ఇటీవలే భర్తతో విడాకులు.. దారుణంగా మోసపోయానన్న బుల్లితెర నటి! | Dalljiet Kaur Files FIR Against Estranged Husband Nikhil Patel For Cruelty, Deets Inside | Sakshi
Sakshi News home page

Dalljiet Kaur: మరో మహిళతో ఎఫైర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బుల్లితెర నటి!

Published Sun, Aug 4 2024 4:21 PM | Last Updated on Sun, Aug 4 2024 5:21 PM

Dalljiet Kaur Files FIR Against Estranged Husband Nikhil Patel

బాలీవుడ్ నటి, బుల్లితెర భామ దల్‌జీత్ కౌర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే తన భర్త నిఖిల్‌ పటేల్‌తో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన కుమారునితో పాటు ఇండియాకు తిరిగొచ్చింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయినట్లు దల్జీత్ కౌర్ వెల్లడించింది.

అయితే తాజాగా తన మాజీ భర్త నిఖిల్‌ పటేల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ముంబయిలోని అగ్రిపాడ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చింది. నిఖిల్ తనను మోసం చేశాడని.. అతని తల్లిదండ్రులతో కలిసి వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ ద్వారా వెల్లడించింది. తన ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన ముంబయి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. నేను పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించడానికి చాలా భయపడ్డానని.. కానీ మహిళలకు మనదేశంలో సురక్షితమైన వాతావరణం ఉన్నందుకు పోలీసులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ రోజు నా భావోద్వేగాలను చెప్పకుండా ఉండలేకపోయానని దల్జీత్ కౌర్ రాసుకొచ్చింది.

దల్జీత్‌ కౌర్‌తో విడిపోయిన తర్వాత నిఖిల్ పటేల్ ఇటీవల తన గర్ల్‌ఫ్రెండ్‌ సఫీనా నాజర్‌తో కలిసి ముంబయిలో కనిపించారు. వీరికి సంబంధించిన  ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల అతని పుట్టినరోజున సఫీనా నాజర్ శుభాకాంక్షలు తెలిపింది. కాగా.. సఫీనా నాజర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని దల్జీత్‌ కౌర్‌ ఆరోపించింది. కాగా. గతేడాది మార్చిలో నిఖిల్ పటేల్‌ను దల్జీత్ కౌర్‌ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కెన్యాలోని నిఖిల్‌ ఇంటికి మారారు. అయితే పెళ్లయిన 10 నెలల్లోనే నటి నిఖిల్ నుంచి విడిపోయి ఇండియాకు తిరిగి వచ్చింది. వీరిద్దరు విడిపోవడానికి సఫీనా నాజర్‌తో వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement