ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో! | Priyanka Chopra Jonas Wears Diamond Necklace Worth Crore Rupees | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. ఆ డైమండ్ నెక్లెస్‌ ఎన్ని కోట్లంటే!

Published Wed, May 22 2024 5:23 PM | Last Updated on Wed, May 22 2024 7:53 PM

Priyanka Chopra Jonas Wears Diamond Necklace Worth Crore Rupees

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయ అక్కర్లేని పేరు. బీ టౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ప్రముఖ హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించింది. ‍అత్యంత ఖరీదైన నెక్లెస్‌ ధరించిన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

తాజాగా రోమ్‌లో జరిగిన బుల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమానికి  ప్రియాంక హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తన బ్రాండ్  క్లాసీ ఆభరణాలను ధరించింది. దీంతో అందరి కళ్లు ప్రియాంక నెక్లెస్‌పైనే పడ్డాయి.ఇంతకీ ప్రియాంక ధరించిన డైమండ్‌ నెక్లెస్‌ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప్రియాంక వేసుకున్న నెక్లెస్‌ను 140 క్యారెట్ల డైమండ్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం డైమండ్ నెక్లెస్‌ దాదాపు రూ.358 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఆ నెక్లెస్‌ రూపొందించడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో అత్యంత ఖరీదైన నెక్లెస్‌లో ఇది ఒకటిగా నిలిచింది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక హాలీవుడ్‌ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. బాలీవుడ్‌లో ఆమె చివరిసారిగా 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్‌ చిత్రంలో ఫర్హాన్ అక్తర్‌తో కలిసి నటించారు. ప్రస్తుతం ఆమె అలియా భట్, కత్రినా కైఫ్‌తో కలసి జీ లే జరా అనే సినిమాలో కనిపించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement