వాషింగ్టన్: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా వేరబుల్ టెక్నాలజీ సంస్థ , స్మార్ట్‌వాచ్ తయారీ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు తమ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారని ఈ సందర్భంగా ఫిట్‌బిట్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో జేమ్స్ పార్క్ తెలిపారు.
అత్యుత్తమమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఫిట్‌నెస్ బ్యాండ్స్ తదితర వేరబుల్ ఉత్పత్తులను మరింత మెరుగు పర్చేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (డివైజెస్, సర్వీసెస్ విభాగం) రిక్ ఓస్టర్‌లో తెలిపారు. వేరబుల్స్ విభాగంలోకి అందరికన్నా ముందుగా ప్రవేశించినప్పటికీ.. ఇతర సంస్థలతో పోటీ కారణంగా వెనుకబడుతున్న ఫిట్‌బిట్‌కు ఈ డీల్ ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు, ఆన్‌లైన్ సెర్చిలో గుత్తాధిపత్యం ఆరోపణలు ఎదుర్కొంటుండంతో.. ఇతరత్రా హార్డ్‌వేర్ ఉత్పత్తులపైనా దృష్టి పెడుతున్న గూగుల్‌కు కూడా ఇది ఉపయోగపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment