
బాలీవుడ్ హీరోయిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న తొలి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషించనుంది. ఇటీవలే ఒడిశాలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
అయితే తాజాగా ప్రియాంక చోప్రాకు అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్ అవార్డ్‌కు ఎంపికైంది. ఈ బాలీవుడ్ స్టార్‌తో పాటు హాలీవుడ్ రాపర్ మేగాన్ థీ స్టాలియన్, అకాడమీ అవార్డు దర్శకుడు ఆంగ్ లీ, చిత్రనిర్మాత జాన్ ఎంచు కూడా ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డ్‌ను ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన లీడర్లకు అందించనున్నారు. ఈ అవార్డ్‌ను మే 10న లాస్ ఏంజిల్స్‌లోని మ్యూజిక్ సెంటర్‌లో జరిగే గోల్డ్ హౌస్ గాలా నాల్గవ వార్షిక సమావేశంలో ప్రియాంక చోప్రాను సత్కరించనున్నారు.
గోల్డ్ హౌస్ గాలా- ఏ100 జాబితాను వెల్లడించనుంది. సంస్కృతి, వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన 100 ఆసియా పసిఫిక్ లీజర్లను ప్రతి ఏటా ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం ఏ100 జాబితా మే 1న వెల్లడించనున్నాురు. ఈ వేడుకకు ముందు సినిమా, సాంకేతికత, మీడియాతో సహా వివిధ పరిశ్రమలకు చెందిన 600 మందికి పైగా అతిథులను ఆహ్వనించనున్నారు.
కాగా.. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హిందీ సినిమాలో దాదాపు 25 ఏళ్ల తన కెరీర్‌లో రాణించింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె ఆమె జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో కలిసి హాలీవుడ్ చిత్రం 'హెడ్స్ ఆఫ్ స్టేట్'లో కూడా కనిపించనుంది.