ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అమ్మాయి మోనాలిసా. జీవవోపాధి కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు ఊహించని విధంగా ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియా వల్ల ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు ఏకంగా బాలీవుడ్‌లో మూవీ ఆఫర్ కూడా వరించింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కించనున్న సినిమాలో మోనాలిసా కనిపించనుంది.
అయితే తాజాగా మోనాలిసాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాలో నటించేందుకు కోసం హీరోయిన్‌లా మేకప్ వేసుకుని కనిపించింది. అయితే ఈ వీడియోను ఏఐ సాయంతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఏఐ సాయంతో చేసినప్పటికీ మోనాలిసా మేకోవర్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అచ్చం హీరోయిన్ కటౌట్‌ను తలపిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment