Buys
-
హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్ కొన్న హీరో వరుణ్ ధావన్ : ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది తన లేటెస్ట్ మూవీ ‘బేబీజాన్’ ఫ్లాప్ గురించి ఎంతమాత్రం కాదు. ముంబైలోని ఖరీదైన జుహూ ఏరియాలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఎవరి కోసం ఆ ఫ్లాట్లు కొన్నాడు. తెలుసుకుందాం ఈ కథనంలో..ముంబైలోనిముంబైలోని అత్యంత ప్రీమియం జుహు ఏరియాలో ట్వంటీ అనే హై-ఎండ్ ప్రాజెక్ట్‌లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. వీటి ధర ఏకంగా రూ.86.92 కోట్లు. ఫ్యామిలీతో కలిసి ఒకటి భార్య నటాషా దలాల్ కోసం , మరోకటి తల్లి కరుణ్ ధావన్‌కోసం వీటిని సొంతం చేసుకున్నాడు.ఈ ట్వంటీ అనే బిల్డింగ్ లోని ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్‌ను నటాషా దలాల్‌తో కలిసి కొన్నాడు. దీని విస్తీరం 5112 చదరపు అడుగులు. ధర రూ.44.52 కోట్లు. ఇందులో నాలుగు కారు పార్కింగ్ స్థలాలున్నాయట. ఇక తల్లి కోసం ఇక అదే బిల్డింగ్ ఆరో అంతస్తులో తన తల్లి కరుణా ధావన్‌తో కలిసి వరుణ్ మరో 4617 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొన్నాడు. దీని ధర రూ.42.4 కోట్లు. ప్రస్తుతం ఈ రెండూ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీలోపు వీటిని అందజేయనున్నారని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో అదరపు అడుగు విలువ రూ.60 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంటుంది.విలాసవంతమైన ప్రాజెక్ట్ గురించి మరింత చెప్పాలంటే, ఇది ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీల్లో పెద్ద డిమాండ్ ఉన్న ఏరియా. ఈ ప్రాజెక్ట్‌లో ప్రీమియం సౌకర్యాలతో 3BHK , 4BHK నివాసాలు ఉన్నాయి. అలాగే ముంబైలోని జుహులో అమితాబ్ బచ్చన్ కు రెండు బంగ్లాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, గోవిందా తదితర హీరోలకు కూడా ఇక్కడ ఇళ్లున్నాయి. ఇక బాంద్రాలో బాలీవుడ్ స్టార్‌హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లాంటివాళ్ల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. (ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం)వరుణ్ ధావన్ తన చిన్నప్పటి నుంచి తన తండ్రి, నిర్మాత డేవిడ్ ధావన్ ద్వారా బాలీవుడ్‌తో దగ్గరి సంబంధాలతో పెరిగాడు. అయితే ధావన్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడిపింది. 1990లలో డేవిడ్ అనేక విజయాలను అందించినప్పటికీ. నిర్మాత జీవితం దర్శకుడి జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఉన్నప్పటికీ తన తండ్రి పెద్దగా సంపాదించలేదన్నారు. అలా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నుంచి ముంబైలోని ఎలైట్ సెలబ్రిటీ హాట్‌స్పాట్‌లో రెండు లగ్జరీ రియల్ ఎస్టేట్లను కొనుగోలు దాకా వరుణ్ ఎదగడం విశేషమే మరి.ఇదీ చదవండి : రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!కాగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ తేరి మూవీ రీమేక్‌గా దీన్ని తీసుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం పెద్దగా సక్సెస్‌కాలేకపోయింది. కొత్త పెళ్లికూతురుగా పసుపుతాడుతో కీర్తి సురేష్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ‘బేబీ జాన్’ డిజాస్టర్ గా మిగిలి పోయింది. -
ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన ప్రమఖ హాస్య నటుడు వైవా హర్ష (ఫోటోలు)
-
కొత్త కారు కొన్న హీరోయిన్.. వాడిన చీరలు అమ్మడమే ఆమె బిజినెస్! (ఫోటోలు)
-
Rithu Chowdary: జబర్దస్త్ బ్యూటీ కొత్త కారు.. అదిరిపోయిందంతే! (ఫోటోలు)
-
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.రియల్ఎస్టేట్ సమాచార సంస్థ జాప్కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్జీభాయ్ షామ్‌జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్‌లో రూ. 97.4 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. వర్లీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్‌లో ఒకటిగా పరిగణిస్తారు.అపార్ట్మెంట్ భవనంలోని 47వ అంతస్తులో మావ్జీభాయ్ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్లతో వస్తుంది. సేల్ డీడ్ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్ 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ ఉండగా మరో టవర్‌లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్మెంట్లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. -
Shraddha Kapoor: లంబోర్గిని కారు కొన్న శ్రద్ధా కపూర్ (ఫోటోలు)
-
ఇగో హర్ట్ అయితే.. అట్లుంటది మరి!
ఎక్కడైనా ధర దగ్గర భేరమాడటం సహజమే.. అయితే.. కొన్నిసార్లు అడిగిన ప్రతి ఒక్కరికీ ధరను చెప్పలేక వ్యాపారి విసిగిపోవడమూ అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే.. ఇదే వ్యవహారంపై చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో విచిత్రమైన సంఘటన జరిగింది. కొనలేకపోతే వెళ్లిపోండని కసురుకున్న వ్యాపారికి తిక్క కుదిర్చాడో వ్యక్తి. రూ. 9 వేలు పెట్టి ఖరీదు చేసి వ్యాపారి అమ్ముతున్న న్యూడుల్స్‌ని కిందపడేసి ధ్వంసం చేశాడు. వీడియోలో చూపిన విధంగా కొనుగోలుదారుడు వ్యాపారి వద్దకు వెళ్లాడు. న్యూడుల్స్ ధర ఎంత అని అడుగుతాడు. ఒక కప్ న్యూడుల్స్కు రూ.164 అని అతడు చెబుతాడు. ఎందుకు అంత ధర చెబుతున్నారని కస్టమర్ ప్రశ్నిస్తాడు. న్యూడుల్స్ లో వాడుతున్న ముడి సరకులు ఎంటో చెప్పాలని అడుగుతాడు. దానికి వ్యాపారి రెండు గుడ్లుతో సహా వాడే ముడి పదార్థాలను వివరిస్తాడు. విన్న తర్వాత దానికే మరీ ఇంత రేటా? అని కస్టమర్ అనగానే పక్కనే ఉన్న వ్యాపారి కొడుకు లేచి ఆర్థిక స్తోమత లేకపోతే వెళ్లిపోవాలని కసురుకుంటాడు. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ వ్యాపారిపై విచిత్రంగా ప్రవర్తించాడు. వ్యాపారి వద్ద ఉన్న అన్ని న్యూడుల్స్ కు రూ.9,920 వెచ్చించి కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత అన్నింటిని పనికిరానివాటిగా పరిగణిస్తూ కిందపడేస్తాడు. కాలితో తొక్కుతూ నన్నే అవమానిస్తావా? అని అంటాడు. వ్యాపారి కుమారుడు క్షమాపణలు కోరుకున్నా ఫలితం లేకపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. ఇగో హర్ట్ అయితే ఇలాగే ఉంటది? అంటూ కామెంట్లు పెట్టారు. వ్యాపారి తిట్టినందుకు బహుమతిగా రూ.9 వేలు ఇచ్చావా? సరిపోయిందా? అంటూ ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. ఇదీ చదవండి: డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. సెక్యూరిటీ గార్డ్‌పై మరీ ఇంత దారుణమా..? వీడియో వైరల్.. -
హెచ్‌సీఎల్ చేతికి జర్మన్ కంపెనీ: 279 మిలియన్ డాలర్ల డీల్
ముంబై: దేశీయ మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ జర్మన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ సేవల సంస్థ ఎసాప్ గ్రూప్‌లో 100 శాతం ఈక్విటీ వాటాను (279.72 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. హెచ్‌సిఎల్‌టెక్ యూకే అనుబంధ సంస్థ ద్వారా జరిగే ఈ ఒప్పందం సెప్టెంబర్ 2023 నాటికి ముగియనుంది. ఇది ఇప్పుడు రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఉంటుందని సంస్థ గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అటానమస్ డ్రైవింగ్, ఇ-మొబిలిటీ, కనెక్టివిటీ రంగాలలో భవిష్యత్తు-ఆధారిత ఆటోమోటివ్ టెక్నాలజీలో తమ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంలో ఈ డీల్ తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. అలాగేఐరోపా, అమెరికా, జపాన్‌లోని కీలకమైన ఆటోమోటివ్ మార్కెట్స్‌లో విస్తరణకు ఈ కొనుగోలు సాయ పడుతుందని పేర్కొంది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్:లైసెన్స్ ఉండాల్సిందే!) హెచ్‌సీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికానికి(క్యూ1) ఆసక్తికర ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం వార్షికంగా 7 శాతం బలపడి రూ. 3,534 కోట్లను తాకింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 3,324 కోట్లు ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన రూ. 3,983 కోట్లతో పోలిస్తే లాభాలు 11 శాతం క్షీణించాయి. ఇక మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 26,296 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 23,464 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండు చెల్లింపునకు ఈ నెల 20 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఇతర విశేషాలు కొత్తగా 1,597 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి క్యూ1లో నికరంగా 2,506 మంది ఉద్యోగులు తగ్గారు. జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,438కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 16.3 శాతంగా నమోదైంది. -
రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్
సాక్షి,ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన మహారాష్ట్రలోని అలీబాగ్‌లో భారీ విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. అరంగేట్రంలో రూ. 12.91 కోట్లతో ఆస్తులను కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. సుహానా ఖాన్ తన తొలి సంపాదనతో ఈ ఆస్తులను కొన్నట్టు సమాచారం. మూడు ఇళ్లతోపాటు, ఒక ప్లాట్‌ను కొనుగోలు చేసినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది అంతేకాదు రిజిస్ట్రేషన్ లో సుహానా పేరును రైతుగా నమోదు చేశారట. సుహానా అమ్మమ్మ సవితా ఛిబ్బర్, ఆమె సోదరి నమితా చిబ్బర్ డైరెక్టర్లుగా ఉన్న డెజా వు ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆస్తిని జూన్ 1న రిజిస్ట్రేషన్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) భూమి విస్తీర్ణం 1.5 ఎకరాలు, 2,218 చదరపు అడుగుల్లోఉన్న ఇళ్లు ఉన్నాయి. దీనికోసం 77.46 స్టాంప్ డ్యూటీ చెల్లించారు. పఠాన్‌తో భారీ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్‌కు ఇప్పటికే అలీబాగ్ లో సీ ఫేస్డ్ లగ్జరీ బంగ్లా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సునైనా కొనుగోలు చేసిన అలీబాగ్ లో దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు ఇళ్లు కూడా ఉన్నాయి. (టీసీఎస్‌లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) కాగా జోయా అక్తర్ దర్శకత్వంలో ది ఆర్చీస్ అనే మూవీలో సుహానా తొలిసారిగా నటిస్తోంది. ది ఆర్చీస్ అనేది 1960ల నాటి భారతదేశంలోని లైవ్-యాక్షన్ మ్యూజికల్ సెట్. ఈ సినిమాలో బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో అదరగొట్టిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక సుహానా ఖాన్ స్టడీ విషయానికి వస్తే యూకేలోని సస్సెక్స్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, 2022లో న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి నటనలో పట్టా పొందడం గమనార్హం. You’ve seen the gang in the comics, in books, and even in Riverdale — but this time around, you’ll see them closer to home! Set in the 60's, The Archies builds a world that’s both familiar and new. Here's your first look #TUDUM! pic.twitter.com/uxpS1A3JeX — Netflix India (@NetflixIndia) June 17, 2023 -
స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు లగ్జరీ కార్లపైమోజును మరోసారి చాటుకున్నాడు. తాజాగా అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశాడు.దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ధావన్ ఒక వీడియను షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ 4 లక్షల,11 వేలకు పైగా లైక్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడళ్ల ధర రూ. 3.5 కోట్ల నుండి అత్యంత ఖరీదైన వేరియంట్ రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ధావన్ కొనుగోలు చేసిన లేటెస్ట్ వెర్షన్ విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఎప్పటిలాగానే తనదైన స్టయిల్లో పంజాబీ పాటతో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీలు మనసుపడుతున్న కార్లలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. ఫీచర్లు పరివీలిస్తే ఫ్లోటింగ్-స్టైల్, పూర్తిగా డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెరిడియన్ 35-స్పీకర్ ఆడియో సిస్టమ్, డైనమిక్ నోయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. ఇది వీల్ వైబ్రేషన్లు, ఇంజిన్ నానోయిస్, టైర్ నోయిస్, రోడ్ నోయిస్ ఇతర బ్యాక్‌గ్రౌండ్ నోయిస్ కంట్రోల్ చేస్తుంది. భారీ 13.1అంగుళాల స్క్రీన్, హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ , బ్యాక్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఇంకా హెడ్‌ల్యాంప్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ లైట్లు , ఇంటిగ్రేటెడ్ LED DRL ఉంటాయి. ప్రీమియం లుక్‌తో రీడిజైన్ చేయబడిన బంపర్తోపాటు అప్‌గ్రేడెడ్ డోర్ హ్యాండిల్స్ ఫ్లష్ ఫిట్టింగ్‌ను కలిగి ఉందీ కారు. కాగా ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ శిఖర్ ధావన్‌కు లగ్జరీ కార్లంటే మక్కువ ఎక్కువ. ఇప్పటికే అతని గ్యారేజ్లోమెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్ BMW M8ని కొనుగోలు చేశాడు. ఈ లిస్ట్‌లో తాజాగా ల్యాండ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ చేరడం విశేషం. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్:పాన్-ఇండియా స్టార్ సమంతా రూత్ ప్రభు కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇపుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, 13వ అంతస్తులో కొనుగోలు చేసిన ఇల్లు 3,920 చదరపు అడుగులతో 7,944 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియా , 14వ అంతస్తులో 4,024 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్యూప్లెక్స్ ఏరియాతో ఉంది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన సమంతా తాజాగా అత్యంత ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ (డ్యూప్లెక్స్) కొత్తగా సామ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఖరీదైన డూప్లెక్స్ ప్లాట్‌ను తాజాగా సమంత సొంతం చేసుకుంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆరు పార్కింగ్ స్లాట్లతో జయభేరి ఆరెంజ్ కౌంటీలో 3BHK లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ 13, 14 ఫ్లోర్లలో ఉందని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ నివేదించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.7.8 కోట్లు. ఇటీవల ముంబైలో రూ. 15 కోట్ల విలువైన రాజభవన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతోపాటు జూబ్లీహిల్స్‌లో 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కూడా ఉందట. దీంతో ఆమె నికర విలువ రూ. 89 కోట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంతా రీసెంట్గా గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ డ్రామా `శాకుంతలం`తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.కాళిదాసు నాటకం ఆధారంగా, శకుంతల, పెరూ రాజవంశం రాజు దుష్యంత్‌ల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ కూడా నటించారు.భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.11 కోట్లు మాత్రమే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల కానుంది. మరోవైపు విజయ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం రిలీజైన ఈ మూవీలో ఫస్ట్ సింగిల్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
బాలీవుడ్ నటి చేతికి కళ్లు చెదిరే లగ్జరీ కారు: వైరల్ వీడియో
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఎంజీ గ్లోస్టర్ కొత్త SUVని కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.42 లక్షలు. గ్లోస్టర్. విలాసవంతమైన కారును కొనుగోలు చేసిన షెర్లిన్ చోప్రా ఫోటో, వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియాలో లభిస్తున్న ఎంజీ ఫ్లాగ్షిప్ మోడల్ ఎస్యూవీ గ్లోస్టర్. దీని ప్రారంభ ధర రూ. 32.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే తాజా నివేదికల ప్రకారం, షెర్లిన్ చోప్రా కొనుగోలు చేసిన మోడల్ ధర సుమారు రూ. 42.48 లక్షలు. గతంలో ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేసిన షెర్లిన్ చోప్రా, నటి మోడల్ కూడా. తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇంగ్లీషు సినిమాల్లోనూ నటిస్తోంది. షెర్లిన్ చోప్రా రెండు టెలివిజన్ రియాలిటీ షోలతోపాటుబిగ్ బాస్ సీజన్ 3లో కూడా కనిపించింది. ఎంజీ గ్లోస్టర్ SUVలో డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, మోటరైజ్డ్ టెయిల్‌గేట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంటర్నల్ ఎయిర్ ప్యూరిఫైయర్తో సహా అనేక సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. 2022 ఎంజీ గ్లోస్టర్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సెమీ-పారలల్ పార్కింగ్, అటానమస్ బ్రేకింగ్, లేన్ కీపింగ్ ఎయిడ్, అలాగే స్టాండర్డ్ ఫ్రంట్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) ఉన్నాయి. ఇది పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్‌తో కొనుగోలు చేయవచ్చు. 2.0L డీజిల్ ఇంజన్ కోసం ఒకే టర్బో లేదా ట్విన్ టర్బోలను కలిగి ఉంటుంది. టయోటా ఫార్చ్యూనర్ , ఇసుజు MU-X వంటి వాటితో పోటీ పడుతోంది. ధర పరంగా జీప్ మెరిడియన్, హ్యుందాయ్ టక్సన్ ,కియా కార్నివాల్ వంటి వాహనాలతో పోటీపడుతుంది. -
హైదరాబాద్‌లో మైక్రోచిప్ ఆఫీసు
సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్‌ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్ టవర్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీలకు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించింది. అమెరికాలోని ఆరిజోనా ప్రధాన కేంద్రంగా ఉన్న మైక్రోచిప్‌కు మన దేశంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. తాజా పెట్టుబడులు వచ్చే 10 ఏళ్లలో కంపెనీ సామర్థ్యాల విస్తరణ, నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతాయని మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ శ్రీకాంత్ శెట్టికెరె అన్నారు. 66 మీటర్ల ఎత్తయిన వాణిజ్య సముదాయంలో సుమారు 5 లక్షల చ.అ. గ్రేడ్-ఏ ఆఫీసు స్థలం ఉంది. ఆరియన్, ఎస్కార్, టెర్మినస్‌లు ఈ ప్రాపర్టీని కో-ప్రమోటర్లుగా ఉన్నాయి. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) నుంచి ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్‌ను దక్కించుకుందని వన్ గోల్డెన్ మైల్ మేనేజింగ్ పార్టనర్ పుష్కిన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం, లేఆఫ్‌లు వంటి వ్యాపార ఒత్తిడి నేపథ్యంలోనూ హైదరాబాద్‌లో ప్రీమియం ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం సానుకూల దృక్పథమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరాబాబు తెలిపారు. -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలు వైరల్
-
లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ధర ఎంతో తెలుసా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుతం మహేశ్‌బాబుతో SSMB28 ఓ సినిమాను చేస్తున్నారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. రీసెంట్గా త్రివిక్రమ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ లగ్జరీ కారు ధర 1.34 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వరకే ఆయన గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్నా తాజాగా మరో కొత్త కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం మహేష్‌తో సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. -
లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కమర్షియల్గానూ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధించిందీ సినిమా. ఒక్క సినిమాతో డైరెక్టర్ ఇమేజ్ కూడా ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ కామెంట్స్‌తోనూ వార్తల్లో నిలుస్తున్న వివేక్ అగ్నిహోత్రి తాజాగా ముంబైలో ఖరీధైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. 3258 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంధేరిలోని వెర్సీవాలోని 30వ ఫ్లోర్‌లోని అపార్ట్‌మెంట్‌ను సుమారు 17.92 కోట్లకు ఆయన కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక మరో విశేషం ఏమిటంటే.. అగ్నిహోత్రి కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్కి పై అంతస్తులోనే బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ కూడా ఓ ఇంటని కొనుగోలు చేశారు. కొన్నిరోజుల క్రితమే ఆయన దీన్ని కొన్నట్లు సమాచారం. -
వేల కోట్ల డీల్..జొమాటో చేతికి ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్(గతంలో గ్రోఫర్స్ ఇండియా)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,447.5 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. శుక్రవారం సమావేశమైన బోర్డు బ్లింక్ కామర్స్‌కు చెందిన 33,018 ఈక్విటీ షేర్ల కొనుగోలుకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఒక్కో షేరుకి రూ. 13.45 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొంది. కాగా.. జొమాటోకు చెందిన 62.85 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా లావాదేవీని పూర్తి చేయనున్నట్లు వివరించింది. రూ. 1 ముఖవిలువగల ఒక్కో షేరునీ రూ. 70.76 సగటు ధరలో జారీ చేయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే బీసీపీఎల్‌లో 1 ఈక్విటీ షేరుతోపాటు మరో 3,248 ప్రిఫరెన్స్ షేర్లను కలిగి ఉంది. క్విక్ కామర్స్ బిజినెస్‌లో పెట్టుబడి వ్యూహాలకు అనుగుణంగా బీసీపీఎల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు జొమాటో ఈ సందర్భంగా పేర్కొంది. బ్లింకిట్ బ్రాండుతో బీసీపీఎల్ ఆన్లైన్ క్విక్ కామర్స్ సర్వీసులను అందిస్తున్న విషయం విదితమే. కాగా, బ్లింకిట్ కొనుగోలు తదుపరి రెండు కంపెనీల యాప్స్ విడిగా కొనసాగనున్నట్లు జొమాటో వెల్లడించింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో జొమాటో షేరు నామమాత్ర లాభంతో రూ. 70.15 వద్ద ముగిసింది. -
ఖరీదైన కారు కొన్న కంగనా రనౌత్.. ధర ఎంతంటే
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ధాకడ్ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో ఆమె ఏజెంట్ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించింది. ఇక సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు కంగనా కాస్ట్లీ కారు కొనుగోలు చేసింది. మే బ్యాక్ ఎస్680(Mercedes-Maybach S680) కంపెనీకి చెందిన లగ్జరీ కారును కొనేసింది. రీసెంట్‌గానే ఈ మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇక ఈ లగ్జరీ కారు కొన్న ఫస్ట్ ఇండియన్‌గా కంగనా నిలిచింది. ఈ కారు ధర రూ. 3.5కోట్లు ఉంటుందట. ప్రస్తుతం కంగనా కొనుగోలు చేసిన ఈ కారు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ?
Aditi Rao Hydari Buys New Audi Q7 Car Worth 90 Lakhs: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల తెలుగులో 'మహాసముద్రం' సినిమాతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ విలాసవంతమైన కారు కొనుగోలు చేసింది. ముంబైలో అత్యంత ఖరీదు చేసే 'ఆడి క్యూ 7' లగ్జరీ కారుకు యజమానురాలైంది అదితి. సుమారు ఈ కారు విలువ రూ. 90 లక్షలు ఉంటుంది. అదితి రావు ఈ కారు కొనుగోలు చేసినట్లుగా ఆడి కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పలు ఫొటోలతో పోస్ట్ చేసింది. కారుతో అదితి రావు దిగిన అందమైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అదితి రావు హైదరీ 2007లో 'శృంగారం' అనే తమిళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. సమ్మోహనం, వి, మహా సముద్రం, హై సినామిక, రాక్‌స్టార్, మర్డర్ 3, వజీర్, ది గర్ల్ ఆన్ ది ట్రైన్, పద్మావత్ వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. చదవండి: సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు View this post on Instagram A post shared by Audi Mumbai West (@audi_mumbaiwest) -
బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర..
Is Karan Kundrra Bought A Flat Worth 20 Crore In Bandra: హిందీ బిగ్‌బాస్ ఫేం, బాలీవుడ్ టీవీ నటుడు, మోడల్ కరణ్ కుంద్రా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో బాంద్రా రిక్లమేషన్ ప్రాంతంలోని '81 అరీటే' భవనంలో 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొంటున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. చదవండి: పెళ్లయ్యాక 25 మంది పిల్లలను కంటాం ప్రస్తుతం గోరేగావ్‌లో ఉంటున్న కరణ్ కుంద్రా చాలా రోజులుగా బాంద్రా, జుహు వైపుకు మారాలని అనుకుంటున్నాడట. కరణ్ కుంద్రా చూస్తున్న ఫ్లాట్ ధర రూ. 20 కోట్లు. ఇందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, బార్బెక్యూ పిట్ మొదలైన విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనం నుంచి బాంద్రా సమీపంలోని సముద్రపు వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుందట. కరణ్ కుంద్రా త్వరలో 'నాగిని' సీరియల్ హీరోయిన్ తేజస్వి ప్రకాష్‌ను వివాహం చేసుకోనున్నాడని సమాచారం. వారిద్దరి కోసమే ఈ ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నాడని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ జర్నీ కొనసాగించిన ఈ జంట బయటకు వచ్చాక వర్క్ షెడ్యూల్స్‌తో బిజీ అయిపోయింది. అయితే ఇటీవల తేజస్వి ఇంటికి తన పేరెంట్స్‌ను వెంటబెట్టుకుని వెళ్లిన కరణ్ కుంద్రా నుదుటన కుంకుమతో బయటకు రావడంతో వీరికి రోకా అయిపోయిందని ఫిక్స్ అయ్యారు నెటిజన్లు. దీంతో వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. కాగా రాజ్ కరణ్ కుంద్రా తల్లిదండ్రులు సంవత్సరంలో కొన్ని నెలలు యూఎస్‌లో నివసిస్తారు. అలాగే వారికి పంజాబ్‌లో ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది. చదవండి: ఫొటోలు తీసేందుకు ఇంట్లోకి వచ్చిన మీడియా, క్లాస్ పీకిన ప్రియుడు -
హైదరాబాద్ వదిలి ముంబై షిఫ్ట్ అవుతున్న సమంత!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న సామ్ త్వరలోనే ముంబైకి మకాం మారనుందట. ఇప్పటికే సౌత్‌లో సూపర్‌స్టార్‌గా ఫేమ్ తెచ్చుకున్న సమంత త్వరలోనే బాలీవుడ్‌లోనూ పాగా వేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ కారణగానే హిందీలో ఎక్కువగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యిందట. దీంతో హిందీ సినిమాల కోసం తరచూ హైదరాబాద్ నుంచి ప్రయాణాలు చేసే పనిలేకుండా అక్కడే ఓ ఇల్లు తీసుకోవడం బెటర్ అని సామ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ముంబై సముద్ర తీరాన సామ్ ఒక అందమైన ఇంటిని సమంత కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లాట్ ని దాదాపు రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఫ్లాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసి పూర్తిగా ముంబైకి షిఫ్ట్ కానుందట సామ్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఇక ప్రస్తుం సమంత తెలుగులో యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది. -
ఖరీదైన ఇల్లు కొన్న ప్రముఖ డిజైనర్, ధర ఎంతంటే..
Manish Malhotra Buys 21 Crore Worth Appartment In Mumbai Bandra: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హొత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయినర్స్ సహా పలువురు సెలబ్రిటీలకు అదిరిపోయే దుస్తులు డిజైన్ చేస్తుంటారాయన. బీటౌన్‌లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హొత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే అనేంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బీటౌన్ ఫ్యాషన్ కలల ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ కాస్ట్యూమ్ డిజైనర్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ముంబైలో భారీ మొత్తానికి మనీష్ మల్హొత్ర ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బాంద్రా వెస్ట్‌లోని భోజ్వనీ ఎన్‌క్లేవ్‌లో సుమారు రూ. 21 కోట్లు పెట్టి కాస్ట్లీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. -
బెంజ్ కారు కొన్న యంగ్ హీరో.. ఫోటోలు వైరల్
Aadi Sai Kumar Buys Benz Car, Pics Goes viral: ఆది సాయికుమార్ లేటెస్ట్ మూవీ 'అతిథి దేవోభవ' ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. లవ్, యాక్షన్ ఓరియెంటెండ్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 7న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ ఏడాది కొత్త సినిమాతో పలకరించిన ఆది సాయికుమార్ ఇప్పుడు తన ఇంట్లోకి కూడా కొత్త కారును ఆహ్వానించాడు. ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా భార్య, కూతురితో పాటు తండ్రి సాయికుమార్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్ చేతిలో ఆర డజనుకు పైగా సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi) -
ఖరీదైన కారు కొన్న హీరోయిన్.. ధర తెలిస్తే షాకే
Mamta Mohandas buys Porsche 911 Carrera Car: మలయాళీ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్‌కు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. 'యమదొంగ' సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ భామ కృష్ణార్జున,హోమం సినిమాలతో నటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును కొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. 'నా కల నిజమైంది. దీని కోసం దశాబ్దం పాటు ఎదురుచూశాను. ఫైనల్లీ ఇప్పుడు దీన్ని సొంతం చేసుకున్నా. నా కుటుంబంలో కొత్త సభ్యుడిని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన తల్లిదండ్రులతో కలిసి మమతా మోహన్ దాస్ ఈ కారును కొనుగోలు చేసింది. 'ఫోర్ష్911 కారెర్రా' మోడల్‌కు చెందిన ఈ కారుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 3.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 450 బీహెచ్పీ పవర్ కలిగి ఉంది. వీటితో పాటు మరెన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ కారు ధర అక్షరాల రూ.1.80 కోట్లు. ప్రస్తుతం మమతా మోహన్ దాస్ కొత్త కారు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
ముంబైలో కొత్తింట్లోకి షిఫ్ట్ అయిన రష్మిక
పరిశ్రమలోకి వచ్చిన తక్కవ కాలంలోనే దక్షిణాది స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మిక మందన్నా. ‘ఛలో’తో సూపర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో యమ బిజీగా ఉంది. తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగుతూనే, బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఒకేసారి గుడ్ బై, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటిస్తూనే, మరో సినిమాకు కూడా సైన్ చేసింది. చూస్తుంటే బాలీవుడ్లోనే రష్మిక జెడ్ స్పీడ్‌లా దూసుకుపోయేలా కనిపిస్తుంది. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఇటీవలె రష్మిక ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా కొత్త ఇంట్లోకి రష్మిక షిఫ్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేస్తూ.. ఎట్టకేలకు కొత్త అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాను. దీనికోసం చాలానే షాపింగ్ చేయాల్సి వచ్చింది. అయితే నేను కొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నా అసిస్టెంట్ సాయి నాకు ఇళ్లు షిఫ్ట్ అవ్వడంలో సహాయం చేశాడు. ఆరా(పప్పీ) నేను చాలా అలసటతో ఉన్నా దానిని అధిగమించాం అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ విల్లా ధర చాలా కాస్ట్లీ అని సమాచారం. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ సుకూమర్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: రష్మిక కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ 900 కి.మీ ప్రయాణం ఛాన్స్ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక