
Manish Malhotra Buys 21 Crore Worth Appartment In Mumbai Bandra: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హొత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయినర్స్ సహా పలువురు సెలబ్రిటీలకు అదిరిపోయే దుస్తులు డిజైన్ చేస్తుంటారాయన. బీటౌన్‌లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హొత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే అనేంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బీటౌన్ ఫ్యాషన్ కలల ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ కాస్ట్యూమ్ డిజైనర్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
ముంబైలో భారీ మొత్తానికి మనీష్ మల్హొత్ర ఓ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బాంద్రా వెస్ట్‌లోని భోజ్వనీ ఎన్‌క్లేవ్‌లో సుమారు రూ. 21 కోట్లు పెట్టి కాస్ట్‌లీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది.