భర్తతో విడాకులు.. టాటూ మార్చేసిన బుల్లితెర నటి | Dalljiet Kaur Modifies Tattoo, See Photo | Sakshi
Sakshi News home page

Dalljiet Kaur: బుల్లితెర నటి కొత్త పచ్చబొట్టు.. అర్థమేంటంటే?

Published Thu, Oct 3 2024 7:54 PM | Last Updated on Thu, Oct 3 2024 8:57 PM

Dalljiet Kaur Modifies Tattoo, See Photo

కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన బుల్లితెర నటి దల్జీత్‌ కౌర్‌కు భంగపాటు ఎదురైంది. వ్యాపారవేత్త నిఖిల్‌ పటేల్‌ను రెండో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిన ఆమెకు కొంతకాలానికే అతడితో విభేదాలు మొదలయ్యాయి. అతడి పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుని జీవితాంతం కలిసుందామన్న ఆశలు అడియాసలయ్యాయి. దంపతుల మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చిందని, అందువల్ల తమ బంధం బీటలు వారిందంటూ కొద్ది నెలల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించింది.

టాటూ
తిరిగి ఇండియాకు వచ్చేసింది. తాజాగా ఆమె తన టాటూను మార్చేసింది. అంతకుముందు నిఖిల్‌తో తన జర్నీ ప్రారంభానికి సంకేతంగా 'టేక్‌ 2.. 07/09/22' అని ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసింది. తల్లీకొడుకుల బంధాన్ని చాటిచెప్పేలా కొత్తగా పచ్చబొట్టును రీడిజైన్‌ చేసింది. తన కుమారుడు జేడన్‌ మీద ఉన్న ప్రేమను ఈ టాటూ ద్వారా బయటపెట్టింది. ఈ టాటూ వేయించుకున్నందుకు ఈసారి నొప్పిగా అనిపించలేదని చెప్పింది.

రెండు పెళ్లిళ్లు ఫెయిల్‌
కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ ధూ) ఫేమ్‌  దల్జీత్‌.. 2009లో నటుడు షాలిన్‌ బానోత్‌ను పెళ్లాడింది. వీరికి జైడన్‌ అనే కుమారుడు జన్మించాడు. ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్‌ అనే వ్యక్తిని కలిసింది. 2023 మార్చిలో అతడిని పెళ్లి చేసుకోగా ఏడాది తిరగకముందే విడాకులకు దరఖాస్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement