Dalljiet Kaur
-
భర్తతో విడాకులు.. టాటూ మార్చేసిన బుల్లితెర నటి
కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన బుల్లితెర నటి దల్జీత్ కౌర్‌కు భంగపాటు ఎదురైంది. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్‌ను రెండో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిన ఆమెకు కొంతకాలానికే అతడితో విభేదాలు మొదలయ్యాయి. అతడి పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుని జీవితాంతం కలిసుందామన్న ఆశలు అడియాసలయ్యాయి. దంపతుల మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చిందని, అందువల్ల తమ బంధం బీటలు వారిందంటూ కొద్ది నెలల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించింది.టాటూతిరిగి ఇండియాకు వచ్చేసింది. తాజాగా ఆమె తన టాటూను మార్చేసింది. అంతకుముందు నిఖిల్‌తో తన జర్నీ ప్రారంభానికి సంకేతంగా 'టేక్ 2.. 07/09/22' అని ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసింది. తల్లీకొడుకుల బంధాన్ని చాటిచెప్పేలా కొత్తగా పచ్చబొట్టును రీడిజైన్ చేసింది. తన కుమారుడు జేడన్ మీద ఉన్న ప్రేమను ఈ టాటూ ద్వారా బయటపెట్టింది. ఈ టాటూ వేయించుకున్నందుకు ఈసారి నొప్పిగా అనిపించలేదని చెప్పింది.రెండు పెళ్లిళ్లు ఫెయిల్‌కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. 2023 మార్చిలో అతడిని పెళ్లి చేసుకోగా ఏడాది తిరగకముందే విడాకులకు దరఖాస్తు చేశారు.చదవండి: ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా : అరవింద్ స్వామి -
ఒక ఆడదాని జీవితం మరో ఆడదే నాశనం చేస్తుంది: నటి
హిందీ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ కోటి ఆశలతో పెళ్లిపీటలెక్కింది. మొదటి బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారినా.. రెండో బంధాన్నయినా కలకాలం కాపాడుకోవాలని ఆరాటపడింంది. నిఖిల్ పటేల్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అతడితోనే జీవితమని భావించి తనతోపాటు విదేశాలకు వెళ్లిపోయింది.నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? కానీ ఆశలన్నీ చెదిరిపోయాయి. కట్టుకున్న భర్త తన ప్రియురాలితో ఇంకా సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుని మనసు ముక్కలైంది. పోట్లాడింది, పోరాడింది. తను మారడని తెలుసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో.. 'నా మెదడులో రెండు ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఒకటి.. అతడు ఏదైతే చేస్తున్నాడో.. దానితో సంతోషంగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? అంటే గతంలో తనకు పబ్లిసిటీ లభించలేదనా?ఆడదానికి ఆడదే శత్రువురెండోది.. ఒక ఆడదానికి ఆడదే శత్రువు.. మహిళ జీవితాన్ని మరో మహిళే నాశనం చేస్తుందని జనాలు చెప్పే మాటలు సత్యం. ఇప్పుడు నేను ఆవిడను తప్పు పట్టడం లేదు. కానీ భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా తనను వదిలిపెట్టనేమో! భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి దూరాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా పెద్ద తప్పు. పైగా తనకు ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అయినా సరే నా భర్త చెంతచేరడమేంటో? దీని వెనక కారణాలేంటో ఎవరికి మాత్రం తెలుసు?' అని రాసుకొచ్చింది.2009లో మొదటి పెళ్లి కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.గొడవలుఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో 2023 మార్చిలో పెళ్లి చేసుకున్నారు. కుమారుడిని తీసుకుని అతడితో పాటు దల్జీత్ లండన్ వెళ్లిపోయింది. కానీ అక్కడ గొడవలు తలెత్తడంతో వివాహమైన పది నెలలకే విడాకులకు దరఖాస్తు చేయడం గమనార్హం. -
ఇటీవలే భర్తతో విడాకులు.. దారుణంగా మోసపోయానన్న బుల్లితెర నటి!
బాలీవుడ్ నటి, బుల్లితెర భామ దల్జీత్ కౌర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే తన భర్త నిఖిల్ పటేల్‌తో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన కుమారునితో పాటు ఇండియాకు తిరిగొచ్చింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయినట్లు దల్జీత్ కౌర్ వెల్లడించింది.అయితే తాజాగా తన మాజీ భర్త నిఖిల్ పటేల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ముంబయిలోని అగ్రిపాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నిఖిల్ తనను మోసం చేశాడని.. అతని తల్లిదండ్రులతో కలిసి వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది. తన ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన ముంబయి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. నేను పోలీసు స్టేషన్లోకి ప్రవేశించడానికి చాలా భయపడ్డానని.. కానీ మహిళలకు మనదేశంలో సురక్షితమైన వాతావరణం ఉన్నందుకు పోలీసులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ రోజు నా భావోద్వేగాలను చెప్పకుండా ఉండలేకపోయానని దల్జీత్ కౌర్ రాసుకొచ్చింది.దల్జీత్ కౌర్‌తో విడిపోయిన తర్వాత నిఖిల్ పటేల్ ఇటీవల తన గర్ల్‌ఫ్రెండ్ సఫీనా నాజర్‌తో కలిసి ముంబయిలో కనిపించారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల అతని పుట్టినరోజున సఫీనా నాజర్ శుభాకాంక్షలు తెలిపింది. కాగా.. సఫీనా నాజర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని దల్జీత్ కౌర్ ఆరోపించింది. కాగా. గతేడాది మార్చిలో నిఖిల్ పటేల్‌ను దల్జీత్ కౌర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కెన్యాలోని నిఖిల్ ఇంటికి మారారు. అయితే పెళ్లయిన 10 నెలల్లోనే నటి నిఖిల్ నుంచి విడిపోయి ఇండియాకు తిరిగి వచ్చింది. వీరిద్దరు విడిపోవడానికి సఫీనా నాజర్‌తో వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. View this post on Instagram A post shared by DALLJIET KAUR ੴ (@kaurdalljiet) -
నటి జ్ఞాపకాలు తొలగించిన భర్త.. నిజాలు మాయం చేయలేవంటూ..
బుల్లితెర నటి దల్జీత్ కౌర్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. తన లైఫ్‌లో దుఃఖానికి చోటు లేదనుకున్న ఆమెకు నిరాశే ఎదురైంది. ఏడాది తిరిగేలోపు పుట్టింటికి వచ్చేసింది. భర్త నిఖిల్ పటేల్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నందువల్లే తన కాపురం కుప్పకూలిందని ఇటీవలే వెల్లడించింది. అయితే తన గురించి ఇలా అడ్డగోలుగా మాట్లాడితే బాగోదని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు.గుర్తులను చెరిపేస్తూ..తాజాగా ఇతడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేశాడు. గతంలో దల్జీత్ వేసిన పెయింటింగ్ కనిపించకుండా గోడకు తెలుపు రంగు వేశాడు. ఇది చూసిన నటి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. గోడ మీద ఉన్న ఆర్ట్‌ను చెరిపేస్తున్నావ్.. కానీ నిజాన్ని నువ్వు మాయం చేయలేవు అని విరుచుకుపడింది.రెండో పెళ్లి కూడా ఫెయిల్‌కాగా గతేడాది మార్చిలో దల్జీత్, నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు. నిఖిల్‌తో ఓ కూతురు కలిసి ఉంటుండగా దల్జీత్‌కు ఓ కుమారుడు ఉన్నాడు. రెండో పెళ్లి కూడా ఫెయిలవడంతో అభిమానులు దల్జీత్ పట్ల సానుభూతి చూపిస్తున్నారు.చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ -
మొన్నే భర్తను తిట్టింది.. ఇప్పుడేమో పెళ్లి వీడియో.. అంతలోనే..
బుల్లితెర నటి దల్జీత్ కౌర్‌కు పెళ్లి అచ్చి రావడం లేదు. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. విడదీయలేని బంధం అనుకునేలోపే మనస్పర్థల వల్ల 2015లో విడాకులు తీసుకున్నారు. తర్వాత దుబాయ్‌లో జరిగిన పార్టీలో నిఖిల్ పటేల్ అని వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. కానీ అప్పటికే భార్యతో విడిపోయి కూతురితో కలిసి జీవిస్తున్నాడు. ఏడాది తిరిగేసరికే..అటు దల్జీత్.. ఇటు నిఖిల్.. ఇద్దరూ సింగిల్ పేరెంట్సే అవడంతో పిల్లల గురించి మాట్లాడుకున్నారు. ఈ కబుర్లు కాస్తా ప్రేమకు దారితీశాయి. దీంతో ఇద్దరూ గతేడాది మార్చిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఏడాది తిరిగేసరికే ఇద్దరి మధ్య ప్రేమ కనుమరుగైంది. మౌనం ఆవహించింది. కొడుకును తీసుకుని దల్జీత్ పుట్టింటికి వచ్చేసింది. పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. భర్త చీటింగ్ చేశాడని సోషల్ మీడియాలో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పెళ్లి వీడియో షేర్ చేసిన నటినెట్టింట ఇంత రచ్చ చేసిన ఆమె శనివారం నాడు గతేడాది జ్ఞాపకాలు అంటూ నిఖిల్‌తో జరిగిన పెళ్లి వీడియో షేర్ చేసింది. అందులో హల్దీ, పెళ్లి, రిసెప్షన్ అన్నీ ఉన్నాయి. నాన్నకు తోడు దొరికిందంటూ నిఖిల్ కూతురు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. పదిహేను నెలల క్రితం అన్న క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేసిన నటి కొద్ది క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేసింది. అప్పటికే అది చూసిన నెటిజన్లు.. అక్కడే ఆగిపోకు.. ముందుకు సాగాలికదా.. అతడు నిన్ను మోసం చేశాడు.. కొంచెమైనా ఆత్మాభిమానం ఉందా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.చదవండి: ఉన్నదంతా స్టార్ హీరోలకే.. మిగతా యాక్టర్స్‌కు ఏం మిగలట్లేదు! -
నటితో విడాకులు.. లిమిట్స్ దాటిపోయిందన్న భర్త!
సినీ ఇండస్ట్రీలో మరో జంట తమ బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. బాలీవుడ్ నటి దల్జీత్ కౌర్, నిఖిల్ పటేల్ విడిపోతున్నారంటూ ఇటీవల రూమర్స్ వచ్చాయి. అంతే కాదు.. నిఖిల్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించింది. దల్జీత్ తన కుమారుడు జేడాన్తో కలిసి ఇండియాకు వచ్చాక.. ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.అయితే దల్జీత్ కౌర్ భర్త నిఖిల్ పటేల్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. నటితో విడిపోయారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఆమెతో విడిపోయినట్లు నిఖిల్ పటేల్ ధృవీకరించాడు. సోషల్ మీడియాలో పెద్దఎత్తున డైవర్స్ రూమర్స్ రావడంతో ఎట్టకేలకు నోరువిప్పాడు.నిఖిల్ పటేల్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తలెత్తాయి. మా వివాహానికి పునాది తగినంత బలంగా లేదు. ఇద్దరికి చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కెన్యాలో ఉండడం వల్ల ఇండియాతో పాటు తన కెరీర్‌ను కోల్పోతోంది. తనకి కెన్యా వాతావరణం నచ్చలేదు. మార్చి 2023లో ముంబయిలో మా పెళ్లి జరిగింది. సంప్రదాయ పద్ధతిలో జరిగినప్పటికీ చట్టబద్ధంగా రిజిస్టర్ కాలేదు. కెన్యాలో జీవించడం ఆమెకు సవాలుగా మారిందని' తెలిపాడు. మా కుమారుడు పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న రోజున ఆమె కెన్యాకు తిరిగి వెళ్లే ఆలోచన లేదని దల్జీత్ తేల్చిచెప్పిందన్నాడు. దల్జీత్ ఇండియాకు తిరిగి వెళ్లడంతో మా బంధానికి ముగింపు పలికింది. ఆమెకు భవిష్యత్‌లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు శుభాకాంక్షలు తెలిపారు.అయితే ఇటీవల సోషల్ మీడియాలో దల్జీత్ చేసిన పోస్ట్‌లు నా మిత్రులు, బంధువులకు బాధను కలిగించాయని అన్నారు. తను నా జీవితంలోకి తిరిగి రావాలనే కోరికను వ్యక్తం చేసింది.. కానీ ఇప్పటికే హద్దులు దాటిందని తెలిపాడు. ఆమె చేసిన పోస్ట్‌లు తప్పుగా అర్థం చేసుకోవడంతో సంబంధం లేని మా కుటుంబం, స్నేహితులను బాధపడ్డారని అన్నాడు. త్వరలోనే ఇలాంటి ప్రవర్తనను ఆపేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు -
చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి
మరో నటి విడాకులు తీసుకుంది. మూడు నెలల క్రితం ఈమె గురించి వచ్చిన వార్తలు నిజమని ఇప్పుడు తేలిపోయింది. స్వయంగా సదరు నటి పోస్ట్ పెట్టడంతో అందరికీ దీని గురించి క్లారిటీ వచ్చేసింది. రెండో భర్త తనని చీటింగ్ చేస్తున్నాడని ఆధారాలతో సహా బయటపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఎవరా నటి? ఏం జరిగింది?'చూపులు కలిసిన శుభవేళ' అనే డబ్బింగ్ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి దల్జీత్ కౌర్.. 2009లో షాలిన్ బానోత్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జైడన్ అనే కొడుకు ఉన్నాడు. మనస్పర్థలు కారణంగా 2015లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. కొడుకుతో కలిసి ఉంటున్న ఈమె ఓసారి దుబాయిలో జరిగిన ఓ పార్టీకి వెళ్లగా అక్కడ నిఖిల్ పటేల్ అనే వ్యక్తి ఈమెకు పరిచయమయ్యాడు.(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)దల్జీత్ పరిచయం అయ్యేటప్పటికే నిఖిల్ విడాకులు తీసుకుని జీవిస్తున్నాడు. ఓ కూతురు ఇతడి దగ్గర పెరుగుతోంది. అలా పిల్లల గురించి మాట్లాడుకున్న వీళ్లిద్దరూ కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. గతేడాది మార్చిలో లండన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఈ ఏడాది ఫిబ్రవరిలో దల్జీత్, కొడుకుని తీసుకుని తిరిగి ఇండియాకు వచ్చేసింది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిపై దల్జీత్ అప్పుడేం స్పందించలేదు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసింది.భర్త నిఖిల్ పటేల్ తనని మోసగించాడని, వేరొకరితో రిలేషన్లో ఉన్నాడని ఈమె ఆరోపించింది. స్క్రీన్ షాట్ కూడా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీనిబట్టి చూస్తే వీళ్లిద్దరి విడాకులు తీసుకున్నారని తేలింది. (ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!) -
రెండో భర్తకు విడాకులు.. ఆ ఫోటోలు డిలీట్, భర్త ఇంటి నుంచి..
'ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. జీవితంలో ఈ రెండూ అన్నింటికన్నా ఎంతో ప్రాముఖ్యమైనవని, అలాగే వాటిని బాధ్యతగా పూర్తి చేయడం అంతకన్నా కష్టతరమైనవని చెప్పకనే చెప్పారు. కానీ పెళ్లి చేయడం ఒక ఎత్తయితే దాన్ని కలకాలం నిలబెట్టడం కత్తి మీద సాముగా మారింది. కొందరు వివాహమైన కొంతకాలానికే విడాకులు తీసుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ అంటూ రెండో పెళ్లికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు, కానీ అది నిలబెట్టుకోవడం కూడా కష్టంగానే ఉంది. బుల్లితెర నటి దల్జీత్ కౌర్ కూడా ఈ కోవలోకే వస్తుంది.మనస్పర్థలతో భర్తకు దూరంచూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్లపాటు తన కుమారుడితో కలిసి ఒంటరిగా ఉన్న దల్జీత్.. దుబాయ్‌లో జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్ పటేల్ అనే వ్యక్తిని కలిసింది. అతడికి అప్పటికే పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి విడిగా జీవిస్తున్నాడు (ఒకరు తల్లితో ఉంటే మరో అమ్మాయి ఇతడితోనే ఉంది).రెండో పెళ్లి.. ఫోటోలు డిలీట్ చేసిన నటిపార్టీలో ఇతడు తన పిల్లల గురించి, దల్జీత్ తన కొడుకు గురించి మాట్లాడింది. అలా పిల్లల మీద వారికున్న ప్రేమ ఇద్దరినీ కలిపింది. ఏడాది పాటు ప్రేమలో చెట్టాపట్టాలేసుకుని తిరిగాక గతేడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు. కొడుకును తీసుకుని అతడితోపాటు లండన్‌లో సెటిలైందీ బ్యూటీ. సడన్‌గా ఈ మధ్యే లండన్ నుంచి ఇండియాకు వచ్చేసింది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. తన బయోలో కూడా పటేల్ అనే పదాన్ని తొలగించింది. దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.నటి తల్లిదండ్రులకు సర్జరీదీనిపై నటి టీమ్ స్పందించింది. 'దల్జీత్, ఆమె కుమారుడు జైడన్ ఇండియాలోనే ఉన్నారు. దల్జీత్ తల్లిదండ్రులకు సర్జరీ చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఆమె వారితో ఉండటం చాలా అవసరం. ఇలాంటి సమయంలో ఆమె ఏ అంశం గురించీ మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే మొత్తం వ్యవహారంలో పిల్లలు కూడా ఉన్నారు. వారి గోప్యతకు భంగం కలిగొంచవద్దు' అని ప్రకటన విడుదల చేసింది. దీంతో విడాకుల వార్తలు నిజమేనని ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు నెటిజన్లు. పెళ్లయి ఏడాది కూడా అవకముందే ఇలా విడిపోయారేంటని షాకవుతున్నారు.చదవండి: ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అప్పటినుంచే స్ట్రీమింగ్.. -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని జరిగిన ఈ వేడుకలో ఆమె నిఖిల్ పటేల్‌ను వివాహమాడారు. తాజాగా వీరిపెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అంతకు ముందు జరిగిన మెహందీ, సంగీత్ వేడుకల్లో పలువురు నటీనటులు పాల్గొని సందడి చేశారు.ఇటీవలే బిగ్ బాస్- 16లో పాల్గొన్న నటుడు షాలిన్ భానోత్‌ను దల్జీత్ కౌర్ ఇదివరకే వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత తన కుమారుడు జేడన్తో కలిసి కెన్యాలోని నైరోబీకి మారనున్నారు దల్జీత్ కౌర్. 2014లో దల్జీత్, షాలిన్లకు బాబు జన్మించారు. ఆమె ఫిబ్రవరిలోనే నిఖిల్ పటేల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే నిఖిల్ పటేల్‌కు ఇదివరకే పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పదమూడేళ్ల అరియానా, ఎనిమిదేళ్ల ఆనిక ఆయన సంతానం. మెహందీ ఫంక్షన్లో ఇద్దరు అమ్మాయిలు పాల్గొన్నారు. కాగా.. నిఖిల్‌ను దుబాయ్‌లో ఓ పార్టీలో కలిసిన దల్జీత్ కౌర్.. ఆ తర్వాత జనవరిలో నేపాల్‌లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by DALLJIET KAUR PATEL ੴ (@kaurdalljiet) -
10 ఏళ్ల కొడుకే ఆమె ప్రాణం.. రెండో పెళ్లికి సిద్ధమైన నటి, ఆరోజే వెడ్డింగ్!
రెండక్షరాల పెళ్లి రెండు జీవితాలనే కాదు రెండు కుటుంబాలను ఒకటి చేస్తుంది. జీవితాంతం కలిసి ఉండమని దంపతులను ఆదేశిస్తుంది. జంటగా కష్టసుఖాల సంసార సాగరాన్ని దాటాలని హితబోధ చేస్తుంది. కానీ కాలం మారేకొద్దీ పెళ్లిళ్లు చేసే విధానాలు మారిపోతున్నాయి. కానీ ఆ వివాహబంధం చెప్పే సూత్రాలు మాత్రం అలాగే నిలిచుండిపోయాయి.బాలీవుడ్లో అయితే ప్రేమ, పెళ్లి, విడాకులు, మరో పెళ్లి.. ఇది చాలా కామన్ అయిపోయింది. తాజాగా ఈ జాబితాలోకి నటి, బిగ్‌బాస్ బ్యూటీ దల్జీత్ కౌర్ వచ్చి చేరింది. త్వరలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది. యూకేకు చెందిన నిఖిల్ పటేల్‌తో మార్చి 18న ఆమె వివాహం జరగనుంది. 17వ తేదీ నుంచి ఆమె పెళ్లి పనులు షురూ కానున్నాయి. ఇటీవలే తన లవ్‌స్టోరీని బయటపెట్టింది దల్జీత్. ఫ్రెండ్స్ పార్టీలో ఒకరినొకరు తొలిసారి కలుసుకోగా ఇద్దరూ వారివారి పిల్లల గురించే కబుర్లు మాట్లాడుకున్నారు. పిల్లలపై ఉన్న బాధ్యతే తమను ప్రేమలో పడేలా చేసిందని వెల్లడించింది. ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే నిఖిల్ ప్రస్తుతం నైరోబీలో వర్క్ చేస్తున్నాడు. కాబట్టి పెళ్లవగానే మొదట దల్జీత్ నైరోబీకి వెళ్లనున్నట్లు పేర్కొంది. అక్కడ పని పూర్తవగానే అతడి స్వస్థలమైన లండన్‌కు చెక్కేస్తారట! ఇకపోతే దల్జీత్ కౌర్ హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పాల్గొంది. గతంలో ఆమె షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. అతడు ఇటీవలే బిగ్‌బాస్ 16వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేశాడు. వీరికి జైడన్ అనే పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కానీ దల్జీత్, షాలిన్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. దల్జీత్.. కులవధు, సంతాన్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ?(చూపులు కలిసిన శుభవేళ), కాలా టీకా, కాయామత్కీ రాత్, గుడ్డన్: తుమ్సే నా హో పాయేగా, సాసురాల్ జెండా ఫూల్ 2 వంటి సీరియల్స్‌లో నటించింది. అటు నిఖిల్‌కు కూడా ఇదివరకే పెళ్లవగా ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు తల్లితో ఉంటే మరొకరు తండ్రితో ఉంటున్నారు. View this post on Instagram A post shared by DALLJIET KAUR ੴ (@kaurdalljiet) చదవండి: ఊహించని సర్ప్రైజ్.. ఏడ్చేసిన మంచు విష్ణు