కొంతమందికి కార్ డ్రైవింగ్ నిత్యకృత్యం. వాళ్ల బిజినెస్ పనులూ, వాళ్ల రోజువారీ వ్యవహారాలూ అన్నీ కార్‌తోనే ముడిపడి ఉంటాయి. అయితే అలా కారు డ్రైవ్ చేసేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. నడుముపై ప్రభావం పడకుండానూ... నొప్పి రాకుండానూ ఉండాలంటే... కారు డ్రైవింగ్ చేసే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. అవి...
►మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లు పొడవుగా ఉన్నవారు సీట్‌ను మరీ ముందుకు ఉంచకుండా తగినంత దూరంలో ఫిక్స్ చేసుకోవాలి.
►అలాగే మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం.
►మీ సీట్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి.
►మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది.
►మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్‌రెస్ట్ ఉండాలి.
►సీట్‌లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి.
►అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి.
►అన్నిటికంటే ముఖ్యంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే కాదు... మరెన్నో విధాలుగా మేలు చేస్తుందని గుర్తుంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment