చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి | Dalljiet Kaur Confirms Separation From Second Husband Nikhil Patel | Sakshi
Sakshi News home page

Dalljiet Kaur: రూమర్స్ నిజమే.. విడాకులపై నటి షాకింగ్ పోస్ట్

Published Sat, May 25 2024 4:21 PM | Last Updated on Sat, May 25 2024 4:32 PM

Dalljiet Kaur Confirms Separation From Second Husband Nikhil Patel

మరో నటి విడాకులు తీసుకుంది. మూడు నెలల క్రితం ఈమె గురించి వచ్చిన వార్తలు నిజమని ఇప్పుడు తేలిపోయింది. స్వయంగా సదరు నటి పోస్ట్ పెట్టడంతో అందరికీ దీని గురించి క్లారిటీ వచ్చేసింది. రెండో భర్త తనని చీటింగ్ చేస్తున్నాడని ఆధారాలతో సహా బయటపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఎవరా నటి? ఏం జరిగింది?

'చూపులు కలిసిన శుభవేళ' అనే డబ్బింగ్ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి దల్జీత్ కౌర్.. 2009లో షాలిన్ బానోత్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జైడన్ అనే కొడుకు ఉన్నాడు. మనస్పర్థలు కారణంగా 2015లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. కొడుకుతో కలిసి ఉంటున్న ఈమె ఓసారి దుబాయిలో జరిగిన ఓ పార్టీకి వెళ్లగా అక్కడ నిఖిల్ పటేల్ అనే వ్యక్తి ఈమెకు పరిచయమయ్యాడు.

(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్‌ మీ’మూవీ రివ్యూ)

దల్జీత్ పరిచయ‍ం అయ్యేటప్పటికే నిఖిల్ విడాకులు తీసుకుని జీవిస్తున్నాడు. ఓ కూతురు ఇతడి దగ్గర పెరుగుతోంది. అలా పిల్లల గురించి మాట్లాడుకున్న వీళ్లిద్దరూ కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. గతేడాది మార్చిలో లండన్‍‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఈ ఏడాది ఫిబ్రవరిలో దల్జీత్, కొడుకుని తీసుకుని తిరిగి ఇండియాకు వచ్చేసింది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిపై దల్జీత్ అప్పుడేం స్పందించలేదు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసింది.

భర్త నిఖిల్ పటేల్ తనని మోసగించాడని, వేరొకరితో రిలేషన్‌లో ఉ‍న్నాడని ఈమె ఆరోపించింది. స్క్రీన్ షాట్ కూడా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీనిబట్టి చూస్తే వీళ్లిద్దరి విడాకులు తీసుకున్నారని తేలింది. 

(ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement