ముంబై ఈవెంట్‌లో మెరిసిన ప్రియాంక.. వాచ్ ధర ఎన్ని కోట్లంటే? | Priyanka Chopra Wears RS 1.5 Crore Watch At Jio MAMI Mumbai Film Festival | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక చోప్రా.. అందరి దృష్టి ఆమె వాచ్‌పైనే!

Published Sat, Oct 28 2023 12:04 PM | Last Updated on Sat, Oct 28 2023 1:04 PM

Priyanka Chopra Wears RS 1.5 Crore Watch At Jio MAMI Mumbai Film Festival - Sakshi


బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడింది. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2023 హాజరైంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌లో ప్రియాంక చోప్రా తళుక్కున మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తన భార్య ఫోటోలు చూసిన నిక్ జోనాస్ కామెంట్ చేశారు. 

(ఇది చదవండి: నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!)

జియో మామి ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభింంచిన ప్రియాంక చోప్రా అనంతరం ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీకి అధికారిక అధ్యక్షురాలిగా  హోదాలో అడుగుపెట్టారు. అద్భుతంగా డిజైన్ చేసిన గౌను ధరించి.. రెడ్‌ కార్పెట్‌పై అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈవెంట్‌లో బాలీవుడ్ భామ ధరించిన లగ్జరీ వాచ్‌పైనే అందరి దృష్టి పడింది. ఆమె వాచ్ విలువు దాదాపు రూ.1.5 కోట్ల విలువైనదిగా తెలుస్తోంది. ప్రియాంక ధరించిన వాచ్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్‌తో తయారు చేసినట్లు సమాచారం. 

ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ముంబై చేరుకుంది ప్రియాంక. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు సోనమ్ కపూర్ అహుజా, రిచా చద్దా, అలీ ఫజల్, దియా మీర్జా, షానయా కపూర్, డయానా పెంటీ లాంటి బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. కాగా.. ముంబయిలో జరుగుతున్న ఈ వేడుక అక్టోబర్ 27 నుంచి  నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. 

(ఇది చదవండి: శివాజీ ఎమోషనల్ వీడియో.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement