Fitbit
-
అమ్మ బాబోయ్! పేలుతున్న స్మార్ట్‌వాచ్‌లు, కాలిపోతున్న యూజర్ల చేతులు!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఇద్దరు మహిళలు గూగుల్‌పై దావా వేశారు. గూగుల్‌కు చెందిన స్మార్ట్ వాచ్‌లు ధరించడం వల్ల తమ చేతులు కాలిపోయాంటూ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో వేసిన దావాలో పేర్కొన్నారు. గూగుల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఫిట్‌బిట్' పేరుతో స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసింది. ఏప్రిల్ 2018న ఫిట్ బిట్ వెర్సా 1, 2019 సెప్టెంబర్‌లో ఫిట్‌బిట్ వెర్సా 2, 2020 సెప్టెంబర్‌లో ఫిట్‌బిట్ వెర్సా 3ని విడుదల చేసింది. విడుదలైన ఈ స్మార్ట్‌వాచ్‌లు గూగుల్ సంస్థవి కావడంతో యూజర్లు సైతం వాటిని ధరించేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా స్మార్ట్ వాచ్‌లను వినియోగించిన యూజర్లు చేతులు కాలి తీవ్రంగా గాయపడుతున్న వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాచ్‌లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు హీటెక్కీ పేలిపోవడంపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మార్చి నెలలో యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం10మిలియన్ల ఫిట్‌బిట్ వాచ్‌లను వెంటనే రీకాల్ చేయాలని హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ హెచ్చరికలతో కంగుతిన్న గూగుల్ ఆ వాచ్‌లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..జెన్నీ హౌచెన్స్, సమంతా రామిరేజ్ యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్‌ను ఆశ్రయించారు. ఫిట్‌బిట్ స్మార్ట్ వాచ్ వెర్సాలైట్ మోడల్‌ను ధరించిన తన కుమార్తె చేయి కాలిపోయిందని జెన్నీ హౌచెన్స్, వెర్సా 2 స్మార్ట్ వాచ్ ధరిండం వల్ల తాను గాయపడినట్లు రామిరేజ్ గూగుల్‌పై వేసిన దావాలో పేర్కొన్నారు. అంతేకాదు ఇద్దరూ తమ ఫిట్బిట్ల ధర వాపస్ తో పాటు చట్టపరమైన ఖర్చులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..బాధితుల తరుపు న్యాయ వాదులు కేలరీలను బర్న్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేస్తారు. కానీ ఇలా చేతుల్ని కాల్చుకునేందుకు కాదంటూ కోర్ట్‌లో వాదించారు. చదవండి👉గూగుల్‌కు భారీషాక్..అమ్మ బాబోయ్!! ఈ స్మార్ట్ వాచ్‌తో చేతులు కాలిపోతున్నాయ్!! -
గూగుల్‌కు భారీషాక్..అమ్మ బాబోయ్!! ఈ స్మార్ట్ వాచ్‌తో చేతులు కాలిపోతున్నాయ్!!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు యూఎస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ భారీ షాకిచ్చింది. గూగుల్‌కు చెందిన స్మార్ట్ వాచ్‌లను రీకాల్ చేయాలని సూచించింది. దీంతో గూగుల్ స్మార్ట్ వాచ్‌లను రీకాల్ చేసేందుకు సిద్ధమైంది. గూగుల్‌కు చెందిన ఫిట్‌బిట్ కంపెనీ రూ.22,631 ధరతో ఐకానిక్ స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌వాచ్ గూగుల్ కంపెనీది కావడంతో అమెరికాలో 1మిలియన్ వాచ్‌లు, మిగిలిన ప్రపంచ దేశాల్లో 693,000 వాచ్‌లను యూజర్లు కొనుగోలు చేశారు. ఫలితంగా స్మార్ట్ వాచ్‌లను వినియోగించిన యూజర్లు చేతులు కాలి తీవ్రంగా గాయపడ్డారు. స్మార్ట్ వాచ్‌లను ధరించడం, వాచ్‌లో ఉండే బ్యాటరీ వేడెక్కి పేలడం, చేతులకు తీవ్రగాయాలు కావడంతో గూగుల్ కంపెనీపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరుసగా యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై యూఎస్ కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ సభ్యులు గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు బిట్ఫిట్ కంపెనీకి 115 అమెరికన్ యూజర్లు, మిగిలిన దేశాల్లో 59మంది యూజర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అంతేకాదు యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం ఫిట్‌బిట్ కు చెందిన 10మిలియన్ల వాచ్‌లను వెంటనే రీకాల్ చేయాలని హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ హెచ్చరికలతో కంగుతిన్న గూగుల్ ఆ వాచ్‌లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: అదిరిపోయే స్మార్ట్ గ్లాస్లెస్.. సెల్ఫీలు దిగొచ్చు, కాల్ చేయొచ్చు..ఇంకా ఎన్నో -
గూగుల్ చేతికి ఫిట్‌బిట్
వాషింగ్టన్: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా వేరబుల్ టెక్నాలజీ సంస్థ , స్మార్ట్‌వాచ్ తయారీ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు తమ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారని ఈ సందర్భంగా ఫిట్‌బిట్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో జేమ్స్ పార్క్ తెలిపారు. అత్యుత్తమమైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఫిట్నెస్ బ్యాండ్స్ తదితర వేరబుల్ ఉత్పత్తులను మరింత మెరుగు పర్చేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (డివైజెస్, సర్వీసెస్ విభాగం) రిక్ ఓస్టర్‌లో తెలిపారు. వేరబుల్స్ విభాగంలోకి అందరికన్నా ముందుగా ప్రవేశించినప్పటికీ.. ఇతర సంస్థలతో పోటీ కారణంగా వెనుకబడుతున్న ఫిట్‌బిట్‌కు ఈ డీల్ ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు, ఆన్లైన్ సెర్చిలో గుత్తాధిపత్యం ఆరోపణలు ఎదుర్కొంటుండంతో.. ఇతరత్రా హార్డ్‌వేర్ ఉత్పత్తులపైనా దృష్టి పెడుతున్న గూగుల్‌కు కూడా ఇది ఉపయోగపడనుంది. -
ఫుట్‌బాల్ టికెట్లు, వాచీలు..!
న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్ పొందేందుకు కంపెనీ మేనేజ్మెంట్ ఏవిధంగా అడ్డదారులు తొక్కారన్న వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా తాయిలాలిచ్చి ఏవిధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర ఆడిట్లో వెల్లడయింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలకు మెరుగైన రేటింగ్స్ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్మెంట్ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్ నిర్వహిస్తున్న గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఇండియా రేటింగ్స్ అధికారికి లబ్ధి.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ (ఐటీఎన్‌ఎల్), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎఫ్ఐఎన్), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ సంస్థలు రేటింగ్ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్ఐఎన్ మాజీ సీఈవో రమేష్ బవా, ఫిచ్ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విభాగం హెడ్ అంబరీష్ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణలను గ్రాంట్ థార్న్టన్ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోనూ రమేష్ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్ ఎండీ అజయ్ చంద్రను కూడా రమేష్ కోరినట్లు నివేదికలో పేర్కొంది. -
ఆటలా వ్యాయామం...
ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అలుపు సొలుపు తెలియదట. మరి ఇది కేవలం పని విషయానికి మాత్రమేనా? వ్యాయామానికి కూడా వర్తిస్తుందా? అయోవా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెబ్ ఆధారిత ఆటతో ఈ అంశాన్ని పరీక్షకు పెట్టారు. స్మార్ట్ఫోన్తోపాటు ఫిట్‌బిట్ గాడ్జెట్ ఉన్న వారెవరైనా ఈ గేమ్ ఆడవచ్చు. బద్దకిష్టులను కూడా వ్యాయామం చేసేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. శరీరానికి కొద్దోగొప్పో పని కల్పించకపోతే ఊబకాయం వచ్చేసి మధుమేహం మొదలుకొని కేన్సర్ల వరకూ అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నది తెలిసిన విషయమే. వెబ్ గేమ్ ద్వారా వ్యాయామాన్ని చేసేందుకు చాలామంది ఆసక్తి చూపారని.. తొలి పైలెట్ పరీక్షల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని లూకాస్ కార్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ ఆట ఆడటం మొదలుపెట్టిన తరువాత ఒక్కో వ్యక్తి సగటున 2200 అడుగులు ఎక్కువ వేశాడని ఇది ఒక మైలు నడకకు సమానమని చెప్పారు. మ్యాప్ట్రెక్ పేరున్న ఈ గేమ్.. వినియోగదారులకు తరచూ చిన్న చిన్న సవాళ్లు విసురుతూ ఎక్కువ శ్రమ పడేలా చేస్తుందని, ఇరుగుపొరుగు వారి వ్యాయామం తీరుతెన్నులను కూడా కలిపడం ద్వారా గేమ్ మరింత ఆసక్తికరంగా మారిందని కార్ వివరించారు. వారం రోజులు ఒక యూనిట్‌గా చేసి నడకకు సంబంధించిన సవాళ్లు విసిరి ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈగేమ్ సత్ఫలితాలిస్తున్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. -
టాప్-5 మార్కెట్లలో భారత్: ఫిట్ బిట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేరబుల్ ఉపకరణాలను విక్రయిస్తున్న ఫిట్‌బిట్‌కు టాప్-5 మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఇక్కడి ఆఫ్‌లైన్ మార్కెట్లో ఫిట్‌బిట్ వాటా 70 శాతం ఉంది. కంపెనీకి భారత్‌లో టాప్-3 సిటీగా హైదరాబాద్ చోటు సంపాదించిందని ఫిట్‌బిట్ ఇండియా జీఎం మనీషా సూద్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 2011 నుంచి 2015 సెప్టెంబరు మధ్య 63 దేశాల్లో కంపెనీ 3 కోట్ల యూనిట్లను విక్రయించింది. వేరబుల్ మార్కెట్ 40-45 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోందని ఆమె చెప్పారు. 2015లో పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 12.6 కోట్ల యూనిట్లు నమోదు చేసిందన్నారు. వేరబుల్ ఉపకరణాలు లైఫ్‌స్టైల్ విభాగంలోకి వచ్చి చేరాయని వివరించారు.