృష్టిలో ఒక కొత్త వాహనం నేర్చుకోవడం అంటే, కొత్త బడిలో చేరడం లాంటిది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. దీనికి ఏకైక కారణం డ్రైవింగ్ అని చెబుతుంటాను’ అంటుంది 71 సంవత్సరాల రాధామణి. ఆమెను అందరూ ‘మణియమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. తన పిల్లలతో కలిసి తొప్పుంపేడిలో మొదలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్‌కు అనూహ్యమైన ఆదరణ ఏర్పడింది. కాలేజి స్టూడెంట్ రీతిక ఇలా అంటుంది... ‘గతంలో డ్రైవింగ్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కాలేజీలో చేరిన తరువాత మాత్రం బండి నేర్చుకోవడం తప్పనిసరి అనిపించింది. వెంటనే మణియమ్మ డ్రైవింగ్ స్కూల్ గుర్తొచ్చి చేరిపోయాను. అమ్మాయిలు ఇక్కడ సేఫ్టీగా ఫీలవుతారు. మణియమ్మ దగ్గరికి వెళితే డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపించదు. బామ్మ దగ్గరకు వెళ్లినట్లు అనిపిస్తుంది. చాలా సరదాగా ఆమె డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఇప్పుడు నేను టూవీలర్స్ మాత్రమే కాదు కారు కూడా నడుపుతున్నాను’ మణియమ్మ భర్త కోచిలో ‘ఏ టు జెడ్’ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవాడు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్కూల్ మూతపడింది. అయితే ఇప్పుడు తొప్పుంపేడిలోని ‘డ్రైవింగ్ స్కూల్’లో అడుగడుగునా భర్తను చూసుకుంటుంది మణియమ్మ! -
స్ఫూర్తి..:వెటకారం చేసిన నోళ్లే... వేనోళ్ల పొగిడాయి!
‘క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్స్’ అని పిలుచుకునే సిమ్లా(హిమాచల్‌ప్రదేశ్)లో డ్రైవింగ్ అనేది అంత సులభమేమీ కాదు. అలాంటి చోట ‘సూపర్ డ్రైవర్’గా ప్రశంసలు అందుకుంటోంది మీనాక్షి నేగి. కిన్నార్ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షికి ‘డ్రైవింగ్’ను వృత్తిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రిలా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంది కానీ కుదరలేదు. తమ ఇద్దరు పిల్లలను బైక్ మీద స్కూలుకు తీసుకెళుతుండేది మీనాక్షి. అప్పుడప్పుడూ ఇరుగింటి, పొరుగింటి వారు కూడా తమ పిల్లల్ని బైక్‌పై బడికి తీసుకెళ్లడానికి మీనాక్షి సహాయం తీసుకునేవారు. ఆమె డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకునేవారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే, డ్రైవింగ్‌నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు? అనుకుంది మీనాక్షి. తన ఆలోచనకు ఎవరూ‘యస్’ చెప్పలేదు. ఇక వెటకారాలు సరేసరి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ట్యాక్సీ (కార్) కొనుగోలు చేసింది. వెటకారాలు మరింత ఎక్కువయ్యాయి. భర్త, అత్తామామలను ఒప్పించడం చాలా కష్టం అయింది. ‘ఏనుగును మేపడం ఎంతో ఇది అంతే’ అన్నారు. సరిగ్గా అదే సమయంలో కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. బండి తెల్లముఖం వేసింది. వాయిదాలు కట్టడం మీనాక్షికి కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెలో ధైర్యం సడలలేదు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా!’ అనుకుంది. అదే నిజమైంది. లాక్డౌన్ ఎత్తేశారు. మెల్లగా బండి వేగం పుంజుకుంది. ‘డ్రైవింగ్ వృత్తిలో మగవాళ్లు మాత్రమే ఉంటారు... అని చాలామంది నమ్మే సమాజంలో ఉన్నాం. మహిళలు నడిపే వాహనాల్లో ప్రయాణించడానికి తటపటాయిస్తుంటారు. అలాంటి వారికి నా డ్రైవింగ్‌తోనే సమాధానం చెప్పాను. వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది, భర్త,అత్తమామలు కూడా మెచ్చుకోవడం మరో ఆనందం’ అని చెబుతుంది నలభై రెండు సంవత్సరాల మీనాక్షి. హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా ట్యాక్సీ నడుపుతుంది మీనాక్షి. అయితే, ప్రయాణికుల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటిస్తోంది. ఫ్యామిలీలకు ప్రాధాన్యత ఇస్తుంది. మీనాక్షి ఇప్పుడు పేదమహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పిస్తుంది. ‘ఉపాధి అనేది తరువాత విషయం. డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్ విజయాలకు ఇది పునాది’ అంటుంది మీనాక్షి. మీనాక్షి నేగి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? సిమ్లాలో ఫస్ట్ ఉమెన్ ట్యాక్సీడ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేయాలనేది ఆమె కల. యూనియన్ సరే, అంతమంది మహిళా ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కడి నుంచి వస్తారు? అనే సందేహం ఉంటే, మీనాక్షి నేగి నుంచి స్ఫూర్తి పొందిన మహిళలను పలకరించండి చాలు. నేగి కల సాకారం కావడానికి ఎంతోకాలం పట్టదని తెలుసుకోవడానికి! -
జూమ్ మీటింగ్‌లో అడ్డంగా దొరికిన యూఎస్ సెనేటర్...! కానీ..
వాషింగ్టన్: కరోనా నేపథ్యంలో విద్యార్థులు, అధికారులు, ఉద్యోగస్తులు పూర్తిగా జూమ్ మీటింగ్లకే పరిమితమయ్యారు. జూమ్‌లోనే అన్నీ కార్యాకలాపాలు జరుగుతున్నాయి. కాగా జూమ్ మీటింగ్‌లలో అప్పుడప్పుడు కొన్ని తమాషా సంఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా జూమ్ మీటింగ్‌లో ఏకంగా యూఎస్ సెనేటర్ విషయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అమెరికాలోని ఓహియో స్టేట్‌లో ప్రతిష్టాత్మక డ్రైవింగ్ డిస్ట్రక్షన్ నిషేధ బిల్లుపై జరిగిన చర్చ సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓహియో రిపబ్లికన్ సెనేటర్ ఆండ్రూ బ్రెన్నర్ డ్రైవింగ్ చేస్తూ జూమ్ సమావేశానికి హజరయ్యాడు. అతడు డ్రైవింగ్ చేస్తున్నట్లు కన్పించకుండా ఉండడం కోసం తన బ్యాక్ గ్రాండ్లో ఇంట్లో ఉన్నట్లు స్క్రీన్‌ను వాడాడు. కానీ అతడు వేసుకున్న సీట్ బెల్ట్‌తో డైవింగ్ చేస్తున్నట్లుగా సమావేశంలో ఉన్నవారికి తెలిసిపోయింది. సెనేటర్ ఈ విధంగా చేయడానికి ముఖ్యకారణం .. డిస్ట్రాక్షన్ డ్రైవింగ్‌ను నిషేధించాలని ఓహియో స్టేట్ అసెంబ్లీ ఒక కొత్త బిల్లును తీసుకొని వచ్చింది. ఓహియో స్టేట్ అసెంబ్లీ లో బిల్లుపై చర్చ జరపుతూ సెనేటర్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తన నిరసనను తెలిపాడు. తన చర్యలను సెనేటర్ తోసిపుచ్చాడు. కాగా తను జూమ్ మీటింగ్‌లో శ్రద్ధగా వింటూ, డ్రైవింగ్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. కాగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు, ఇతరత్రా చర్యలు చేసేటప్పుడు డ్రైవర్ తన ఏకాగ్రతను కొల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారని ఈ బిల్లును ఓహియో స్టేట్ సెనేట్‌లో ప్రవేశపెట్టారు. View this post on Instagram A post shared by The Guardian (@guardian) చదవండి: వెనక్కు తగ్గిన ఆస్ట్రేలియా.. వారి ప్రయాణానికి ఓకే -
నడుము నొప్పి రాకుండా ఉండాలంటే
కొంతమందికి కార్ డ్రైవింగ్ నిత్యకృత్యం. వాళ్ల బిజినెస్ పనులూ, వాళ్ల రోజువారీ వ్యవహారాలూ అన్నీ కార్‌తోనే ముడిపడి ఉంటాయి. అయితే అలా కారు డ్రైవ్ చేసేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. నడుముపై ప్రభావం పడకుండానూ... నొప్పి రాకుండానూ ఉండాలంటే... కారు డ్రైవింగ్ చేసే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. అవి... ►మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లు పొడవుగా ఉన్నవారు సీట్‌ను మరీ ముందుకు ఉంచకుండా తగినంత దూరంలో ఫిక్స్ చేసుకోవాలి. ►అలాగే మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. ►మీ సీట్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. ►మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. ►మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి. ►సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. ►అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి. ►అన్నిటికంటే ముఖ్యంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే కాదు... మరెన్నో విధాలుగా మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. -
కాశ్మీర్లో మహిళా కార్ ర్యాలీ
జమ్మూ కశ్మీర్: కశ్మీర్ మహిళా డ్రైవర్లు మొదటిసారి ఈ ఏడాది అక్టోబర్ 3న కారు ర్యాలీని నిర్వహించారు. ‘మేము ఇళ్ళు, కార్యాలయాలు సమర్థవంతంగా నడపగలిగినప్పుడు వాహనాలను నడపలేమా?’ అని ప్రశ్నిస్తున్నారు. మహిళా డ్రైవర్లకు సంబంధించిన అపోహలను తొలగించడానికి శ్రీనగర్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఒక ఎన్జీఓ మహిళా కార్ ర్యాలీని నిర్వహించింది. మహిళా డ్రైవర్లను గౌరవించటానికి వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ ర్యాలీ జరుగుతోందని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న షేక్ సబా అన్నారు. ‘ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం మహిళలు ఉత్తమ డ్రైవర్లు కాదనే అపోహను తొలగించడమే. ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ షర్మీల్ మాట్లాడుతూ ‘మహిళా డ్రైవింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఈ ర్యాలీలు క్రమం తప్పకుండా జరగాలి. చదవండి: శ్రీనగర్ సీఆర్పీఎఫ్ ఐజీగా చారు సిన్హా నియామకం ఈ కార్యక్రమం మహిళా డ్రైవర్లను ప్రోత్సహిస్తుంది. ఇది మహిళా సాధికారతకు మూలం. ఇక్కడ ఇలాంటి ర్యాలీ జరగడం ఇదే మొదటిసారి’ అని ఆమె అన్నారు. కార్ ర్యాలీ నిర్వాహకుడు సయ్యద్ సిబ్బైన్ ఖాద్రి మాట్లాడుతూ ‘పురుష డ్రైవర్ల కంటే మహిళా డ్రైవర్లు తక్కువ ప్రమాదాలకు పాల్పడుతున్నారు. పురుషులతో పోల్చితే జాగ్రత్తలు తీసుకోవడంలో మహిళలే ముందుంటారు. మహిళా డ్రైవర్లను ప్రోత్సహించడానికే ఈ ర్యాలీ చేపట్టాం’ అని ఖాద్రీ చెప్పారు. -
సౌదీ మహిళకు చిరు స్వేచ్ఛ
మహిళలను రకరకాల నిషేధాల మాటున అణచి ఉంచుతున్న సౌదీ అరేబియా ప్రభుత్వం తన వైఖరిని కాస్త సడలించుకుంది. వారు వాహనాలు నడపటంపై దశాబ్దాలుగా అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఆదివారం వేకువజామున లాంఛనంగా నిషేధం రద్దయిన వెంటనే అనేకమంది మహిళలు కార్లు నడుపుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఆకాశాన్నంటే సౌధాలు, వెడల్పాటి రహదార్లు, భారీ షాపింగ్ మాల్స్ చూస్తే అది అష్టయిశ్వర్యాలతో తులతూగే దేశమనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ప్రపంచ చమురు నిల్వల్లో 18 శాతం అక్కడే కేంద్రీకరించి ఉన్నాయి. ఆ విషయంలో ప్రపంచంలోనే సౌదీ అరేబియా ద్వితీయ స్థానంలో ఉంది. సహజవాయు నిల్వల్లో దానిది ఆరో స్థానం. ఆ పెట్రో డాలర్లు తీసుకొచ్చిన వైభోగం అడుగడుగునా అక్కడ కనబడుతుంది. సౌదీని అధికాదాయ దేశంగా ప్రపంచబ్యాంకు పరిగణిస్తోంది. మానవాభివృద్ధి సూచికలోనూ అదెప్పుడూ ముందుంటుంది. కానీ స్త్రీ, పురుష సమానత్వం విష యంలో ఆ దేశానిది అథమ స్థానం. లింగవివక్ష అధికంగా ఉన్న దేశాల్లో సౌదీ అరేబియాది ఏడో స్థానం. 1932లో ఒక దేశంగా ఆవిర్భవించినప్పటినుంచి రాచరిక వ్యవస్థ, ఒకే కుటుంబపాలన అక్కడ సాగుతోంది. పేరుకు సలహాసంప్రదింపుల అసెంబ్లీ ఒకటున్నా, పాలన కోసం మంత్రివర్గం ఉన్నా రాజుగారు తలచిందే చట్టం. దాయాది కుటుంబసభ్యులు పరస్పర సమన్వయం చేసుకుని, మత నాయకులను కూడా కలుపుకొని వారసత్వ అధికారాన్ని అనుభవిస్తున్నారు. 2015లో రాజుగా వచ్చిన సల్మాన్ అబ్దుల్ అజీజ్ నిరుడు యువరాజు బిన్ సల్మాన్‌ను వారసుడిగా ప్రకటించారు. అప్పటినుంచీ ఆయన ఏలుబడే నడుస్తోంది. దాదాపు మూడున్నర కోట్లమంది దేశ జనాభాలో కోటిమంది విదేశీ పౌరులు. మహిళలెప్పుడూ ద్వితీయశ్రేణి పౌరులే. తండ్రి, సోదరుడు, భర్త తోడు లేకుండా ఒంటరిగా వారు ఏ అధికారిక పనులూ చక్కబెట్టడానికి వీల్లేదు. ఉద్యోగం చేయాలన్నా, ఊరు విడిచి ఎక్కడికైనా వెళ్లాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా ఇంట్లోని మగవాళ్ల అనుమతి ఉండాల్సిందే. మహిళల హక్కుల కోసం మాట్లాడినా, ఉద్యమించినా అలాంటివారిని ‘రాజ్యానికి శత్రువులు’గా పరిగణించడం, ఖైదు చేయటం రివాజు. మహిళా ఉద్యమకారులు అరెస్టయినప్పుడల్లా వారిని పొరుగునున్న కతార్ దేశ ఏజెంట్లుగా, రాజరిక శత్రువులతో చేతులు కలిపినవారిగా చిత్రీకరిస్తూ పత్రికల పతాకశీర్షికల్లో కథ నాలు వెలువడతాయి. 1990లో కొందరు మహిళలు తామూ డ్రైవింగ్ చేయడానికి అర్హులమేనంటూ రోడ్లపైకి కార్లు తీసుకొచ్చినప్పుడు వెనువెంటనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. 2011లో ‘అరబ్ విప్లవం’ ప్రభావంతో మళ్లీ సౌదీలో మహిళలు ఉద్యమించారు. అలాంటిచోట నిరుడు యువరాజు బిన్ సల్మాన్ సౌదీ విజన్–2030 పేరిట డాక్యుమెంట్ విడు దల చేసి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని భావిస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి అంతకు రెండేళ్లముందు మహిళల వస్త్రధారణ విషయంలో ఉన్న కఠిన నిబంధనలను స్వల్పంగా తొలగించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయడానికి, అభ్యర్థులుగా నిలిచేందుకు అవకాశమిచ్చారు. 2030కల్లా 30 శాతంమంది మహిళలకు ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని విజన్ డాక్యుమెంటు నిర్దేశిస్తోంది. మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని నిరుడు సెప్టెంబర్‌లో తొలిసారి ప్రకటించినప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ తగిన నిబంధనలు రూపొం దించాక మాత్రమే అది అమల్లోకొస్తుందని చెప్పినప్పుడు మహిళా ఉద్యమకారులు అంగీకరించలేదు. తక్షణమే నిషేధం తొలగించాలని డిమాండ్ చేశారు. కొన్ని వారాల కిందట మహిళలు మరోసారి ఉద్య మించి కార్లు నడిపితే వారిని అరెస్టుచేశారు. అందువల్లే మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని నిజంగా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న సందేహాలు అందరిలోనూ తలెత్తాయి. ఎలా గైతేనేం ఎట్టకేలకు నిషేధం తొలగింది. అందుకు యువరాజు ‘విశాల దృక్పథమే’ కారణమని అక్కడి మీడియా కొనియాడుతోంది. కానీ ఈ హక్కు కోసం ఉద్యమించిన 17మందిలో ఇంకా ముగ్గురు జైళ్లలో మగ్గుతున్నారు. వారిపై ఉన్న దేశద్రోహం ఆరోపణలు రుజువైతే ఇరవైయ్యేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. యువరాజు ప్రవేశపెట్టిన ఈ చిన్న సంస్కరణ సౌదీ ఛాందసవాద సమాజంలో ఏమేరకు మార్పు తీసుకొస్తుందన్నది చెప్పలేం. మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధం తొలగింపును వ్యతిరేకిస్తూ పక్షం రోజులక్రితం మతాధిపతుల ప్రోత్సాహంతో కొందరు రోడ్లపైకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉంటే బహుశా ఈ సంస్కరణ ఆలోచనే యువరాజుకు వచ్చేది కాదేమో! ఉచిత ఇంటి సదుపాయం, తగిన అర్హతలుంటే ఉన్నతోద్యోగం, రాజకుటుంబీకులు సిఫార్సుతో సులభంగా ఉద్యోగం, సుదీర్ఘ మైన సెలవు దినాలు, దాదాపు అన్నిటికీ సబ్సిడీ సదుపాయాలు ఉండే సౌదీలో నాలుగేళ్లక్రితం చమురు ధరలు పతనం కావడం మొదలయ్యాక కష్టకాలం మొదలైంది. సంక్షేమ పథకాలకు పరిమితులు విధించడం ప్రారంభించారు. 2015 మార్చిలో యెమెన్‌పై కత్తిగట్టి మొదలెట్టిన యుద్ధం అంతూ దరీ లేకుండా కొనసాగుతూ సౌదీ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా తీసుకెళ్తోంది. దేశంలోని చమురు బావులన్నీ నిండుకుంటే పరిస్థితేమిటన్న ఆలోచన అక్కడ మొదలైంది. ఇప్పుడున్న కోటి 20 లక్షల ఉద్యోగాల్లో సౌదీ పౌరుల వాటా సగం కన్నా తక్కువ. 70 లక్షల ఉద్యోగాలు వలసదారుల చేతుల్లో ఉన్నాయి. ఉద్యోగాలు చేసే సౌదీ మహిళల సంఖ్య మరింత తక్కువ. దీన్నంతటినీ మార్చ కపోతే పర్యవసానాలు భయంకరంగా ఉంటాయని, దేశం పెను సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని సర్కారుకు జ్ఞానోదయమైంది. కారణమేదైనా మహిళలు వాహనాలు నడపటంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం మెచ్చదగిందే. దీనికి కొనసాగింపుగా ఇతర సంస్కరణలు కూడా సత్వరం అమల్లోకి రావాలని, అవి దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడానికి దోహదపడాలని ఆశించాలి. -
మాకొద్దు విధులు
- ‘టిమ్’ విధులతో డ్రైవర్ల ఆందోళన - రెండు విధులు నిర్వహించడం కష్టమని ఆవేదన - అధికారుల నుంచి వేధింపులు - జిల్లా నుంచి రోజుకు 86 బస్సుల రాకపోకలు - పొరుగు జిల్లావాసుల కష్టాలు ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలోని ఆరు డిపోల్లో కండక్టర్ లేకుండా టికెట్ ఇష్యూ మిషన్(టిమ్)తో డ్రైవింగ్ వ్యవస్థ కొనసాగుతోంది. అధికారులు డ్రైవర్లకు ఇష్టం లేకున్నా డ్రైవింగ్‌తోపాటు టికెట్ ఇచ్చే విధులు నిర్వహించాలని వేధిస్తున్నారు. ఇలా చేయని వారికి వారం, పది రోజులపాటు విధులు కేటాయించడం లేదు. దీంతో ఆ కార్మికుడి వేతనంలో సుమారు రూ.3 వేల వరకు కోత పడుతుంది. రీజినల్‌లో 86 టిమ్‌తో బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ డిపో నుంచి 27, ఆసిఫాబాద్ 12, భైంసా 2, మంచిర్యాల 23 , నిర్మల్ 20, ఉట్నూర్ నుంచి 2 బస్సులు టిమ్ డ్రైవర్లతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి హైదరాబాద్, కరీంనగర్, గుంటూర్, ఇతరత్రా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లతో ప్రమాదాలు కండక్టర్ లేకుండా టికెట్లు ఇచ్చుకుంటూ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్లు జంకుతున్నారు. బస్సు నడుపుతూ.. ప్రయాణికులను పర్యవేక్షిస్తూ.. టికెట్లు ఇస్తూ.. లోపల పరిశీలిస్తూ బస్సు నడపాలంటే భయపడుతున్నారు. అధిక మంది ప్రయాణిస్తున్నప్పుడు, రాత్రి వేళల్లో మానసిక వేదనకు గురవుతున్నారు. అందరూ టికెట్ తీసుకున్నారా.. బస్సు ఆగిన ప్రాంతంలో దిగారా.. అలా పలు కారణాలతో ప్రయాణికులతోనూ తిప్పలు పడుతూ ఆర్టీసీ టిమ్ డ్రైవర్లు నరకయాతన పడుతున్నారు. కండక్టర్, డ్రైవర్ ఇద్దరు పనులు ఒక్కరే చేయాల్సి రావడంతో మానసికంగా కృంగిపోతున్నారు. బస్సు నడిపే సమయంలో ఒత్తిళ్లకు గురికావడంతో వారి ఏకాగ్రత పూర్తిస్థాయిలో కేటాయించలేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలు పట్టించుకుని ఎవరి విధులు వారికి కేటాయిస్తే సులభం అవుతుంది. భవిష్యత్‌లో కండక్టర్ భద్రమేనా? ఆర్టీసీలో టిమ్ డ్రైవర్ విధానాలతో కండక్టర్ ఉద్యోగాలకు యాజమాన్యం మంగళం పాడే అవకాశం ఉంది. జిల్లాలో గత విధానాన్ని బట్టి చూస్తే 86 మంది డ్రైవర్లతోపాటు 86 మంది కండక్టర్ విధులు నిర్వర్తించేవారు. కానీ, ప్రస్తుతం తరుణంలో టిమ్ విధానంతో డ్రైవర్లే కండక్టర్ల విధులు నిర్వహిస్తుండటంతో భవిష్యత్తులో కండక్టర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఆర్టీసీలో కండక్టర్ విధానం ప్రస్తుతం సాగుతున్నా భవిష్యత్తులో పూర్తిస్థాయిలో తీసేయనున్నారని సమాచారం. దీంతో కండక్టర్లలో ఆందోళన నెలకొంది. ఇటు డ్రైవర్లు, కండక్టర్లు టిమ్ డ్రైవర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వాసుల కష్టాలు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సుమారు 30 మంది వరకు జిల్లాలో పనిచేస్తున్నారు. 2010లో వారికి జిల్లాలో వారి అవసరం ఉందని తీసుకొచ్చిన ప్రస్తుతం వారికి కష్టాలు తప్పడం లేదు. వారిలో టిమ్ విధులు చేయాలని డ్రైవర్లను వే ధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. టిమ్ చేయని పక్షంలో వారికి విధుల్లోకి తీసుకోవడం లేదు. గత్యంతరం లేని స్థితిలో డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి జిల్లాకు వారిని పంపించే యత్నం కూడా చేయడం లేదు. తిప్పలు పెడుతూ విధులు చేయించుకుంటున్నారని, నిబంధలకు విరుద్ధంగా వాహనాలు నడపమని వేధిస్తున్నరని కార్మికులు ఆరోపిస్తున్నారు.