వాషింగ్టన్: కరోనా నేపథ్యంలో విద్యార్థులు, అధికారులు, ఉద్యోగస్తులు పూర్తిగా జూమ్ మీటింగ్‌లకే పరిమితమయ్యారు. జూమ్‌లోనే అన్నీ కార్యాకలాపాలు జరుగుతున్నాయి. కాగా జూమ్ మీటింగ్‌లలో అప్పుడప్పుడు కొన్ని తమాషా సంఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా జూమ్ మీటింగ్‌లో ఏకంగా యూఎస్ సెనేటర్ విషయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అమెరికాలోని ఓహియో స్టేట్‌లో ప్రతిష్టాత్మక డ్రైవింగ్ డిస్ట్రక్షన్ నిషేధ బిల్లుపై జరిగిన చర్చ సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓహియో రిపబ్లికన్ సెనేటర్ ఆండ్రూ బ్రెన్నర్ డ్రైవింగ్ చేస్తూ జూమ్ సమావేశానికి హజరయ్యాడు.
అతడు డ్రైవింగ్ చేస్తున్నట్లు కన్పించకుండా ఉండడం కోసం తన బ్యాక్ గ్రాండ్‌లో ఇంట్లో ఉన్నట్లు స్క్రీన్‌ను వాడాడు. కానీ అతడు వేసుకున్న సీట్ బెల్ట్‌తో డైవింగ్ చేస్తున్నట్లుగా సమావేశంలో ఉన్నవారికి తెలిసిపోయింది. సెనేటర్ ఈ విధంగా చేయడానికి ముఖ్యకారణం .. డిస్ట్రాక్షన్ డ్రైవింగ్‌ను నిషేధించాలని ఓహియో స్టేట్ అసెంబ్లీ ఒక కొత్త బిల్లును తీసుకొని వచ్చింది. ఓహియో స్టేట్ అసెంబ్లీ లో బిల్లుపై చర్చ జరపుతూ సెనేటర్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తన నిరసనను తెలిపాడు. తన చర్యలను సెనేటర్ తోసిపుచ్చాడు. కాగా తను జూమ్ మీటింగ్‌లో శ్రద్ధగా వింటూ, డ్రైవింగ్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. కాగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు, ఇతరత్రా చర్యలు చేసేటప్పుడు డ్రైవర్ తన ఏకాగ్రతను కొల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారని ఈ బిల్లును ఓహియో స్టేట్ సెనేట్‌లో ప్రవేశపెట్టారు.
జూమ్ మీటింగ్‌లో అడ్డంగా దొరికిన యూఎస్ సెనేటర్...! కానీ..
Published Sat, May 8 2021 4:09 PM | Last Updated on Sun, May 9 2021 1:50 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment