నటితో విడాకులు.. లిమిట్స్‌ దాటిపోయిందన్న భర్త! | Nikhil Patel CONFIRMS Separation With Dalljiet Kaur | Sakshi
Sakshi News home page

Dalljiet Kaur: 'దల్జీత్‌ కౌర్‌తో విడాకులు.. ఆమె వల్ల మా కుటుంబం బాధపడింది'

Published Thu, May 30 2024 4:27 PM | Last Updated on Thu, May 30 2024 5:16 PM

Nikhil Patel CONFIRMS Separation With Dalljiet Kaur

సినీ ఇండస్ట్రీలో మరో జంట తమ బంధానికి ఎండ్‌ కార్డ్‌ వేశారు. బాలీవుడ్‌ నటి దల్జీత్ కౌర్‌, నిఖిల్‌ పటేల్ విడిపోతున్నారంటూ ఇటీవల రూమర్స్‌ వచ్చాయి. అంతే కాదు.. నిఖిల్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించింది. దల్జీత్‌ తన కుమారుడు జేడాన్‌తో కలిసి ఇండియాకు వచ్చాక.. ఈ రూమర్స్‌ మరింత ఎక్కువయ్యాయి.

అయితే దల్జీత్‌ కౌర్‌ భర్త నిఖిల్‌ పటేల్‌ తాజాగా ఈ విషయంపై స్పందించారు. నటితో విడిపోయారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఆమెతో విడిపోయినట్లు నిఖిల్ పటేల్‌ ధృవీకరించాడు. సోషల్ మీడియాలో పెద్దఎ‍త్తున డైవర్స్ రూమర్స్ రావడంతో ఎట్టకేలకు నోరువిప్పాడు.

నిఖిల్‌ పటేల్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య ఉన్న  విభేదాలు తలెత్తాయి. మా వివాహానికి పునాది తగినంత బలంగా లేదు. ఇద్దరికి చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కెన్యాలో ఉండడం వల్ల ఇండియాతో పాటు తన కెరీర్‌ను కోల్పోతోంది. తనకి కెన్యా వాతావరణం నచ్చలేదు. మార్చి 2023లో ముంబయిలో మా పెళ్లి జరిగింది. సంప్రదాయ పద్ధతిలో జరిగినప్పటికీ చట్టబద్ధంగా రిజిస్టర్‌ కాలేదు. కెన్యాలో జీవించడం ఆమెకు సవాలుగా మారిందని' తెలిపాడు. మా కుమారుడు పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న రోజున ఆమె కెన్యాకు తిరిగి వెళ్లే ఆలోచన లేదని దల్జీత్‌ తేల్చిచెప్పిందన్నాడు. దల్జీత్‌ ఇండియాకు తిరిగి వెళ్లడంతో మా బంధానికి ముగింపు పలికింది.  ఆమెకు భవిష్యత్‌లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో దల్జీత్‌ చేసిన పోస్ట్‌లు నా మిత్రులు, బంధువులకు బాధను కలిగించాయని అన్నారు. తను నా జీవితంలోకి తిరిగి రావాలనే కోరికను వ్యక్తం చేసింది.. కానీ ఇప్పటికే హద్దులు దాటిందని తెలిపాడు. ఆమె చేసిన పోస్ట్‌లు తప్పుగా అర్థం చేసుకోవడంతో సంబంధం లేని మా కుటుంబం, స్నేహితులను బాధపడ్డారని అన్నాడు. త్వరలోనే ఇలాంటి ప్రవర్తనను ఆపేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement